World Languages, asked by molurilaxman, 7 months ago

• అందమైన పల్లెటూరు చిత్రాలను సేకరించండి. పల్లెకు సంబంధించిన కవిత /పాట సేకరించి ప్రదర్శించండి.
మీ మిత్రులు రాసినవన్నీ ఒక చోట చేర్చి సంకలనం తయారు చేయండి.plz fast boys and girls​

Answers

Answered by 20VS1010046
11

Answer:

నీలంరాజు నరసింహారావు గారు వ్యవసాయంలోనూ కవితా వ్యాసంగంలోనూ కూడా బాగా కృషి చేసిన వారు. అద్దంకి

దగ్గర్లో ఉన్న కలవకూరు గ్రామం స్వగ్రామం; అక్కడే చాలా కాలం ఉన్నారు. ఆ అనుభవాల గురించి ఈ మధ్య

వారు రాసిన పద్యాలు ఇవి. సొంత చోటు నుంచి దూరమైన అందరికీ వర్తించే భావాలెన్నో కన్పిస్తాయిందులో!)

పుట్టితి పల్లెటూర మదిపూనిక వార్థక మొందుదాక అ

ప్పట్టున పెర్గినాడ నతిప్రాభవ వైభవ గౌరవంబులన్‌

బెట్టుగ ధర్మ మార్గమున విత్తము కూర్చితి తృప్తి మీర నా

కెట్టకు ప్రాప్తిలెన్‌నగర హృద్యపు కృత్రిమ జీవితంబిటన్‌

తాతల తండ్రులన్‌దనుక ధర్మపథంబున గ్రామవాసమున్‌

ప్రీతిగ సేద్యపుం కృషిని వృత్తిగ చేకొని చేయుచుండితిన్‌

వేతన వృత్తికిం తవిలి స్వేఛ్ఛ పణంబుగ నేడు పట్నవా

సాతప తాపమున్‌పొగులుటయ్యెను చల్లని పల్లె వీడుటన్‌

ఎంత ధనమున్న భోగములెన్ని యున్న

మేని శ్రమ లేని వసతులుం పెక్కులున్న

పారతంత్య్రపు కృత్రిమ పట్టణంపు

వాసమెంతయు పల్లెకు సాటియౌనె!

పట్నవాసపు సుందర భవనమందు

శయనమొందగ మృదు తల్ప శయ్య యందు

ప్రతిఫలించును నా మనఃఫలకమందు

పుట్టి పెరిగిన మాయూరి పూర్వస్మృతులు!

దోగియాడగ నింట ధూళి మేనున నంట

కాయంబు వజ్రమై గట్టివడియె

పిన్నవయసు నందు వీధుల పరుగిడ

వీధి దుమ్ములు మేన పేరుకొనియె

సంధ్య వేళల క్రమ్ము సారంపు గోధూళి

తనువును ధూసరితమ్ము చేసె

పూటపూటను పంట పొలముల తిరుగాడ

శివధూళి రేగి నా శిరము నంటె

మసలి పెరిగితి మాయూరి మంటి పైన

నాటి మాయూరి మృత్తికే నాదు మేను!

తృప్తి త్రావితి మాయూరి తీపి నీరు

త్రేవ గుడిచితి మాయూరి తిండి రుచుల.

మలయపవనముల్‌మాయూరి మారుతములు

గాంగ పావన జలము మాయూరి జలము

కాలు న్యాయపు తీర్పు మా కాపు తీర్పు

పౌర ధర్మాను బద్ధము ప్రజల వృత్తి

ప్రాతరమందునన్‌వెలుగు పారగ చల్లని పిల్ల తెమ్మెరల్‌

ప్రీతిని హాయి గొల్ప చిరుబెత్తము చేగొని శాలి సస్య ప

ర్యాతత మాన్యముల్‌కనగ హాలికవృత్తిని పోవుచుందు నే

నాతరి చూడగన్‌పొలము, హర్షము పొంగును మానసంబునన్‌

పైరు వేత కోత పరువు వచ్చినపుడు

కర్షక జనాళి సందడి కనగ ప్రీతి

పల్లెపాటల లయలతో భావగతుల

సంబరంబులు వేడ్కతో సల్పుచుంద్రు

పుష్య మాసము చొరబడ పుష్కలముగ

పైరు ఫలియించి కోతకు పరువు నొందు

హిమముతోడుత వెచ్చని యెండ కాయ

చూడ చూడంగ ప్రకృతియు శోభ గొల్పు

పంటలు నూర్చు కాలమున పల్లెల పెండిలి సందడేర్పడన్‌

వంటల పాయసాన్నములు భక్ష్యములెప్పటి కంటె మిన్నగా

ఇంట గలట్టి యాండ్రు తినిపింతురు పంటల నూర్చు వారికిన్‌

కంటికి విందు సేయు నిలుకప్పులు దాకెడు ధాన్య రాశులున్‌

మెదలుచుండును మనమున ప్రీతి గూర్చ

నాటి పల్లెలు సౌహార్ద న్యాయ వృత్తి

సిరుల వైభవ శోభల చెలగి యుంటి

కాని నేడవి కళ దప్పి కానుపించు

ఎన్నగ రాజకీయముల హెచ్చుగ పాల్గొని దేశపాలనన్‌

మిన్నగ నేడు చేయునది మిత్రులు పల్వురు పల్లె రైతులే

ఎన్నడు రైతు కష్టములొకింతయు వారు తలంపరైరిగా

మన్నన రైతుబాంధవులె మాటల; శూన్యులు సేతలన్‌తగన్‌

హాలిక వృత్తి నేడు కడు దైన్యము బొందెడు నార్థికంబుగా

జాలిని గొల్పు రైతు అగచాట్ల తలంచిన చీడ పీడలన్‌

చాలయె పంట నష్టములు, వల్లని ఖర్చులు, కల్తి యెర్వులున్‌

చాలని అమ్మకంపు ధర శక్తికి మించిన అప్పు బాధలున్‌

ఈ రీతిం కడు దైన్యపు స్థితిని నేడీ రైతు గాసింబడన్‌

కారుణ్యంబున ఈ ప్రభుత్వమయినన్‌సాయంబు చేకూర్చమిన్‌

నైరాస్యంబున ప్రత్తి రైతు తనువున్‌త్యాగంబు చేసెన్‌తుదన్‌

దారింగానక రైతు లోకమిపుడున్‌దౌర్భాగ్యమున్‌చెందెడిన్‌

Explanation:

Answered by qwblackurnrovers
6

మా గ్రామంబూడ్దిపాలీ ఒక్క పాట

  • స్వచ్ఛమైన ప్రకృతి అందాలతో, మంచుతో కప్పబడిన కాంచన్ జుంగా పర్వత శిఖరాల నేపధ్యంలో రవంగ్లా గ్రామం ఎంతో సుందరంగా కనిపిస్తుంది.
  • ఉత్కంఠభరితమైన లోయలు, లోతైన హిమాలయన్ అడవులతో నిండి ఉండే ఈ గ్రామం ప్రకృతి ప్రేమికులకు ఓ స్వర్గధామంలా అనిపిస్తుంది.
  • వైవిధ్యమైన వృక్షజాలం, జంతుజాలంతో ఈ ప్రాంతం సందర్శకుల మనసు దోచుకుంటుంది. అంతేకాదు ఇక్కడ అనేక రకాల అరుదైన హిమాలయన్ పక్షులను కూడా చూడవచ్చు. పక్షి ప్రేమికులు దీనిని ఎంతో ఇష్టపడతారు.
  • విశాలమైన ఇళ్లు, ఇళ్లముందు పచ్చని చెట్లు, పుష్పాల గుబాళింపు, పక్షుల కిలకిలరావాలు, పచ్చని పొలాలు, చెరువులో చేపల సందడి గ్రామాల్లో మనకు దర్శనమిస్తాయి.
  • పొలాలపై నుంచి వచ్చే పైరుగాలికి తన్మయం చెందనివారు ఎవరు? ఒక్కో గ్రామదేవత ఆలయానికి ఒక్కో ప్రత్యేక గాథ.
  • కల్మషం లేని ఆత్మీయ పలకరింపులు మనల్ని కట్టి పడేస్తాయి. లేగదూడల విన్యాసాలు, కులవృత్తుల పనితీరు పల్లెసీమకు కొత్త అందాలను అద్దుతాయి. అక్కడ అసూయలు ఉండవు.

కవిత /పాట:

"ఆకుమడి పచ్చగా ఉంది. ఆవు తింటోంది

ఎద్దులు కుప్ప నూర్పుడికైతే | గంతేసి వస్తాయి. మొరాయిస్తాయి.

కుక్క పెరుగన్నమూ తినదు కూరన్నమూ వద్దు వొక్క ఎముక ముక్క చాలు అన్నమంతా తినేస్తుంది.

ఆఫీసుకు టైమయిందేమొ | బస్సు పిల్లల కోడిపెట్టయింది.

కురిసికురిసి ఆకాశం అలిసింది.

సముద్రం నీరు పట్టించండి పరిగెత్తి పరిగెడీ నరికి కాళ్ళు

చెలియలికట్ట దగ్గర కాస్త విశ్రమించనీయండి."

#SPJ3

Similar questions