మీ అమ్మగారు పాటలు వింటారా ?
Answers
Answer:
తెలుగు సినీరంగంలో పాటల పల్లకిని మోస్తన్న బోయీలు ఎందరెందరో!
అలనాటి బోయీలలో ఎందరో మహానుభావులు!
పాటల పల్లకిని భుజానికందుకున్నారు నవతరం బోయీలు!
వారి అనుభవాలూ అనుభూతులూ మీకోసం... జూన్ 21 ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భంగా...
ఏ ఆర్ రెహ్మాన్ రియల్‌హీరో
నేను పుట్టింది చెన్నైలో. నాకు సంవత్సరం వయసు ఉన్నప్పుడే అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్‌కోకి వెళ్లిపోయాము. మా అమ్మ గారి నాన్న కర్ణాటక సంగీత విద్వాంసులు. ఇంట్లో సంగీత వారసత్వముంది. ఆ విద్య మా అమ్మకు వారసత్వంగా వచ్చింది. అమెరికాలో అమ్మ ‘శ్రీ లలిత గాన విద్యాలయ’ పేరుతో కర్ణాటక సంగీత పాఠశాల పెట్టారు. నేను, అక్క మేమిద్దరమే ఆ స్కూల్లో ఫస్ట్ స్టూడెంట్స్. నాకు మూడేళ్ల వయస్సు వచ్చే సరికే సభల్లో, కచేరీల్లో పాడటానికి అమ్మ స్టేజ్ ఎక్కించేది. అలా చాలా అవకాశాలు అమ్మ ద్వారా వచ్చాయి. నాకు పదమూడేళ్లు వచ్చే వరకు రోజూ ఉదయం రెండు గంటలు సాధన చేయటం, స్కూల్‌కి వెళ్లటం, మళ్లీ స్కూల్ నుంచి రాగానే సాధన చేయటం ఇదే నా పని. ఏ ఆర్ రెహమాన్‌గారు అమెరికా వచ్చినçప్పుడు అందరిలాగానే నేను కూడా లైన్లో నిల్చొని ఆయన కోసం ఎదురు చూశాను. అప్పుడు ఎంతో కష్టపడి ఆయన మెయిల్ ఐడీ సంపాదించాను. ఆ తర్వాత నేను పాడిన పాటలను ఆయనకు పంపించాను. అవన్నీ చూసిన రెహమాన్‌గారు ఓ ఆర్నెల్ల తర్వాత మెయిల్‌లో ‘నీ వాయిస్ చాలా వెరైటీగా ఉంది. అవకాశం వస్తే కలిసి పనిచేద్డాం’ అన్నారు. అన్నట్టుగానే ఓ రోజు కాల్ చేసి స్కైప్‌లోకి రమ్మన్నారు. సరే అని వచ్చాను. ఆయన నాతో ఇలా పాడు అలా పాడు అని చెప్తూ ఉంటే ఓ నాలుగు గంటల పాటు పాడాను. రెహ్మాన్ సార్ ఓ నెల తర్వాత ఫోన్‌చేసి ‘మీ వాయిస్ మణిరత్నంగారికి నచ్చింది’ అని చెప్పారు.