India Languages, asked by kswamy994820746, 1 year ago

కలిసి ఉంటే కలదు సుఖం దీన్ని వివరించండి

Answers

Answered by J1234J
21

Answer:

ఒకరోజు చీమలు ఎంతో కష్టపడి అవి నివసించడానికి ఒక పెద్ద పుట్ట నిర్మించుకున్నారు. తర్వాత రోజు వచ్చి చూస్తే ఆ పుట్టను ఆక్రమించేసింది. అప్పుడు చీమలకు చాలా కోపం వేసింది. పాము ఎంతో పెద్దది, ఈ చిన్న చిన్న చీమలకు ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు చిన్న చీమలన్నీ కలిసి ఒక్కటిగా వెళ్లి పామును కరిచాయి. ఈ ప్రయత్నంలో ఎన్నో చీమలు చనిపోయాయి. కానీ అవి పట్టువదలకుండా పామును కొడుతూనే ఉన్నాయి. ఇలా చివరికి చీమలే విజయాన్ని పొందాయి. పాము చనిపోయింది. అప్పటినుండి చీమలు అంతా కలిసి ఆ పుట్టలో ఎంతో సంతోషంగా జీవించారు. దీన్నిబట్టి మనకు అర్థమైంది ఏంటంటే "కలసి ఉంటే కలదు సుఖం".

ఇంతటి పోరాటం అయినా ఐకమత్యంగా ఉంటే దానిని మనం సులభంగా విజయవంతం చేసుకోవచ్చు.

Answered by PADMINI
44

కలిసి ఉంటే కలదు సుఖం:

ఈ సామెత ఎంతో నిజం. కలిసి మెలిసి ఉంటె కష్టాలు మనదరికి చేరవు . కలిసి ఉంటె ఏ సమస్య వచ్చిన అందరు కలిసి పరిష్కరించుకోవచ్చు . కలిసి ఉంటె మన సమస్యను బాధల్ని ఒకరితో పంచుకోవచ్చు.

'కలిసి ఉంటే కలదు సుఖం' ఈ సామెతను వివరించడానికి ఎన్నో కధలు ఉన్నాయి. చీమలు గుంపుగ కలిసి మెలిసి  ఉండి ఆహారాన్ని సమకూర్చుకుంటాయి . అదే విధంగా అడవి లో జంతువులన్నీ కలిసి మెలిసి ఉంటాయి. జీవితం చాలా చిన్నది అందుకే ఎవరితోనూ గొడవ పడకుండా అందరితో కలిసి మెలిసి ఉంటూ ఎప్పుడు సుఖంగా ఉండాలి.

ఎలాంటి సమస్య ఐన కలిసి ఉంటె దానిని దైర్యంగా ఎదుర్కొనవచు. ఇదివరకు కుటుంబాల్లో అందరు కలిసి ఉండేవారు వారంతా కలిసి మెలిసి ఉండేవారు. ఇప్పుడు అందరు వేరు వేరుగా నివసిస్తున్నారు.

Similar questions