India Languages, asked by roshangupta3428, 1 year ago

ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి. అ)స్వాతంత్ర్య౦ లభించినప్పటికి, అది సంతొషం కలిగించట౦లేదని సంగెం లక్ష్మిబాయి ఎందుకు భావించింది? ఆ) గాంధీజీ అనుసరించిన అహింసా మార్గా౦ దేశ స్వాతంత్ర్యద్యమ౦లో కీలక పాత్ర పోషించిందని ఎట్లా చెప్పగలరు? ఇ)బ్రిటిషువారి చేతుల్లొకి మనదేశ పాలన పోవుటకు గల కారణాలు వివరించండి. ఈ) సంగెం లక్ష్మిబాయి రచనా శైలి ఎట్లా ఉన్నాది?

Answers

Answered by KomalaLakshmi
48
అ) స్వాతంత్రం వచ్చాక సమాజం వ్యాదిగ్రస్తమైనదని,అందుకు కారణం ప్రజలేనని సంగం లక్ష్మి బాయి భావించారు.అందుకే స్వాతంత్ర సిద్ది అంట సంతోషాన్ని ఇవ్వడం లేదన్నారు.రాజకీయ నాయకులలో పదవి లాలస,స్వార్ధము,కులపిచ్చి,లంచగొండితనము,పెరిగిపోయాయి.సమాజం లో ఎక్కడ ఏమి జరిగినా మనకెందుకులే అనే నిర్లిప్తత పెరిగి స్పందన కరువైపోయింది.తోటి వారికోసం,దేశo కోసం ఏదన్న చేయాలనే భావన లేదు.


అందువల్లనే స్వాతంత్రం వచ్చినప్పటికీ ,అది తనకు సంతోషం కలిగించడం లేదని లక్ష్మి బాయి భావించింది.


  పై ప్రశ్న సంగెం లక్ష్మి బాయిగారు రాసిన ఉద్యమ స్పూర్తి అనే పాఠం నుండి ఈయ బడింది.రచయిత్రి రాసిన ‘నా జైలు జ్ఞాపకాలు---అనుభవాలు అనే ఆత్మ కధ నుండి గ్రహించబడింది. ఈమె రంగారెడ్డి జిల్లా ఘటకేస్వరము అనే గ్రామములో జన్మించింది.ఈమె బూరుగుల మంత్రి వర్గం లో విద్యా శాఖ మంత్రిగా పనిచేసింది.గాంధిజీ పిలుపుతో ఉప్పు సత్యా గ్రహం లో పాల్గొని జైలుకు వెళ్ళిన మొదటి తెలంగాణా మహిళ. వినోభాభావే చేసిన ఉద్యమ యాత్రలో పాల్గొన్న ప్రధమ మహిళ.


ఆ) గాంధిజీ అనుసరించిన అహింసా మార్గం ,స్వాతంత్ర పోరాటంలో ప్రాధాన పాత్ర పోషించింది.ఆయన అహింస,సత్యం,సహాయ నిరాకరణ అనే వాటినే తన అస్త్రాలుగా మలచుకున్నారు.ఆయుధ సంపద ఎక్కువగా వున్నా బ్రిటిష్ పాలకులతో పోరాటానికి ఒకవేళ గాంధిజీ హింసా మార్గం ఎంచుకొని వుంటే తమ మిలిటరీ సాయంతో దాన్ని కొద్దికాలం లోనే అనగాతోక్కేవారుఅ.హింసా మార్గం లోనే ఏంటో మంది ఉద్యమ కారులు తమ ప్రాణాలను త్యాగం చేయవలసి వచ్చింది.ఇక హింసా మార్గమైతే పరిస్థితి మరింత ఘోరంగా వుండేది.


అహింసా పద్దతిలో పోరాటం సాగడం వల్ల ,ఉద్యమం  పట్ల ప్రజలకు ,ప్రభుత్వానికి ,పాలకులకు,సానుభూతి కలిగింది.కనుకనే గాంధిజీ అనుసరించిన అహింసా మార్గం స్వాతంత్ర సాధనలో కీలక పాత్ర పోషించింది.


ఇ) వర్తక ,వానిజ్యాలకోసం స్వదేసరాజుల అనుమతులు సంపాదించి మనదేసంలోకి బ్రిటిష్ వారు ప్రవేశించారు.తరువాత ఐకమత్యం లేని మన సంస్తానాదిసుల గురించి తెలుసుకున్న బ్రిటిష్ వారు వారి మధ్య తాగావులు పెట్టి,వారిలో ఒక పక్షం వారికి తమ సైనిక, సహాయసకారాలను అందించేవారు.



తర్వాత ఇద్దరిని దొంగ దెబ్బ తీసి రాజ్యాలను స్వాధీనం చేసుకొనే వారు.


క్రమంగా అలా తమ దురాలోచనతో మొత్తం భారత దేశాన్ని తమ ఏలుబడిలోకి తెచ్చుకున్నారు.ఈ విధంగా వర్తక నెపంతో మనదేశానికి వచ్చి బ్రిటిష్ వారు క్రామంగా మానదేస సంపదను కొల్లగొట్టారు.


ఈ) ఈమె దేసభాక్తురాలు,తెలుగుపండితురాలు.ఇమే రచనా శైలి సంస్కృత ,తెలుగు సంమేలనాలతో ,అనుప్రాసలతో ఏంటో అద్భుతంగా ఉంటుంది.విరి రచనలలో అమిత దేశభక్తి మరియు బ్రిటిష్ పాలకులపై ద్వేషం అడుగడుగునా తొంగి చూస్తాయి.
విరి రచనలలో మంచి,మంచి పద బంధాలు కనపడతాయి. ఉదాహరణకు కొన్ని----  బాలుడిమరణంతలిదండ్రులకురంపపుకోత,విరావేసం.మొదలైనవి.
బ్రిటిష్ వారివి కర్కసపు హ్రుదయాలన్నది,వారిని పచ్చి నెత్తురు తాగే కిరాతక రాక్షశులతో పోల్చింది.ప్రపంచమంతా మారినా మన భారతీయులు ఇంకా భారతీయులు జడులలా అదే అజ్ఞానంలో ఉన్నారని అంది.బ్రిటిష్వారి నాగరికత కలవారిని మనలను అనాగరికులని తక్కువ చూపు చూస్తున్నారని ,అయినా వారు పరాన్న భుక్కులని ఎగతాళి చేసింది.
లక్ష్మి బాయి రాచానాసైలి ప్రాభావవంతమైనది. చురుకైనది.
Answered by mona9062
27

Answer:

here's ur answer

Explanation:

please mark it as BRAINLIEST ANSWER

Attachments:
Similar questions