India Languages, asked by Rgangadhar59135, 4 months ago

పడవలో ఏయే సౌకర్యాలున్నాయె పాఠం ఆధారంగా వివరించండి​

Answers

Answered by Teluguwala
4

2. సముద్ర ప్రయాణం

- ముద్దు రామకృష్ణయ్య

పడవలో ఉండే సౌఖర్యాలు :

➠ పడవలో హాస్పిటల్ కూడా ఉంటది. డబ్బు తీసుకోకుండానే సామాన్య రోగాలకు మందులు ఇస్తారు. రోగులు లేవలేకుంటే డాక్టర్లు, నర్సులు క్యాబిన్ కి వస్తారు. మందులు క్యాబిను పంపుతారు.

➠ పోస్టు ఆఫీసు కూడా ఉంటుంది. తరువాతి రేవు రాకముందే పోస్టులో జాబులు వేయమని నోటీసు పెట్టుతారు. మనకు జాబు వస్తే క్యాబిన్ కు పంపుతారు.

➠ టెలిగ్రాఫ్ ఆఫీసు (వైర్‌లెస్) కూడా ఉంటుంది. మనకు టెలిగ్రాములు వస్తే ఇస్తారు. మనం కూడా టెలిగ్రాములు ఇవ్వవచ్చు.

➠ పడవలో “రిసెప్షన్‌ రూం” కూడా ఉంటుంది. అది రాత్రి పగలు ఖుల్లా ఉంటుంది. మనకు కావలసిన విషయాలన్నీ తెలుపుతారు.

➠ పడవలో దుకాణము కూడా ఉంటుంది. అన్ని వస్తువులు దొరుకుతవి.

➠ పడవపైన రేడియోలు ప్రతి డెక్ పైన లౌడు స్పీకర్లతో కనెక్టు చేయబడి ఉంటవి. పడవవారు రేడియో వార్తలు అప్పటికప్పుడు టైపు చేయించి, సైక్లోస్టైల్ కాపీలు లాంజ్ లో పెట్టించేవారు.

➠ పీరియాడికల్స్ కూడా లాంజ్ లో పెట్టేవారు. లాంజ్ లోని ఫర్నీచర్ గొప్ప ధనవంతుల ఇండ్లలో ఉండేటటువంటివి ఉంటవి.

➠ ఫ్లోరు పైన గొప్ప విలువైన తివాసీలు మరియు మఖ్మల్ (వెల్వెట్) తివాసీలు ఉంటవి. కంఫర్టబుల్ సోఫాలు మరియు మెత్తటి కుర్చీలు ఉంటవి. అందరూ కూర్చొని స్నేహితులతో మాట్లాడుతూ ఉంటారు. కొందరు చదువుతూ ఉంటారు.

➠ చిన్న పిల్లలకు నర్సరీ సెక్షన్ మరియు కిండర్ గార్డెన్ సెక్షన్లు ఉంటవి. తల్లిదండ్రులు వెంటలేకుండా ప్రయాణం చేసే పసి పిల్లలు కూడా ఉండిరి. అటువంటి పిల్లల బాధ్యత పడవవారే తీసుకుంటారు.

➠ పడవలో లైబ్రరీకూడా ఉంది. పుస్తకాలను మన క్యాబిను చదువుకోవటానికి ఇచ్చేవారు.

➠ ఔట్ డోర్ గేమ్స్ కూడా ఉంటవి. పడవలో ప్రయాణీకులు ఆడుతుండేవారు. చివరిదినం టూర్నమెంట్స్ పెట్టించి, గెలిచినవారికి బహుమతులు ఇచ్చేవారు. స్విమ్మింగ్ పూల్స్ ఉంటవి. ఈతల పోటీలు జరుగుతూ ఉంటవి.

➠ డెక్ పైన ఓపెన్ ఏర్ లో రాత్రి ఎందరో పడ్కుండేవారు.

# Telugu❣️

Similar questions
Math, 4 months ago