116. అఙ్ఞానము,ఉదాసీనత వలన నష్టాలేమిటి?
లఘుప్రశ్నలు Chapter6 భాగ్యోదయం -కృష్ణస్వామి ముదిరాజ్
Page Number 46 Telangana SCERT Class X Telugu
Answers
అజ్ఞానం-అంటే తెలియని తనం.సరిపడా తెలివి లేకపోవడం.ఇది అనేక కష్ట నష్టాలకు కారణ మవుతాయి.ఎ విషయానికి సంబంధించిన జ్ఞానం లేకపోయినా ఆ విషయంలో తగిన ప్రయోజనాని పొందలేం.
ఉదాసీనత- ఇది అజ్ఞానం కంటే భయంకరమైనది.దేన్నీ పట్టించుకోక పోవడం.చూసిచూడనట్టు వుండడం.తమకు అపకారం జరుగుతున్నా పట్టించుకోక పోవడం.నష్టాన్ని కలిగించేవే కదా.
మనకేం జరిగినా,పక్కవాళ్ళకి నష్టం జరిగినా,అన్యాయాలు,అక్రమాలు జరిగినా,పట్టించుకోక పోవడం,అన్ని రకాల కష్ట ,నష్టాలు కలిగిస్తాయి.
పై ప్రశ్న భాగ్య రెడ్డి వర్మ కుమారుడైన ఎం.బి.గౌతం రచించిన 'భాగ్యరెడ్డి వర్మఇవిత చరిత్ర'గ్రంధం లోనిది.ఆ గ్రంధానికి కృష్ణ స్వామీ ముదిరాజ్ రాసిన వ్యాసం నుండి ప్రస్తుత పాఠం గ్రహించబడినది.స్వాతంత్ర సమరయోధుడిగా,రచయితగా,హైదరాబాద్ మేయర్ గా ,బహుజన సమాజ సంస్కర్తగా,ప్రజల మన్నన లందుకున్నారు ముదిరాజ్ గారు.'పిక్తోరియాల్'హైదరాబాద్ 'అనే గొప్ప గ్రంధాన్ని దృశ్య రూపకంగా తయారు చేసారు.భారత స్వాతంత్ర ఉద్యమం'చరిత్ర రాసే సంఘంలో ప్యానల్ సభ్యుడు.మిత్రుడు భాగ్య రెడ్డి వర్మ తో కలిసి దళితుల అభ్యున్నతికి కృషి చేసాడు.