పై సంభాషణలో గొప్పవారు ఎవరు? ఎందుకో రాయండి
Answers
Answer:
"కర్ణుడు దాన గుణం కలవాడు. వీరగుణం కలవాడు. శూరుడిగా ప్రకాశించినవాడు. అందుకనే దాన వీర శూర కర్ణుడిగా పేరు పొందాడు. భారతంలో ప్రత్యేకత ఉన్న పాత్రేకాదు, ప్రాధాన్యత ఉన్న పాత్ర! అదుకనే “కర్ణుడి లేని భారతమా?” అని నానుడీ వచ్చింది! స్నేహానికి చిరునామా కూడా కర్ణునిదే! దాన వీర గుణాలకే కాదు, విషాదానికీ అతడే! “కర్ణుడి చావుకి వంద కారణాలు” తెలియాలంటే పుట్టుక నుండి చావు వరకూ అడుగడుగునా స్వార్ధాలతో శాపాలతో నిండివున్న అతని కథ తెలుసుకోవాల్సిందే!"
Explanation:
hope it hps
Answer:
కర్ణుని కన్నతల్లి కుంతి. దూర్వాసుడిచ్చిన వరాన్ని పరీక్షించి సూర్యునివల్ల కర్ణుని కన్నది. పెళ్ళికాకుండా బిడ్డని కనడం వల్ల గంగలో వదిలిపెట్టింది. అతిరధుడనే సూతుడికి దొరికాడు. అతని భార్య రాధ పెంచిన తల్లయింది. రాధ పెంచింది కాబట్టి రాధేయుడైనాడు. సూర్యతేజస్సుతో సహజ కవచ కుండలాలతో పుట్టాడు కాబట్టి కర్ణుడైనాడు. సూత కులపు వాడిగా కర్ణునికి ధనుర్విద్యను నేర్పినా, బ్రాహ్మణుడని అబద్దం చెప్పినా నేర్చిన విద్య మిగల్లేదు. పరుశురాముడు కర్ణుడి ఒడిలో తలపెట్టుకొని నిద్రిస్తున్న వేళ కీటకం తొడను దొలిచింది. రక్తం స్రవిస్తున్నా గురువుగారు లేస్తారని ఓపిక పట్టాడు. లేచి చూచిన పరుశురాముడు సహనం వల్ల బ్రాహ్మణుడువి కాదని గ్రహించి, అసలు విషయం తెలుసుకొని శపించాడు. అవసర మొచ్చినప్పుడు నువ్వు నేర్చుకున్న విద్య నీకు జ్ఞాపకం రాదు, పనికిరాదు అని. కులం తక్కువని అర్జునునిపై పోటీకి దిగిన కర్ణుణ్ణి కృపాచార్యుడు కాదన్నాడు. కాని దుర్యోధనుడు కర్ణుణ్ణి అంగరాజ్యానికి అధిపతిని చేసి అవమానాన్ని అధిగమించడమే కాదు, రాజపుత్రులతో సమానమైన హోదా కల్పించాడు. కర్ణుడు దుర్యోధనుని తన స్నేహితునిగా భావించి చివరివరకూ అతని వైపే నిలబడ్డాడు. కన్న మమకారానికి కాదు కదా దేనికీ లొంగ లేదు. అయితే దుర్యోధనుని ఎత్తుగడలను కాదని యుద్ధం ద్వారానే విజయం సాధించాలని రాజనీతిని నమ్మి నడిచాడు. స్నేహితుని అభీష్టము తెలిసి కౌరవపాండవుల మధ్య సంధిని కాదన్నాడు. దాంతో భీష్ముని వల్ల నిష్టూరమూ పడ్డాడు. యుద్ధంలో భీష్మునికి సాయపడనని చెప్పి, చివరి వరకూ ఆ కురు వృద్ధునితో మౌనంగానే ఉన్నాడు.
రాయబారిగా వచ్చిన కృష్ణుడు కర్ణుని రథమెక్కించి ఏకాంత ప్రదేశానికి తీసుకు వెళ్ళి ధర్మరాజుకన్నా నీవే పెద్దవాడవని, నీకే పట్టాభిషేకమని పాండవులతో కలవమని ఆశ చూపాడు – కాదన్నాడు కర్ణుడు. ధర్మరాజుకే ఆ హక్కు గెలిస్తే ఉంటుందన్నాడు. అన్నీ తెలిసి కుంతినిగాని, పాండవులను గాని దూషించలేదు. తర్వాత కుంతి యుద్ధ సమయంలో రహస్యంగా కలిసినప్పుడూ అంతే. గెలిచినా ఓడినా దుర్యోధనునితోనే ఉంటానన్నాడు. అయితే కర్ణుడికి కన్నపేగునూ కన్నీరునూ చూపించి ఒక్క అర్జునునికి తప్ప మరెవరికీ ప్రాణ హాని తలపెట్టననేలా మాట తీసుకుంది కుంతి. అందుకే యుద్ధంలో ధర్మరాజు, సహదేవులను చంపే అవకాశం వచ్చినా వదిలేసాడు కర్ణుడు. ఘటోత్కచుని వంటి రాక్షసజాతి వీరుణ్ని చంపింది కర్ణుడే!
సారధిగా ఉండాల్సిన శల్యుడూ సూత పుత్రుడని కర్ణున్ని అవమానించాడు. దుర్యోధనుని వల్ల సారధిగా ఉన్నా నిత్యమూ కర్ణుని తక్కువ చేసి శత్రువులను ఎక్కువ చేసి కర్ణుని ఓటమి కారకుల్లో ఒకడయ్యాడు. తండ్రిముందే హెచ్చరించినా మారువేషంలో అర్థించిన ఇంద్రునికి కవచకుండలాలు కోసి ఇచ్చాడు. ఇంద్రుడు సహితం కర్ణుని త్యాగానికి తలదించుకున్నాడు. కొడుకు అర్జునుణ్ని కాపాడాలన్న స్వార్ధంతో ఇంద్రుడలా చేసాడు. కవచ కుండలాలున్నంతవరకూ కర్ణుణ్ణి ఎవరూ గెలవలేరు. యుద్ధంలో ఉండగా సారధి శల్యుడు లక్ష్యాన్ని తప్పిస్తుండగా మరోవైపు రథచక్రం భూమిలోకి దిగింది. దానికీ కారణం ఉంది. పరశురాముని దగ్గర విద్య నేర్చుకున్న సమయంలో కర్ణుడు తెలియక వేసిన బాణం ఆవు ప్రాణాలు తీసింది. అది యాగ ధేనువు. దాంతో ఆ బ్రాహ్మణుడు “యుద్ధంలో నీ రథచక్రం భూమిలోకి కృంగిపోతుంది” అని శపించాడు. ఆ సమయంలోనే శ్రీకృష్ణుని ఆజ్ఞానుసారం అర్జునుడు రథం యెత్తుతున్న కర్ణున్ని బాణమేసి చంపాడు.
కర్ణుడికి వసుసేనుడని పేరు పెట్టినా కర్ణుడిగానే లోకం చెప్పుకుంది. కవచకుండలాలు కోసి ఇవ్వడం వల్ల అంటే కర్తనం చేయడం వల్ల “కర్ణుడు” అని పేరు అచ్చమైన నిర్వచనమైంది. అవమానాలు అధిగమించి స్నేహానికి ప్రాణమిచ్చి దానానికి తనని మించినవారు లేరని కర్ణుని కథ మనకు చెపుతుంది!.
– బమ్మిడి జగదీశ్వరరావు
Previous article
నీకు సగం – నాకు సగం (Devotional)
Next article
జర నవ్వండి ప్లీజ్ 123
RELATED ARTICLESMORE FROM AUTHOR
పిల్లలపై థర్డ్ వేవ్ ప్రభావం.. ఎయిమ్స్ ఏం చెబుతోందంటే..?
పిల్లల కోసం మోడెర్నా..
ఆన్ లైన్ లో పిల్లలు ఏం చేస్తున్నారో?
త్వరలో థర్డ్వేవ్.. ఎక్కువ ముప్పు పిల్లలకే..!
చిన్నారుల వ్యాక్సినేషన్ పై క్లారిటీ..
పతంగులు వరల్డ్ ఫేమస్…
టెడ్డీబేర్ ని కొట్టి… అన్నం తినిపిస్తున్నారా?
ఏపీ శీతాకాల సమావేశాలు…. బాబును సొంతపార్టీ నేతలే వణికిస్తున్నారు!
క్రిస్మస్ తాత
RECENT NEWS
అప్పుడు అనుమానించారు.. ఇప్పుడు శభాష్ అంటున్నారు..
హెర్డ్ ఇమ్యూనిటీతోనే కరోనా కట్టడి..
రాజన్న సంక్షేమ పాలన మళ్లీ తేవడమే లక్ష్యం
ఇంద్రవెల్లి ఆత్మగౌరవ దండోరాను ఛాలెంజ్‌గా తీసుకున్న కాంగ్రెస్
ఈ శుక్రవారం సినిమాలు
వివాహ భోజనంబు ట్రయిలర్ రివ్యూ
నిహారిక భర్తపై పోలీస్ కేసు
బన్నీ సినిమా దేవరకొండ చేతికి?
బాలయ్య నుంచి తప్పించుకున్న శృతి
మగవాళ్లకూ సంతాన నిరోధక మాత్రలు.. అతి త్వరలోనే మార్కెట్లోకి..!
డిప్యూటీ సీఎంలు లేరు.. యడ్యూరప్ప ఆశలు గల్లంతు..
కేరళ తప్పుమీద తప్పు.. కేసులు పెరుగుతున్నా ఓనమ్ కి ఓకే..
ఏపీలో ఇకపై 6 రకాల స్కూల్స్..
ఒకటి కాదు, 2 పాటలు పెండింగ్
చిన్న సినిమాకు 600 థియేటర్లు
ఇంద్రలోకం టు ఈస్ట్ గోదావరి
ఒరేయ్ బామ్మర్ది ట్రయిలర్ రివ్యూ
ఇందువదన.. మనిషా.. దెయ్యమా?
చర్చలు వద్దు.. న్యాయమే కావాలి..
దేవేగౌడతో సీఎం భేటీ.. కన్నడనాట మారుతున్న రాజకీయ సమీకరణాలు..!
మీ వాహనంపై చలానా ఉందా.. ఉంటే సీజ్ అయినట్లే..!
రుణంతో రణం.. వైసీపీ వర్సెస్ బీజేపీ..
లాక్ డౌన్ దిశగా ఏపీ..? జిల్లాల్లో కఠిన ఆంక్షలు..
పుష్ప రిలీజ్ డేట్ వచ్చేసింది
క్రేజీ మూవీలో సీనియర్ నటులు
©
Ad