History, asked by nareshkomati, 10 months ago

మన పురాణ ఇతిహాసముల పరిజ్ఞానాన్ని పెంపొందించు కునేందుకు ఈ క్విజ్.....

1) భారతం లో " కృష్ణ "పేరుతో ఎందరున్నారు? ఎవరువారు?

2) రుక్మిణి తండ్రి పేరు ఏమిటి ?

3) ద్రోణాచార్యుని భార్య పేరు ఏమిటి ? ఆమె ఎవరికి సోదరి?

4) పార్వతి తండ్రి పేరు ఏమిటి?

5) నారాయణుడు సృష్టించిన అప్సరస ఎవరు ?

6) ఇంద్రుని వద్ద ఉన్న గుర్రం పేరు ?

7) పరీక్షిన్మహారాజు ఏ యాగాన్ని చేసాడు ?

8) పరీక్షత్తు మహారాజు చేసే యాగాన్ని ఆపిన వారెవరు ?

9)ఖాండవ వనమును అగ్నిచే దహింప చేసిన వారెవరు ?

10) యోజన గంధి అని ఎవరికి పేరు కలదు?

11) వినత కుమారులెవరు?

12) భీమసేనుని శంఖం పేరు ఏమిటి?

13) అర్జునుని పెండ్లాడిన నాగకన్య ఎవరు ?

14) గాధేయుడు అంటే ఎవరు?

15) భీముని పెండ్లాడిన రాక్షస కాంత ఎవరు ?

16) ఉపపాండవులను చంపినదెవరు?

17) భీష్ముని అసలు‌పేరు ఎమిటి?

18) వికర్ణుడు ఎవరు?

19)ధృతరాష్ట్రుని కూతురు ఎవరు ‌?

20)పాండవుల పురోహితుడు ఎవరు ?​

Answers

Answered by poojan
13

మన పురాణ ఇతిహాసముల పరిజ్ఞానాన్ని పెంపొందించు కునేందుకు ఇచ్చిన ప్రశ్నల యొక్క సమాధానములు :-

1) భారతం లో " కృష్ణ "పేరుతో ఇద్దరు. కృష్ణుడు మరియు ద్రౌపది (కృష్ణి అని పేరు కలది. చర్మపు రంగు వలన )  

2) రుక్మిణి తండ్రి పేరు భీష్మక.

3) ద్రోణాచార్యుని భార్య పేరు కృపి. కృపి కృపునికి సోదరి.

4) పార్వతి తండ్రి పేరు హిమవంతుడు

5) నారాయణుడు సృష్టించిన అప్సరస ఊర్వశి

6) ఇంద్రుని వద్ద ఉన్న గుర్రం పేరు ఉచ్చైశ్రవం

7) పరీక్షిన్మహారాజు అశ్వమేధయాగాన్ని యాగాన్ని చేసాడు

8) పరీక్షిత్తు మహారాజు చేసే యాగాలు మూడు అశ్వమేధయాగాలు. వాటిని ఎవరు ఆపలేదు.

పరీక్షిత్తు కుమారుడైన జనమేజయుడు ప్రతీకారానికై చేసిన సర్ప యాగాన్ని ఆపిన వారు ఆస్తిక ముని .

9) ఖాండవ వనమును అగ్నిచే దహింప చేసిన వారు కృష్ణార్జునులు  

10) యోజన గంధి అని పేరు కలది సత్యవతి

11) వినత కుమారులు అరుణుడు మరియు గరుత్మంతుడు

12) భీమసేనుని శంఖం పేరు పౌంద్ర

13) అర్జునుని పెండ్లాడిన నాగకన్య ఉలూచి

14) గాధేయుడు అంటే విశ్వామిత్రుడు

15) భీముని పెండ్లాడిన రాక్షస కాంత  హిడింబి

16) ఉపపాండవులను చంపినది అశ్వద్ధామ  

17) భీష్ముని అసలు‌పేరు దేవవ్రతుడు

18) వికర్ణుడు దుర్యోధనుడి సోదరుడు.

19) ధృతరాష్ట్రుని కూతురు ‌దుశ్శల

20) పాండవుల పురోహితుడు ధౌమ్యర్షి ( ధౌమ్య ఋషి )

Learn more :

1. 'రాజు రివాజులు బూజు పట్టగన్' అంటే ఏమిటి?​

brainly.in/question/16066294

2. భారతం నుండి కొన్ని కఠిన ప్రశ్నలు.

brainly.in/question/16302876

3. సిఐడి ఆఫీసర్ గుప్తంగా చెప్పిన ఫోన్ నెంబర్ కనిపెట్టండి.

brainly.in/question/16289469

4. పదాలకు సరళమైన తెలుగులో అర్ధాలు

brainly.in/question/16442994

Similar questions