English, asked by ishan3593, 11 months ago

పొడుపు కథలు "" కరొన క్విజ్ " ************** 1. అందరాని వస్త్రంపై ఆరపోసిన వడియాలు. 2. అడవిలో పుట్టాను. వంటినిండా గాయాలు. కడుపునిండా రాగాలు. 3. ఇంట్లో మొగ్గ, బయట పూవు. 4. ఎండిన బావిలో పిల్లల గంతులు. 5. అమ్మ పడుకుంటే బిడ్డ తిరుగాడుతుంది. 6. అంగుళం గదిలో అరవై మంది నివాసం. 7. అన్ని దేశాలకు ఇద్దరే రాజులు. 8. కోస్తే తెగదు. కొడితే పగలదు. 9. కన్ను ఉన్నా తల లేదు. 10. చారెడు కుండలో మానెడు పగడాలు. 11. చుట్టింటి లోపలికి దారే లేదు. 12. చేతికి దొరకదు, ముక్కుకు దొరుకుతుంది. 13. బట్టలు విప్పి బావిలో దూకుతుంది. 14. బక్కవాడికి బారెడు చొక్కా. 15. పచ్చని మేడ, తెల్లని గదులు, నల్లని దొరలు. జవాబులు కనుక్కోగలరేమో ప్రయత్నించండి..

Answers

Answered by UsmanSant
0

పొడుపు కథలు "" కరొన క్విజ్ " యొక్క సమాధనాలు

1. అందరాని వస్త్రంపై ఆరపోసిన వడియాలు - ఆకాశం, నక్షత్రలు

2. అడవిలో పుట్టాను. వంటినిండా గాయాలు. కడుపునిండా రాగాలు - ఫ్లుటె

3. ఇంట్లో మొగ్గ, బయట పూవు - గొడుగు

4. ఎండిన బావిలో పిల్లల గంతులు. - పెలాలు

5. అమ్మ పడుకుంటే బిడ్డ తిరుగాడుతుంది - గొంగలి పురుగు

6. అంగుళం గదిలో అరవై మంది నివాసం అగ్గిపెట్ట.

7. అన్ని దేశాలకు ఇద్దరే రాజులు - సూరుడు, చంద్రుడు

8. కోస్తే తెగదు. కొడితే పగలదు - వజ్రం

9. కన్ను ఉన్నా తల లేదు - సూది

10. చారెడు కుండలో మానెడు పగడాలు - దానిమ్మ పండు

11. చుట్టింటి లోపలికి దారే లేదు.- గుడ్డు

12. చేతికి దొరకదు, ముక్కుకు దొరుకుతుంది. - గాలి, వసన

13. బట్టలు విప్పి బావిలో దూకుతుంది - అరిటి పండు

14. బక్కవాడికి బారెడు చొక్కా. - బట్టల హంగేర

15. పచ్చని మేడ, తెల్లని గదులు, నల్లని దొరలు - సీతాఫలం

Answered by suggulachandravarshi
17

Answer:

హలో! నేను కూడా తెలుగునే! ఇక్కడ ఒక తెలుగువారిని కలవడం ఎంతో సంతోషంగా ఉంది.

1. అందరాని వస్త్రంపై ఆరపోసిన వడియాలు. - ఆకాశం, నక్షత్రాలు.

2. అడవిలో పుట్టాను. వంటినిండా గాయాలు. కడుపునిండా రాగాలు. - మురళి.

3. ఇంట్లో మొగ్గ, బయట పూవు. - గొడుగు.

4. ఎండిన బావిలో పిల్లల గంతులు. - పేలాలు.

5. అమ్మ పడుకుంటే బిడ్డ తిరుగాడుతుంది -గొంగళి పురుగు.

6. అంగుళం గదిలో అరవై మంది నివాసం. - అగ్గిపెట్టె.

7. అన్ని దేశాలకు ఇద్దరే రాజులు. - సూర్యుడు, చంద్రుడు.

8. కోస్తే తెగదు. కొడితే పగలదు. - వజ్రం

9. కన్ను ఉన్నా తల లేదు. - సూది.

10. చారెడు కుండలో మానెడు పగడాలు. - దానిమ్మ పండు.

11. చుట్టింటి లోపలికి దారే లేదు. -గుడ్డు

12. చేతికి దొరకదు, ముక్కుకు దొరుకుతుంది. - వాసన

13. బట్టలు విప్పి బావిలో దూకుతుంది. - అరటిపండు

14. బక్కవాడికి బారెడు చొక్కా. - బట్టల హ్యంగర్

15. పచ్చని మేడ, తెల్లని గదులు, నల్లని దొరలు. - సీతాఫలం.

నా సమాధానం నీకు ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను...❣️❣️

Similar questions