Hindi, asked by irshadahmad4038, 2 months ago

మాతృభాషలో విద్యాబోధన గురించి వ్యాసం రాయండి.

Answers

Answered by gnan2911
21

Answer:

పిల్లలకు విద్యాబోధన మాతృభాషలో చేయాలా లేక ఇంగ్లిష్ మీడియంలోనా? ఈ అంతులేని చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. కర్ణాటక కూడా ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచే ఆంగ్లాన్ని విద్యాబోధన మాధ్యమంగా ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. తెలుగు రాష్ట్రాలు రెండూ ప్రాథమిక విద్య నుంచే ఆంగ్ల మాధ్యమంలో బోధన ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపడుతున్నాయి. అందుకు అనుగుణంగా, ఈ విద్యా సంవత్సరం నుండే ఆంగ్ల మాద్యమంలో బోధన ప్రారంభించటానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. దీంతో ఈ అంశం మరోసారి వివాదాంశంగా మారి చర్చకు కారణమైంది.

మాతృభాష అంటే ఏమిటి? :

               శిశువు తాను పుట్టినప్పటి నుండి తన తల్లిదండ్రులు మరియు ఇరుగుపొరుగు వారి నుండి ఏ భాషను వింటూ, ఏ ఇబ్బంది లేకుండా తన్మయత్వంగా నేర్చుకుంటూ ఉంటాడో, ఆ భాషను మాతృభాషగా పరిగణించవచ్చు. మనం మొట్టమొదట నేర్చుకునేదీ, బాగా ఎక్కువగా మాట్లాడేదీ, ఎక్కువ సందర్భాల్లో వినియోగించేదీ, భావావేశ, లేదా హృదయా నుగత సంబంధం కలిగినదీ, లెక్కించడం, ఆలోచించడం, కలలు కనడం లాంటి వాటికి ఉపయోగించేదీ మాతృభాష. ప్రపంచవ్యాప్తంగా విద్యావేత్తలు ఏ విజ్ఞాన శాస్త్రం నేర్చుకోవడానికైనా, పరాయిభాష నేర్చుకోవడానికైనా మాతృభాషా మాధ్యమమే సరైనదని చెబుతున్నారు. జపాన్‌, ఐర్లాండ్‌, పోలాండ్‌, ఫిన్లాండ్‌, దక్షిణ కొరియా వంటి దేశాల్లో ప్రాథమిక విద్య మాతృభాషలోనే జరుగుతోంది. చైనా, పిల్లలకు తొమ్మిది సంవత్సరాల వయసు లేదా మూడవ గ్రేడ్ లో పరాయి భాషను, బోధనా భాషగా ప్రవేశ పెడుతోంది.అది కూడ వారానికి రెండు గంటలు మాత్రమే.

                      ప్రాథమిక స్థాయిలో మాతృభాషా మాధ్యమం అనివార్యమైన అవసరమని భారత రాజ్యాంగం (అధికరణం 350 ఎ), కొఠారీ కమిషన్‌ చెప్పింది. యునెస్కోనే కాదు అభివృద్ధి చెందిన దేశాల చరిత్ర, వర్తమానం అదే చెబుతున్నాయి. వస్తూత్పత్తిలో అత్యధికాభివృద్ధిని సాధించిన జపాన్‌ అత్యున్నత స్థాయి వరకు మాతృభాషా మాధ్యమాన్నే అమలుచేస్తోంది. 2010లో భారత ప్రభుత్వం తెచ్చిన విద్యాహక్కు చట్టం విభాగం 29(2)లో ఎలిమెంటరీ స్థాయిలో వీలైనంతవరకు మాతృభాషా మాధ్యమాన్నే అమలు చేయాలని నిర్ధేశించింది. నూతన జాతీయ విద్యా విధానం (2020) కూడా ఐదవ తరగతి వరకు మాతృభాష లోనే బోధన జరగాలి అని చెబుతోంది. అంతర్జాతీయ సంస్థలన్నీ- యునెస్కో, వరల్డ్‌బ్యాంక్, వరల్డ్ డిక్లరేషన్ ఆన్ ఎడ్యుకేషనల్ ఫరాల్ (ఎఫ్‌ఎఫ్‌ఏ) జనరల్ అసెంబ్లీ లాంటి సంస్థలన్నీ పిల్లలకు ప్రాధమిక విద్యని మాతృభాషలో నేర్చుకునే హక్కుందని నిర్ధారించాయి. ఒక జాతి నాగరికతను, సంస్కృతిని, ప్రజాజీవనాన్ని భాష ప్రతిభింబిస్తుంది. ప్రతిభింబిస్తుంది. భాష కేవలం భావవ్యక్తీకరణ, భావ ప్రకటన సాధనంగానేకాక, భావాలను సమైఖ్యపరిచి భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించటానికి దోహదం చేస్తుంది. పరిపాలన నిర్వహించడానికి ప్రపంచంలో ఏ దేశంలోనైనా, ఏ ప్రాంతంలోనైనా అత్యధిక సంఖ్యాకులు మాట్లాడేభాష, అధికారభాష అవుతోంది. అటువంటి అధికారభాష గా మాతృభాష ఉంటే ఇంకా మంచిది.

బోధన మాధ్యమంగా మాతృభాషప్రయోజనాలు:

               పిల్లలు మరింత మెరుగ్గా తొందరగా అవగాహన చేసుకొని నేర్చుకుంటారు . పాఠశాలలో ఎక్కువగా గడపడాన్ని పిల్లలు ఆనందిస్తారు. పిల్లలలో అత్మనిబ్బరం పెరుగుతుంది మాతృ బాషలో విషయాన్ని వ్యక్తం చేయడం, బోధించడం, అభ్యసించడం సులభం.

మాతృభాషలో అధ్యయనం వల్ల కంఠస్థం చేయకుండా భావాలను గుర్తుపెట్టుకొని రాయవచ్చు. మాతృభాషలో విధ్యార్థి స్వయంగా చదివి విజ్ఞానాన్ని పెంపొందించుకొంటాడు. మాతృభాష మాధ్యమం వల్ల దేశీయ భాషలు అభివృద్ది చెందుతాయి. మాతృభాష మాధ్యమం వల్ల అధ్యయనం చురుకుగా సాగుతోంది.  సామాజిక స్పృహ పెంపొందుతుంది. పిల్లలు అదే పాఠశాలలో ఎక్కువ కాలం (పదేపదే పాఠశాలలు మారకుండా) చదవటానికి ఇష్టపడతారు. తల్లిదండ్రుల భాగస్వామ్యం పెరుగుతుంది. పాఠశాల కృత్యాలలో తల్లిదండ్రుల సహకారం పెరుగుతుంది. మాతృభాష మాధ్యమంలో విధ్యార్ధులకు అభ్యసనం క్రీడలాతోచి మానసికశ్రమ, అలసట లేకుండా ఉల్లాసంగా వివిధ విషయాలను సులభంగా నేర్చుకుంటారు. మాతృభాషా మాధ్యమంలో చదవడంవల్ల ఆ భాషకు తగిన గౌరవం కల్పించిన వారమవుతాం.

                  కన్వెన్షన్ ఆన్ ది రైట్స్ ఆఫ్ ది చైల్డ్ (సిఆర్‌ఎస్) ఆర్టికల్ 29, 1ఓ సెక్షన్ 269లో ఆర్టికల్ 29 ప్రకారం మాతృభాషలోనే నేర్చుకునే తెవివితేటలు ఎక్కువగా వుంటాయని స్పష్టం చేశారు. అందుకని దాని ద్వారా ప్రపంచంలోకి చూసే హక్కు పిల్లలందరికీ వుందని నిర్ధారిస్తున్నాయి. ఏ భాషని మాధ్యమంగా విద్య గరిపించాలనుకుంటున్నామో ఆ భాషని ముందు క్షుణ్ణంగా నేర్పాలి. అందుకు పిల్లలకున్న భాషాపర హక్కుని గుర్తుంచుకోవాలి. డాకర్ ఫ్రేమ్ వర్క్ ఫర్ యాక్షన్ (2000) వరల్డ్ డిక్లరేషన్ ఆన్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ (1990) యునెస్కో లాంటి సంస్థలు పిల్లల భాషాపర హక్కుని తెలియజేస్తున్నాయి. మాతృభాషలో చదువు చెప్పడం, పిల్లలకు వాళ్ల జాతి సంస్కృతుల్ని చెప్పడం కూడా అంటున్నారు భాషా శాస్తజ్ఞ్రులు. ఇలా ఎందరో పరిశోధకులు, శాస్తజ్ఞ్రులు మాతృభాషా ప్రాధాన్యాన్ని చెబుతున్నారు పాఠశాలలో ప్రారంభ దశలో! ఈ విషయాల్ని మిగతా పరిశోధనలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం విద్యాబోధనా పద్ధతుల్ని నిర్మించాలి. తల్లిదండ్రులు కూడా ఆ దిశలోఆలోచించాలి.

Similar questions