India Languages, asked by SAQUIB2503, 1 year ago

మీకు తెలిసిన మంచిలక్షనాలు ఉన వ్యక్తుల గురించి

Answers

Answered by OfficialPk
3
ఆయనది అనంతపురం జిల్లా, ఎల్లనూరు మండలం, బుక్కాపురం గ్రామము. ఆయన తండ్రి బుక్కాపురం నాదెళ్ల యుగంధర్ 1962 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. రాష్ట్రంలో మంచి అధికారిగా పేరుతెచ్చుకున్నారు. 2004 నుంచి 2009 వరకు ప్రధాని నేతృత్వంలోని కేంద్ర ప్రణాళిక సంఘం సభ్యునిగా, ప్రధానమంత్రి కార్యదర్శిగా పనిచేశారు. నాదెళ్ల యుగంధర్ ఐఏఎస్‌కు ఎంపికైన తర్వాత కుటుంబాన్ని హైదరాబాద్‌కు మార్చారు. 1967లో బీఎన్ యుగంధర్ దంపతులకు హైదరాబాద్‌లో సత్య నాదెళ్ల జన్మించారు.

సత్య ప్రాథమిక విద్యాభ్యాసమంతా హైదరాబాద్‌లోనే సాగింది. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (హెచ్‌పీఎస్)లో చురుగ్గా మెలిగేవాడు.

క్రికెట్ అంటే మహా ఇష్టం. స్కూల్ క్రికెట్ జట్టులో సత్య కూడా సభ్యుడే. బృందంతో సమన్వయంగా వ్యవహరించడం, నాయకత్వ లక్షణాలను క్రికెట్ నుంచే నేర్చుకున్నట్లు ఆయన ఇప్పటికీ చెబుతుంటారు. హెచ్‌పీఎస్ పూర్వ విద్యార్థుల కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. 2013 లో జరిగిన పాఠశాల 90వ వార్షికోత్సవంలో కూడా సత్య పాల్గొన్నారు. మైక్రోసాఫ్ట్ సహకారంతో ప్రస్తుతం పాఠశాలలో విద్యార్థుల కోసం ఓ ప్రాజెక్టును కూడా నిర్వహిస్తున్నారు. పాఠశాల విద్య పూర్తయిన తర్వాత మణిపాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదివారు. 1988లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్‌లో బీఈ పూర్తి చేశారు.

అమెరికాలోని విస్కాన్సిన్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ, చికాగో యూనివర్సిటీ నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లోనూ మాస్టర్స్ డిగ్రీ చేశారు. అనంతరం సాఫ్ట్‌వేర్ రంగంలో పలు హోదాల్లో పనిచేశారు. అమెరికా పౌరసత్వం తీసుకుని అక్కడే స్థిరపడ్డారు. కొంతకాలం సన్ మైక్రో సిస్టమ్స్‌లో పనిచేసిన తర్వాత 1992లో మైక్రోసాఫ్ట్‌లోకి అడుగుపెట్టారు. వ్యాపార సేవల విభాగంలో కీలక పాత్ర పోషించి ఐదేళ్లలోనే కంపెనీ వ్యాపారాన్ని దాదాపు రూ. 9 వేల కోట్ల నుంచి రూ. 31 వేల కోట్లకు చేర్చారు. కొత్త సవాళ్లను స్వీకరించి సమర్థంగా నిర్వహిస్తూ ఆ తర్వాత పదేళ్లలోనే కంపెనీలో ఉన్నత స్థానాలను చేరుకున్నారు.

ఆల్ రౌండర్, నిజాయతీపరుడు, సహాయకారి, సాంకేతిక నిపుణుడు, ఆలోచనాపరుడు, దార్శనికుడు, ఆత్మవిశ్వాసం గల నాయకుడు. అందరితో సత్సంబంధాలు ఏర్పరచుకోవడంలో ఆయన దిట్ట. సాదాసీదాగా ఉంటారు. ఎదుటి వారు చెప్పేది శ్రద్ధగా వింటారు. ఈ స్వభావాలే ఆయన్ని అందలానికి చేర్చాయంటారు సన్నిహితులు.

Answered by BarbieBablu
57

ఝాన్సీ లక్ష్మీభాయి

నాకు నచ్చిన గొప్ప వ్యక్తులు చాలా మంది ఉన్నారు. అందులో ఒకరు అంటే చాలా ఇషం, గౌరవం, అభిమానం... వారు ఎవరో కాదు. ఝాన్సీ లక్ష్మీభాయిగారు. ఈవిడ మన దేశం కోసం చాలా కష్టపడింది. అసలు ఆమే గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు.

లక్ష్మి భాయి అసలు పేరు మణికర్ణిక. చిన్నప్పటి నుండి శక్తి సామర్థ్యాలు కలది. మగవాళ్ళను ఓడించేది. తప్పు అస్సలు చేయదు. ఝాన్సీ అనే పేరుగల రాజ్యంలో ఉన్న రాజుతో వెళ్లి జరిగింది. అప్పుడు ఆమె పేరు "ఝాన్సీ లక్ష్మీభాయి" అనే పేరు పెట్టారు. బ్రిటిష్ వాళ్ళు రాగానే ప్రతి ఒక్కరు తల వంచి నలబడే వాళ్ళు అది కూడా మోకాళ్ళ మీద. చివరికి లక్ష్మీబాయి వాళ్ళ భర్త కూడా తలనంచేవాడు. కాన్నీ లక్ష్మీభాయి ఆలా అస్సలు తలవంచక సాయం. అందుకు బ్రిటిష్ వాళ్ళు లక్ష్మియిని ఓడించాలనుకున్నారు. ఆమె భర్తను కూడా చంపేసారు. కాని ఆమె దేశం కోసం అప్పుడు కూడా తలనంచలేదు. అంత గొప్ప స్త్రీ ఇంకా చెప్పాలంటే ఆమె ను టిష్ వాళ్ళు దొంగదెబ్బ తీసి చంపాలనుకున్నారు. ఆమె చనిపోయేటప్పు కుడా వాళ్ళ ముందు తలవంచలేదు.

లక్ష్మీభాయి అంటే నాకు చాలా గౌరవం, అసలు ఈవిడ ఎంత గొప్ప స్త్రీ అంటే మాటల్లో చెప్పలేము.

Similar questions