CBSE BOARD X, asked by michelleveeravalli13, 3 months ago

పెంపుడు జంతువులు లేదా పక్షుల పడే బాధలు, మూగజీవాల పట్ల జాలి దయ కలిగి ఉండాలనికల్మషం లేని మూగ జీవాల అనుబంధం చాలా గొప్పది అని వాటి గురించి నివేదిక రాయండి?





if you answer this I will mark you as brainliest​

Answers

Answered by Anonymous
10

Answer:

మనిషి తన ఉనికి కోసం, తన రక్షణ కోసం, తన ఆహారం కోసం, వినోదం కోసం, ఆధిపత్యం కోసం వెంపర్లాడుతూ, జంతుజాలాన్ని బంధించాడు. వాటిని బానిసలుగా మార్చి తన ఆధీనంలో ఉంచుకున్నాడు. వాటి స్వేచ్ఛను, ప్రాణాలను హరించి, తన స్వార్థానికి వాడుకుంటున్నాడు. మనుగడ కోసం జరిగే పోరాటంలో తన భావ, భాషా పటిమలతో, జంతువుల పట్ల తన చర్యలను మనిషి సమర్ధించుకుంటే సమర్ధించుకోవచ్చు గాక. కాని తాను పొందుతున్న ప్రతి ఫలానికి కనీస కృతజ్ఞత లేకుండా, ఆ జీవజాలం పట్ల చూపిస్తున్న నిర్లక్ష్యం, బాధ్యతా రాహిత్యం, జాలి-కరుణ లేని వైనం, హద్దులు లేని హింస ... వీటిని ఏ చరిత్రా క్షమించదు. ఈ విషయంలో మనిషి తన మనస్సాక్షి ముందు దోషిగా నిలబడక తప్పదు. మనకు ఏ చిన్న కష్టం వచ్చినా, నష్టం జరిగినా వెంటనే గగ్గోలు పెడతాం.

Similar questions