పల్లెటూళ్లు సుభిక్షంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. అలాంటి పల్లెటూళ్ళు తమ ఉనికిని , సంస్కృతిని కోల్పోతున్నాయి. ఇందుకు గల కారణాలను వ్రాయండి. టీవీ కళకళలాడాలంటే మనం ఏం చేయాలి?
Answers
Explanation:
మీ ప్రశ్న:-
పల్లెటూళ్లు తమ సంస్కృతిని కోల్పోవడానికి గల కారణాలు వ్రాయండి. ఇవి కళకళలాడాలంటే మన ఏం చేయాలి?
సమాధానం:-
పల్లెటూళ్లు సుభిక్షంగా ఉండాలంటే వ్యవసాయం లాభసాటిగా ఉండాలి. ' దున్నేవాడిదే పొలం ' కావాలి. పండించిన పంటకు సరైన ధర రావాలి. ఎరువులు , పురుగుమందులు ప్రభుత్వం ఉచితంగా ఇవ్వాలి. నీటి సదుపాయం ఉండాలి. రైతులకు జీవితభీమా ఉండాలి. అప్పుడు వ్యవసాయం పై జనానికి మక్కువ పెరుగుతుంది. పట్నపు వలసలు ఆగుతాయి. పల్లెలు కళకళలాడతాయి. పల్లెలు కళకళలాడితే ప్రభుత్వ ఖజానాలో కాసులు గలగలలాడుతాయి. దేశం సుభిక్షంగా ఉంటుంది.
పల్లెటూళ్ళలో బ్రతుకు తెరువు లేక జనం పట్టణాలకు వలస పోతున్నారు. జనం లేక పల్లెటూర్లు వెలవెలబోతున్నాయి. ఉన్న కొద్దిపాటి జనానికి పనులు లేవు. వ్యవసాయం చేసినా నష్టాలు తప్పడం లేదు. వ్యవసాయంలో కన్నీరే మిగిలిపోతోంది. పశుపోషణ తలకు మించిన భారమౌతుంది. అందుచేత పల్లెటూళ్ళు తమ సంస్కృతిని కోల్పోతున్నాయి.
పల్లెటూళ్ళు కళకళలాడాలంటే తమ ఉనికిని , సంస్కృతిని , ఆత్మను కాపాడాలి. కేవలం ఉపన్యాసాల వల్ల ఇది సాధ్యం కాదు. పట్టుదలతో కృషి చేయాలి. సమాజాన్ని పూర్తిగా సంస్కరించాలి.