చదువు రాకపోతే ఏయే కష్టాలు కలుగుతాయో ఊహించి రాయండి.
Answers
Answer:
ఉద్యోగ అవకాశాలు దొరకవు.
డబ్బులు సంపాదించడం కష్టమవుతుంది
Explanation:
చదువు రాకపోతే ఏయే కష్టాలు
కలుగుతాయి?
ఈ ప్రపంచంలో మనకు చదువు మరియు జ్ఞానం ఎంతో ముఖ్యం.
ముఖ్యంగా చదువు రాకపోతే ఇతరుల దగ్గర మోసపోతాం, అలాగే చులకన అయిపోతాం.
ఇక చదువు విషయానికొస్తే మనం ఎంతో కొంత చదివి ఉంటాం కనుక ఎక్కడికైనా వెళ్లగలం. అదే చదువు రాకపోతే మన దగ్గర ఎంతో కొంత డబ్బు ఉండి ఆటో ఎక్కి ఎంత అని అడిగితే 80 రూపాయలు అంటాడు మనకు తెలియకుండా 180 ఇచ్చేస్తాం. అదే గనక మనం చదివి ఉంటే మనం 80 రూపాయలు ఇస్తాం.
ఈ సమాజంలో మంచి ఉంటుంది చెడు ఉంటుంది. చదువు రాని వ్యక్తి దగ్గర డబ్బు ఉంటే మంచి వాళ్ళు కూడా చెడుగానే మారిపోతారు. అదే చదువుకున్న వ్యక్తి దగ్గర డబ్బులు ఉంటే ఎవరు ఏమి చేయలేరు తన డబ్బును ఏం చేయాలో తనకే తెలుస్తుంది.
మారుతున్న కాలానికి మనం కనీసం పదో తరగతి వరకు అయినా చదివినా మంచిదే.