ఆలోచించండి - చెప్పంది.
* కార్మికుల ఆరోగ్యం ఎందుకు క్షీణిస్తున్నది
Answers
Answer:
సంఘటిత, అసంఘటిత రంగాలు, స్వయం ఉపాధికి చెందిన 50కోట్ల మంది కార్మికులకు వర్తింపు, కనీస వేతనాలు, సామాజిక భద్రతతో కూడిన ప్రయోజనాలు
స్వయం ఉపాధి పొందేవారితో సహా కార్మికులందరికీ వర్తించేలా ఇ.ఎస్.ఐ.సి., ఇ.పి.ఎఫ్.ఒ. సామాజిక భద్రతా పరిధి విస్తరణ
40కోట్ల మంది అసంఘటిత రంగం కార్మికులకు “సామాజిక భద్రతా నిధి” ఏర్పాటు.
పురుషులతో సమానంగా మహిళా కార్మికులకు వేతనం
రెగ్యులర్ ఉద్యోగితో సమానంగా నిర్ణీత కాలవ్యవధి ఉద్యోగికి సర్వీసు నిబంధనలు, గ్రాట్యుటీ, సెలవులు, సామాజిక భద్రతా సదుపాయాలు
అంతర్జాతీయ స్థాయి రక్షణ వాతావరణ కల్పించేందుకు వీలుగా “జాతీయ వృత్తిగత రక్షణ, ఆరోగ్య మండలి” ఏర్పాటు
వర్కింగ్ జర్నలిస్టుల నిర్వచనంలో డిజిటల్, ఎలక్ట్రానిక్ మీడియా చేరిక
ఆన్ లైన్ లో జి.ఐ.జి., ప్లాట్ ఫాంలపై పనిచేసే వారితో సహా తోటల్లో పనివారికీ ఇ.ఎస్.ఐ.సి. ప్రయోజనాలు
కాంట్రాక్టర్ తీసుకువచ్చివారికే కాకుండా వలస కార్మికులందరికీ ప్రయోజనాల వర్తింపు
మరింత మెరుగ్గా సయాయం అందించేందుకు వలస కూలీల సమాచారంపై డాటాబేస్ చట్టం ద్వారా ఏర్పాటు,..
వలస కూలీలకు ఏడాదిలో ఒకసారి సొంత ఊరికి వెళ్లేందుకు యాజమానినుంచి ప్రయాణ అలవెన్స్
వలస కూలీల సమస్యల పరిష్కారానికి హెల్ప్ లైన్
మెరుగైన ఉత్పత్తి, మరిన్ని ఎక్కువ ఉద్యోగాల కల్పన లక్ష్యంగా సామరస్య పూరిత పారిశ్రామిక సంబంధాలను పెంపొందించే చట్టాలు
ఒకే రిజిస్ట్రేషన్, ఒకే లైసెన్స్, ఒకే రిటర్న్ కు అవకాశం కలిగిస్తూ పారదర్శకమైన, జవాబ్దారీతనంతో కూడిన, సరళమైన యంత్రాగం ఏర్పాటు
తనిఖీ అధికారి ఇకపై సదుపాయాల కల్పనాధికారిగా కూడా వ్యవహరించే అవకాశం. తనిఖీ రాజ్యం స్థానంలో వెబ్ ఆధారిత తనిఖీ వ్యవస్థ ఏర్పాటు
చారిత్రాత్మకమైన కార్మిక సంస్కరణలకోసం ప్రవేశపెట్టిన 3 బిల్లులు కార్మిక సంక్షేమ సంస్కరణల్లో గొప్ప మలుపును తీసుకువస్తాయని, సంఘటిత, అసంఘటిత రంగాలకు చెందిన 50కోట్ల మందికి కార్మికులకు ఈ సంస్కరణలు వర్తిస్తాయని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ సహాయ (ఇన్ చార్జి) మంత్రి సంతోష్ గాంగ్వర్ ప్రకటించారు. కాంట్రాక్ట్ కార్మికులకు, ఆన్ లైన్ లో జి.ఐ.జి., ప్లాట్ ఫాంలపై పనిచేసే వారికి కూడా ఈ సంస్కరణలు వర్తిస్తాయని, స్వయం ఉపాధి రంగంలో ఉన్న కార్మికుల సామాజిక భద్రతకు కూడా దోహదపడతాయని అన్నారు. కార్మిక బిల్లులపై లోక్ సభలో జరిగిన చర్చకు కేంద్ర మంత్రి ప్రతిస్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
2020 సెప్టెంబర్ 22న 3 కార్మిక బిల్లులకు లోక్ సభ ఆమోద ముద్ర వేసింది. పారిశ్రామిక సంబంధాల బిల్లు, వృత్తిపరమైన రక్షణ, ఆరోగ్యం, పని పరిస్థితుల బిల్లు, సామాజిక భద్రతా నియమావళి బిల్లులను లోక్ సభ ఆమోదించింది. దేశంలో ఎంతో ఆవశ్యకమైన కార్మిక సంస్కరణలను తీసుకురావాలన్న ప్రభుత్వ చిత్తశుద్ధిలో భాగంగా ఈ బిల్లులను రూపొందించారు. 73 సంవత్సరాలుగా ఏ ప్రభుత్వం తీసుకురానన్ని కార్మిక సంస్కరణలతో ఈ బిల్లులు తయారయ్యాయి. ఇందుకు సంబంధించి అన్ని భాగస్వామ్య వర్గాలతో గత ఆరేళ్లుగా చర్చలు, సంప్రదింపులను కూడా ప్రభుత్వం నిర్వహించింది. ట్రేడ్ యూనియన్లు, యాజమాన్యాలతో భేటీలు, నాలుగు సబ్ కమిటీ సమావేశాలు, 10 ప్రాంతీయ సమావేశాలు, వివిధ మంత్రిత్వ శాఖల మధ్య 10సార్లు సంప్రదింపులు జరిపారు. దీనికి తోడు,.. పౌరుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ క్రియాశీలక నాయకత్వంలో,.. బాబా సాహెబ్ అంబేద్కర్ కన్న కలలను నెరవేర్చడానికి ఈ ప్రభుత్వం 2014నుంచి అనేక చర్యలు తీసుకుందని ‘శ్రమయేవ జయతే’, ‘సత్యమేవ జయతే’ నినాదాలకు సమ ప్రాముఖ్యం ఇస్తోందని కేంద్ర మంత్రి గాంగ్వర్ చెప్పారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తెలుసుకుందని, సంఘటిత, అసంఘటిత రంగాల్లోని కార్మికులకు సామాజిక భద్రత కల్పించడానికి, ఇతర సంక్షేమ చర్యలు చేపట్టడానికి తమ మంత్రిత్వ శాఖ నిర్విరామంగా కృషి చేస్తూ వస్తోందని చెప్పారు కోవిడ్19 మహమ్మారి వ్యాప్తి సమయంలో కూడా తమ మంత్రిత్వ శాఖ కృషిని కొనసాగించిందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రభుత్వం కనీవినీ ఎరుగని రీతిలో అనేక చర్యలు తీసుకుందన్నారు. కార్మిక సోదరీమణులకు ప్రసూతి సెలవులను 12వారాలనుంచి 26 వారాలకు పెంచడం వంటి సంక్షేమ చర్యలు చేపట్టిందన్నారు. ప్రధానమంత్రి ప్రోత్సాహన్ రోజ్ గార్ యోజన కింద మహిళలు గనుల్లో పనిచేసేందుకు అనుమతిస్తున్నారన్నారు. సంక్షేమ పథకాలను, కార్మిక రాజ్య బీమా సంస్థ (ఇ.ఎస్.ఐ.సి.) సదుపాయాలను విస్తృతం చేసినట్టు చెప్పారు.
లోక్ సభలో సభ్యులు లేవనెత్తిన పలు అంశాలపై మంత్రి సమాధానమిస్తూ, దేశ సంపూర్ణ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని, కార్మికుల ప్రయోజనాలకు ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తూ బిల్లులు చేపట్టామన్నారు. ఎక్కువ సంఖ్యలో చట్టాలవల్ల కార్మికులు ఎక్కువ బాధలు పడుతున్నారని, అమలు ప్రక్రియలో సంక్లిష్టతల కారణంగా వారి సంక్షేమ, రక్షణ చర్యలకు తరచూ విఘాతం కలుగుతోందన్నారు. 29 కార్మిక చట్టాలను సంక్షిప్తంగా సరళీకరించి, అవగాహనకు వీలుగా పారదర్శకమైన రీతిలో 4 చట్టాలుగా రూపొందించామని, వాటిలో వేతనాలపై బిల్లు,.. ఇప్పటికే పార్లమెంటు ఆమోదం పొంది చట్టంగా మారిందన్నారు. కార్మికులకు సంబంధించిన 29 చట్టాలు 4 చట్టాలుగా మారాయని చెప్పారు. 29 చట్టాలు 4 చట్టాలుగా మారిన తీరు ఈ కింది