India Languages, asked by 1610020045, 7 months ago

దర్మరాజు పలికిన
శాంతివచనాలు​

Answers

Answered by sharmagaurav7800
2

Answer:

వైశంపాయనుడు జనమేజయునకు చెప్పిన మహాభారత కథను సూతుడు శౌనకాది మునులకు చెప్పసాగాడు. ఆ విధంగా ధర్మరాజు తన తమ్ములతో యుద్ధంలో ఇరువైపులా మరణించిన బంధు మిత్రులకు ఉదకకర్మలు నిర్వహించారు. తమతమ బంధువుల వలన కలిగిన అశౌచము తీరేవరకు గంగా నదీతీరంలో సమతల ప్రదేశం ఎంచుకుని కుటీరాలు నిర్మించుకుని నివసించసాగారు. ధృతరాష్ట్రుడు, విదురుడు తమ తమ భార్యలతో అక్కడ ఒకనెల కాలం నివసించారు. ఆ సమయంలో అక్కడకు వ్యాసుడు, దేవలుడు, కణ్వుడు, నారదుడు మొదలైన మహామునులు ధర్మరాజును చూడడానికి వచ్చారు. ధర్మరాజు తన తమ్ములు ద్రౌపదితో చేరి వారికి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి సత్కరించాడు. అప్పుడు నారదుడు ధర్మరాజుతో " ధర్మజా ! నీవు అదృష్టవంతుడవు. నీమేలు కోరుతూ శ్రీకృష్ణుడు ఎల్లప్పుడూ నీ వెంట ఉంటాడు. మహాబలశాలి అర్జునుడి సాయంతో నీవు ఈ భూమండలాన్ని జనరంజకంగా సేవిస్తావు. ధర్మజా ! ఇంతటి ఘోరయుద్ధం సంభవించినప్పుడు కూడా నీవు నీ ధర్మమును వీడ లేదు. నీ ధర్మనిరతి నీకు విజయాన్ని చేకూర్చినందుకు నీవు సంతోషిస్తున్నావా ? " అని అడిగాడు.

Answered by nishasharma7800ns
0

Answer:

s9d958rs9ts95er8a9taw7s9t

Similar questions
Math, 11 months ago