జానపద కళలు అంటే ఏమిటి కొన్నిటిని తెలపండి
Answers
Answer:
భారతీయ జానపద కళా రూపాల్లో తెలుగువారి కళలకి ప్రత్యేకస్థానం ఉంది. ఇక్కడ అనాది నుంచి ఈనాటి వరకు జీవించి ఉన్న అతిపెద్ద కొయ్యబొమ్మలు, పన్నెండు రకాల పటం కథలు, వివిధ ప్రజావీరుల కథలు లాంటి వాటి విలక్షణత ఈ విషయాన్ని రుజువు చేస్తాయి. ఇప్పటిదాకా నిలిచి ఉన్న ప్రజా సాంస్కృతికోద్యమ కళలు, సంప్రదాయ కళా పునాదుల బలం పైనే నిలిచి ఉన్నాయి. సుంకర, సుద్దాల హనుమంతు, వయ్యరాజారాం, నాజర్, పాణిగ్రాహి, గద్దర్, వంగపండు, విమలక్క వంటి వారికి ఈ ప్రాచీన కళలే ప్రేరణ.
తెలుగువారి జానపద కళలు అనగానే మనకు ఈ ప్రాంతంలో ప్రచారంలో ఉన్న 34 తెగల ఆదివాసీల కళారూపాలు, సంగీతం గుర్తుకొస్తాయి. శిష్టకళలకి ఇవే మూలరూపాలు. ఐతే వీటికి రావాల్సిన కీర్తి ప్రతిష్ఠలు రాలేదు. వాటిని వాడుకుని వదిలివేశాం. మన మూలాలను, సాంస్కృతిక ఘనతలను గుర్తించలేకపోయాం. వీటిని ప్రయత్నపూర్వకంగా వెలికి తీసి ప్రచారం చేయలేకపోయాం. ఓ గోండి గుసాడి నృత్యాలను, కోయల బైసన్ నృత్యాన్ని, సవరల ధింసా నృత్యాన్ని మాత్రమే మనకు అనువుగా మార్చుకున్న రూపాన్ని మాత్రమే గుర్తించాం. వారి అసలు సంగీత ఝరీ జలపాతాలను చూడలేకపోయాం. గిరిజనుల ప్రదర్శన రీతులును, పాఠ్య భాగాలను సేకరించలేదు. స్వదేశీయులకన్నా విదేశీయులే ఎక్కువ గిరిజన తెగలపై పని చేశారు.
గ్రామీణ కళా సంప్రదాయాలను సైతం పరిశోధకులు తమ పట్టాల కోసం పరిశోధనాంశాలను చేశారు. అందువల్ల అవి ఒక కళారూపంగా ప్రపంచానికి పరిచయం కాలేదు. కిన్నెర తంత్రీవాద్యం, ఈ కోవకే చెందిన కడ్డీ తంత్రీ వాద్యం, దళిత నాగస్వరం, దుబ్బులవారి చర్మవాద్యం, విల్లు వాద్యం వంటివి తెలుగువారి ప్రత్యేక వాద్యాలుగా పేర్కొనవచ్చు. వీటిని నాలుగైదు రోజుల కథని చెప్పే సాధనాలుగా, ఆ కథలు తెలుగువారి వీరోచిత గాధల చక్రాలుగా లోకానికి చెప్పుకోలేకపోయాం.
అయినప్పటికీ ఇంకా ప్రజాదరణ పొందిన అనేక కళారూపాలు ప్రచారంలో ఉన్నాయి. వీటిలో ఊదే వాద్యాలు, చర్మవాద్యాలు, తంత్రీవాద్యాలు, మోగించే వాద్యాలు ఉపయోగించే కళాప్రదర్శనలు విలక్షణమైనవి. మహబూబ్‌నగర్, కర్నూలు, అనంతపురంలో మాదాసి కురవలు అనేవారు ప్రదర్శించే గొరవయ్యల నృత్య ప్రదర్శన అద్భుత కళారూపం. ఒక చేత్తో పిల్లంగోవి వాయిస్తూ, మరో చేత్తో జగ్గు లేదా ఢమరుకం వాయిస్తూ మధ్యమధ్యలో ‘వచనాలు’ పాడుతూ సామూహిక నృత్యం చేస్తారు. దీనిని ఆదిమ గిరిజన జానపద కళల సమ్మిశ్రణ కళగా భావించవచ్చు. పైగా వీరు పెట్టుకునే టోపీ ఖండాంతరాల కావల గల ఆదివాసీ పురా సంప్రదాయ నమూనా కలిగి ఉంటుంది. ఇది వీరశైవ మతాచార కళారూపంగా మారింది. కాని దీని మొదటి రూపం అతి ప్రాచీన కాలానికి చెందినది. ఈ కళారూపం కన్నడ ప్రాంతంలో కూడా కనిపిస్తుంది. వీరు రెండు భాషల్లో వచనాలు పాడి అదరగొట్టేస్తారు. నిజానికి ఒగ్గుకథ, మందహెచ్చు కథ ఈ కోవలోకే వస్తాయి.
Explanation:
పటం కథలు విన్నారా
ఆ ప్రాంతాల్లోనూ తెలుగు కళలు
పూర్తి పాఠం
జానపద కళలు.. తెలుగు రవికిరణాలు

పటం కథలు విన్నారా!
కళింగ ప్రాంతం కళారూపాల్లో పేరెన్నదగిన తప్పెటగుళ్లు, జముకుల కథ, జాలరి నృత్య ప్రదర్శనలు ఎన్నో ఉన్నాయి. వీటిని ఆధారంగా చేసుకుని ప్రజాకళాకారుడు వంగపండు ప్రసాదరావు జనం కథల పేరుతో వాటిని తిరిగి ప్రజలకు కొత్తరూపంలో అందించారు. రాయలసీమలో వీరణాల ప్రదర్శన, గంగమ్మ జాతరలు, కుప్పం వీధినాటకాలు, ఊరూరా పండగలా సాగే భారత కథల సంబరాలు ప్రత్యేకించి పేర్కొనదగిన కళలు.