India Languages, asked by kimm6012, 1 year ago

కింది పేరా చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి. తెలంగాణ ప్రాంతంలో చెరువుల నిర్మాణం శాతవాహనుల కాలం కంటే ముందునుంచే ఉన్నప్పటికీ కాకతీయుల కాలంలో ఉన్నతదశకు చేరుకుంది. ఆ తర్వాత తెలంగాణను పాలించిన కుతుబ్ షాహీలు, అసఫ్ జాహీలు, సంస్థానాధీశులు, తెలంగాణలో చెరువుల నిర్మాణాన్ని అభివృద్ధిపరిచి, వ్యవసాయాభివృద్ధికి తోడ్పడ్డారు. తర్వాత కాలంలో ఈ చెరువుల వ్యవస్థ సరైన నిర్మాణానికి నోచుకోక విధ్వంసానికి గురి అయ్యింది. దీనివలన స్వయంపోషక గ్రామాలుగా ఉన్న తెలంగాణ గ్రామాలు కపువుపీడిత గ్రామాలుగా మారాయి. ఈ పరిణామం కూడా వలసలకు కారణమైంది. లక్షలాది మంది తెలంగాణ ప్రజలు పొట్టచేత పట్టుకుని ఇతర రాష్ట్రాలకు, గల్ఫ్ దేశాలకు వలస పోయారు. తెలంగాణలో చెరువుల పునర్మిర్మాణం ద్వారా వ్యవసాయాభివృద్ధి సాధిస్తే, ప్రజలకు ఉపాధి దొరికి, వలసలు ఆగిపోతాయి. దీన్ని దృష్టిలో పెట్లుకుని తెలంగాణరాష్ట్ర ప్రభుత్వం చెరువులను పునరుద్ధరించడానికి 'మిషన్ కాకతీయ' అనే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. ప్రశ్నలు: అ) పై పేరా దేని గురించి చెప్తున్నది? ఆ) 'మిషన్ కాకతీయ' అంటే ఏమిటి? ఇ) తెలంగాణ ప్రజలు ఎందుకు వలసలు వెళ్ళుతున్నారు? ఈ) వలసలు ఆగిపోవడానికి చేపట్టవలసిన చర్యలేవి? ఉ) చెరువుల అభివృద్ధి కోసం కృషిచేసిన వారెవరు?

Answers

Answered by KomalaLakshmi
8
1.పై పేరా తెలంగాణా రాష్ట్రంలో చెరువుల పునరుద్దరణ కార్యక్రమం గురించి చెబుతుంది.


2.తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో చెరువులను పునరుద్దరించే కార్యక్రమాన్ని చేపట్టింది.దానికి “మిషన్ కాకతీయ “అని పేరు పెట్టింది.


౩.తెలంగాణా లో చెరువుల వ్యవస్థ కాల క్రమంలో సరైన నిర్వహణలకు నోచుకోలేదు.దానితో తెలంగాణ గ్రామాలు  కరువు పీడిత గ్రామాలుగా మారాయి.ప్రజాలు వలసలు పోతున్నారు.


4.తెలంగాణా లో చెరువుల పునర్నిర్మాణం ద్వారా ,వ్యవసాయ అభివృద్ధి సాధిస్తే ప్రజలకు ఉపాధి దొరికి ,వలసలు ఆగిపోతాయి.


5.చెరువుల అభివృద్ధి కోసం కాకతుయులు,కుతుబ్షాహీలు,ఎందఱో సంస్తనాదిసులు కృషి చేసారు.


Answered by Brainlyaccount
10
ಟೌನ್ ಹಾಲ್ ಕಮ್ ಔಟ್ ಆಗಲು ಏನು ಮಾಡಬೇಕು ಮತ್ತು ಅದರ ಬಗ್ಗೆ ಒಂದು ಜಾಹೀರಾತು ಶುಲ್ಕ ತೆಗೆದುಕೊಳ್ಳದೇ ಅದರ ಬಗ್ಗೆ ಹೆಚ್ಚಿನ ವಿವರಗಳನ್ನು ಕೋಷ್ಟಕ ಎಂದು ನಾನು ನನ್ನ ಮೇಲೆ ಪ್ರೀತಿ ಅಂತ ನಾನು ಈ ಲೇಖನದಲ್ಲಿ ಹೇಳಿದ ಹಾಗೇ ನಮ್ಮ ದೇಶದ ಅಥವಾ ನಮ್ಮ ಪ್ರದೇಶದ ಚರಿತ್ರೆ ಬರೆಯುವ ಮುನ್ನ ಈ ರೀತಿಯ ಮೌಲ್ಯವರ್ಧಿತ ಉತ್ಪನ್ನಗಳನ್ನು ತಯಾರಿಸಲು ಈ ಕೆಳಗಿನ ಅಂಶಗಳನ್ನು ಕುರಿತು ಅಧ್ಯಯನ ಮಾಡುವ ಮೂಲಕ ತಮ್ಮ ಮನೆಗಳಿಗೆ ಹೋಗುವ ದಾರಿಯಲ್ಲಿ ಸಿಗುವ ಎಲ್ಲಾ ಞಞಜ
Similar questions