1) చదువుకుంటే ఏమి కలుగుతుంది?
Answers
Explanation:
చదువు వల్ల మనిషి "మనిషి" అవుతాడు. అజ్ఞాన అంధకారాన్ని తొలగించడానికి జ్ఞాన జ్యోతిని వెలిగించుకోవాలి. చదువు మనిషిలోని సంస్కారానికి దారి చూపేది. అందుకే పెద్దలు "విద్యా దదాతి వినయం" అన్నారు. వినయ విధేయతలు ఉన్న వ్యక్తిని సమాజం గౌరవిస్తుంది. 'చదువు గొప్పదనాన్ని తెలియజేస్తూ పోతన తన భాగవతంలో 'చదువని వాడుండగు అని హిరణ్యకశిపునిచే పలికించాడు. ఏ సంపద అయిన, బంధుత్వాలైనా మన నుండి దూరం అవుతాయి. కాని విద్యా సంపద దొంగలు దోచలేరు. ప్రళయకాలంలో సైతం మన నుండి దూరం కాదు. అందుకే - దొంగపాలు కాదు, దొడ్డకీర్తిని దెచ్చు పరమ సౌఖ్యమిచ్చు, భద్రమిచ్చు యాచకునకు నీయ నావంత తరుగదు విద్యబోలు ధనము పృధివి గలదే! అంటూ ఎందరో మహనీయులు విద్య ఔన్నత్యాన్ని వేనోళ్ళ కీర్తించారు. ఇంకొందరైతే ఒక అడుగు ముందుకు వేసి "విద్య లేని వాడు వింత పశువు" అని తెగిడారు. చదువు వల్ల మంచిచెడుల తారతమ్యం తెలుస్తుంది. విశాలమైన దృక్పథం ఏర్పడుతుంది. జీవన భృతి దొరుకుతుంది. తల్లిదండ్రులకు, వంశానికి కీర్తి కలుగుతుంది. పరోపకార బుద్ధి కలుగుతుంది.