121. చదువు కోవడం వల్ల సమాజం ఏవిధంగా చైతన్యవంత మవుతుంది?
లఘుప్రశ్నలు Chapter6 భాగ్యోదయం -కృష్ణస్వామి ముదిరాజ్
Page Number 47 Telangana SCERT Class X Telugu
Answers
మనుషులందరూ చదువుకుంటే ఆ సమాజం చైతన్యఅవుతుంది.చదువంటే అజ్ఞానాన్ని తొలగించేది.జ్ఞానం వల్ల విచక్షణ పెరుగుతుంది.
ఏదిమంచి,ఏది చెడు తెలుసుకునే తెలివి వస్తుంది.ప్రపంచం లో ఎక్కడ ఏమి జరుగుతోందో తెలుస్తుంది.
పుస్తకాలు చదివి తను చేసే పనిలో నైపుణ్యాన్ని పెంచుకోవచ్చు.తద్వారా అభివృద్ధి కలిగి గౌరవం పెరుగుతుంది.మూధనమ్మకాలు పోతాయి.దురలవాట్ల వల్ల ఆకలిగే అనర్ధాలు తెలుస్తాయి.
అందుచేత చదువువల్ల సమాజం చాల రకాలుగా చైతన్యవంత మవుతుంది.
పై ప్రశ్న భాగ్య రెడ్డి వర్మ కుమారుడైన ఎం.బి.గౌతం రచించిన 'భాగ్యరెడ్డి వర్మఇవిత చరిత్ర'గ్రంధం లోనిది.ఆ గ్రంధానికి కృష్ణ స్వామీ ముదిరాజ్ రాసిన వ్యాసం నుండి ప్రస్తుత పాఠం గ్రహించబడినది.స్వాతంత్ర సమరయోధుడిగా,రచయితగా,హైదరాబాద్ మేయర్ గా ,బహుజన సమాజ సంస్కర్తగా,ప్రజల మన్నన లందుకున్నారు ముదిరాజ్ గారు.'పిక్తోరియాల్'హైదరాబాద్ 'అనే గొప్ప గ్రంధాన్ని దృశ్య రూపకంగా తయారు చేసారు.భారత స్వాతంత్ర ఉద్యమం'చరిత్ర రాసే సంఘంలో ప్యానల్ సభ్యుడు.మిత్రుడు భాగ్య రెడ్డి వర్మ తో కలిసి దళితుల అభ్యున్నతికి కృషి చేసాడు.