India Languages, asked by althafa6693, 1 year ago

కింది పదాలకు విగ్రహవాక్యాలు రాసి సమాసాల పేర్లు రాయండి. అ)పిరికి వెధవ ఆ) గొంతునొక్కేయటం ఇ) నా పాట

Answers

Answered by KomalaLakshmi
12
1.పిరికివెధవ ----------    పిరికిఐన వెధవ .       (సమాసము.)






2.గొంతు నొక్కేయడం ---------- గొంతును నొక్కేయడం. ( ద్వితీయా తత్పురుష సమాసం)






౩.నాపాట -------------------- నా యొక్క పాట . ( షష్టి తతపురుష సమాసం).





      పై ప్రశ్న సలంద్ర లక్ష్మి నారాయణ రాసిన ‘కోరస్'అనే వచన కవితకు చెందిన పాఠం యొక్క ముందు కవిత.దీనిని కాలోజిగారు రాసారు.కాని ఈ పాఠం వచన ప్రక్రియకు చెందింది.ఛందస్సుఅవసరంలేనిస్వేచ్చాకవిత్వాన్ని ‘వచన కవిత ‘అంటారు.సలంద్ర లక్ష్మినారాయణ గారు చావుగితం అనే కవితా సంచలంనుండిప్రస్తుతపాఠంగ్రహించబడింది.ఈయన నిజామాబాద్ పట్టణంలో జన్మించారు.ఈయన రచించిన ‘దళిత మానిఫెస్టో' అనే కవిత ,దళిత సాహిత్య ఉద్యమానికి పునాది అని చెప్తారు.
Answered by suggulachandravarshi
6

Answer:

హలో!

ఈ ప్రశ్న సమాస పదాలు గురించి.

అ) పిరికి వెధవా - పిరికైన వెధవ. (సమాసం).

రెండు సమర్థవంతమైన పదాలు కలిసి ఒక పదముగా ఏర్పడదని సమాసం అంటారు.

ఆ) గొంతు నొక్కేయడం - గొంతును నొక్కేయడం.

ఇది ద్వితీయ తత్పురుష సమాసం. ఎందుకంటే, ఈ పదాన్ని విడదీస్తే, ఇందులో "ను" అనే విభక్తి కనిపిస్తుంది. ఈ "ను" అనేది ద్వితీయా విభక్తి (నిన్ నున్ లన్ గూర్చి గురించి). అందుకనే ఇది ద్వితీయ తత్పురుష సమాసం అయింది.

ఇ) నా పాట - నా యొక్క పాట. ఇది షష్టి తత్పురుష సమాసం. ఎందుకంటే ఈ పదాన్ని విడదీయగా మనకి "యొక్క" అనే విభక్తి కనిపిస్తుంది. ఈ "యొక్క" అనేది షష్ఠీ విభక్తి ప్రత్యయము (కిన్ కున్ యొక్క లోన్ లోపలన్). అందుకే ఇది షష్టి తత్పురుష సమాసం అయింది.

Similar questions