105. మీరు ఇప్పటి వరకు ఏయే నగరాలు చూసారు?అందులో మీకు నచ్చిన,నచ్చని అంశాల గురించి తెలుపండి?
లఘుప్రశ్నలు Chapter5 నగర గీతం -అలిసెట్టి ప్రభాకర్
Page Number 43 Telangana SCERT Class X Telugu
Answers
నేను ఇప్పటి వరకు హైదరాబాద్,బెంగలూరు,విజయవాడ,నగరాలను చూసాను.
హైదరాబాద్;
నచ్చిన అంశం;
అసెంబ్లీ,మ్యుసియo, గోలకొండ కోట ,ట్యాంక్ బండ్,నెక్లస్ రోడ్,రోడ్లపక్కన అందమైన చిత్రాలు.
నచ్చని అంశం;
1)ట్రాఫిక్ జాం ,2) మురికి బస్తీలు,౩) పార్కింగ్ జులుం, 4) చిన్నవర్తకుల పేవ్మెంట్లు ఆక్రమించి పాదచారులకు ఇబ్బంది కలిగించడం.
బెంగళూరు;
నచ్చిన అంశం;
బృందావన్ గార్డెన్స్,లాల్ బాగ్,విధాన సౌద, ఉద్యాన వనాలు,రోడ్ల పరిశుభ్రత.
నచ్చని అంశాలు;
విపరీత ట్రాఫిక్ సమస్య,ఆటో రిక్షాల అధిక ధరలు,జన సమ్మర్ధం.
విజయవాడ;
నచ్చిన అంశాలు;
కనకదుర్గ గుడి,ప్రకాశం బారేజ్,బిర్లా ప్లానిటోరియం,ఫెర్రి,మొదలైనవి.
నచ్చని అంశాలు;
ఇరుకు రోడ్లు,సిటి బస్సుల కొరత,అధిక వేడి.
పై ప్రశ్న అలిసెట్టి ప్రభాకర్ గారు రాసిన' నగరగీతం ' అనే పాఠo నుండి ఈయబదినది.
ఇది మినీ కవితా ప్రక్రియకు చెందింది.ఏదైనా ఒక అంశాన్ని కోసమెరుపుతోనో,వ్యంగ్యంతోనో ,చురకతోనో,తక్కువ పంక్తులతో చెప్పడాన్ని "మినీ కవిత"అంటారు.ప్రస్తుత పాఠ్యభాగం 'సిటీ లైఫ్' అనే మినీ కవితలలో కొన్నిటిని "నగర గీతం" అనే కవిత గా పేరు మార్చి పాఠంగా నిర్ణ యించారు.