Music, asked by prabhav1119, 7 months ago

ఇక్కడ ఎవరికైనా సంగీతం వచ్చా? తెలిసి వుంటే సప్త తాళములు అనగా ఏంటి?

దయచేసి వివరించండి ​

Answers

Answered by sirigirijyothiraj
0

Explanation:

సంగీత ప్రపంచమున కంతయు సప్తస్వరము లెట్లు వునాదియో అట్లే తాళ లోకమునకు సప్త తాళములు పునాది. అవి ధ్రువతాళము, మఠ్య తాళము, రూపక తాళము, ఝంపె తాళము, త్రిపుట తాళము, ఆట తాళము, ఏక తాళము. ఈ తాళముల గూర్చి క్రింది శ్లోకములో చూడవచ్చు.

“ధృవమఠ్యారూపకశ్చ ఝంపాత్రిపుట యేవచ

అటతాళే కతాళేచ సప్త తాళ ప్రకీర్తితః”

ఈ సప్త తాళములు వారము యొక్క సప్త దినములలో పుట్టినట్లును సప్త నక్షత్రములలో సప్త రంగులు కలవి యైనట్లును పూర్వీకులు వ్రాసిన శ్లోకముల వల్ల తెలియుచున్నవి.

Similar questions