India Languages, asked by Tejashree20, 5 months ago

తెలంగాణ గొప్పతనపు విశేషాలు కొన్ని తరాలవరకు దుర్మార్గుల చేతిలో చిక్కుకొన్నాయి " అన్న కవి మాటలను మీరెట్లా సమర్థిస్తారు ?​

Answers

Answered by anandachandra1980
22

Answer:

వీర రసం ఉత్సాహాన్ని నింపుతుంది. ఆమాట వినడంతోనే ఎవరికైనా ఉత్సాహోద్రేకాలతో మనసుపులకరిస్తుంది. శరీరం రోమాంచితం అవుతుంది.

వీరమాత, వీరపత్ని, వీరనారి, వీరపుత్రుడు, వీరపుత్రిక, వీరుడు అనే పదాల్లోనే ఎంతో ప్రేరణనిండి ఉంది.

అదేమాట ఒకదేశానికి, రాజ్యానికి, ప్రాంతానికి అన్వయించినప్పుడు అక్కడి ప్రజలందరిలోనూ అది నూతనోత్తేజాన్ని నింపుతుంది.

నిజాం పాలనకు చరమగీతం పాడటంలో తెలంగాణ ప్రజలు చూపిన ధైర్యసాహసాలు, పట్టుదల, త్యాగం సామాన్యమైనవి కావు. వీటన్నిటినీ ‘వీర తెలంగాణ’అనే ఒక్కమాట ఆవిష్కరిస్తుంది.

దాశరథి ఈ పేరు నిర్ణయించడంలో ఎంతో ఔచిత్యముంది. ఈ పాఠంలో తెలంగాణ విముక్త పోరాటంలో ఇక్కడి ప్రజలు ఎంత తెగింపు చూపించారో, ఎంత ధైర్యాన్ని ప్రదర్శించారో, ఎన్ని కష్ట నష్టాలను సహించారో కళ్లకు కట్టినట్లు వర్ణించారు దాశరథి.

తెలంగాణలో గడ్డిపోచకూడా కృపాణం ధరించింది.

తెలంగాణ తల్లి స్వయంగా ఈడొచ్చిన తన పిల్లలకు కత్తులిచ్చి యుద్ధ రంగానికి పంపింది.

వీరులు స్వాతంత్య్రకాంతిని సముద్రంగా మార్చి నేల అంతటా పారించారు.

చుట్టూ ఉన్న స్వాతంత్య్ర సాగరాలను ఇక్కడికి రప్పించేందుకు అడ్డుగా ఉన్న కట్టలకు గండి కొట్టారు.

మతపిశాచం ఎంతటి భయంకర పరిస్థితులు కల్పించినా చలించకుండా నిలిచి స్వాతంత్య్రం సాధించారు.

ఈ నేలను కాకతీయులు శత్రువులు కలవరపడేటట్లు పాలించారు.

రుద్రమదేవి యుద్ధ విజయాల జెండాలు ఆకాశంలో రెపరెపలాడించింది.

కాపయనాయకుని విజృంభణతో శత్రువుల గుండెలు అగిపోయాయి.

చాళుక్యుల పాలనలో విజయ వాద్యాలు నిరంతరం మోగేవి

శ్రావణమేఘ గంభీరంలా ఈ తెలంగాణ నిరంతరం గర్జిస్తూ ముందుకు సాగుతూనే ఉంటుంది.

పాఠం అంతా ఇలాంటి వీరరస వర్ణనతో నిండిపోయినప్పుడు ‘వీరతెలంగాణ’కు ఈ పేరును నూటికి నూరు శాతం సరిపోతుంది.

hope its help you

Answered by NARTHAN
2

I HOPE ITS HELP YOU

THANK YOU

Attachments:
Similar questions