Science, asked by sailuerla088, 6 months ago

మౌలానా అబుల్ కలాం ఆజాద్
బ్యాం విద్యాభ్యాసం​

Answers

Answered by Braɪnlyємρєяσя
0

Explanation:

మౌలానా అబుల్ కలాం ఆజాద్ *అరబిక్, ఇంగ్లీష్, ఉర్దూ, హిందీ, పెర్షియన్, బెంగాలీ మొదలగు అనేక భాషలలో ప్రావిణ్యుడు. అతని పేరు సూచించినట్లు అతను *వాదనలో రారాజు, వాదనా పటిమలో మేటి. అతను తన కలం పేరు ఆజాద్ గా స్వీకరించాడు.

మౌలానా అబుల్ కలాం ఆజాద్ మక్కానగరంలో 1888 నవంబర్ 11 న జన్మించారు. అతని వంశస్తులు బాబర్ రోజుల్లో హేరాత్ (ఆఫ్ఘనిస్తాన్ లో ఒక నగరం) కు చెందిన వారు. ఆజాద్ ముస్లిం పండితులు, లేదా మౌలానా ల వంశం నుండి వచ్చాడు. అతని తల్లి ఒక అరబ్, షేక్ మహ్మద్ జహీర్ వత్రి, అతని తండ్రి మౌలానా ఖైరుద్దీన్ ఆఫ్ఘన్ మూలాలు ఒక బెంగాలీ ముస్లిం. ఖైరుద్దీన్ సిపాయి తిరుగుబాటు సమయంలో భారతదేశం నుండి మక్కా వచ్చి అక్కడే స్థిరపడ్డారు.

1890 లో అయన తన కుటుంబంతో కలకత్తా వచ్చారు. ఆజాద్ సంప్రదాయ ఇస్లామిక్ విద్య అబ్యసించి నాడు. అతని విద్య ఇంట్లో సాగింది మొదట తండ్రి పిదప ఉపాధ్యాయులు ఇంట్లోనే బోధించారు. ఆజాద్ మొదట *అరబిక్, పెర్షియన్ నేర్చుకున్నాడు తరువాత *తత్వశాస్త్రం, రేఖాగణితం, గణితం, బీజగణితం అబ్యసించి నాడు. స్వీయ అధ్యయనం ద్వారా ఇంగ్లీష్, ప్రపంచ చరిత్ర, రాజకీయాలు నేర్చుకున్నాడు.

ఆజాద్ మౌలానా అగుటకు కావలసిన మత శిక్షణ పొందినాడు.అతను దివ్య ఖురాన్ పై భాష్యం వ్రాసినాడు..

Similar questions