154. ఉద్యమ కాలం లో హైదరాబాద్ విధులు,మైదానాల ప్రత్యేకతలు ఏమిటి?
లఘుప్రశ్నలు Chapter8 లక్ష్య సిద్ది -సంపాదకీయం
Page Number 85 Telangana SCERT Class X Telugu
Answers
తెలంగాణసాధన ఉద్యమ కాలo మరో నిజాం వ్యతిరేక పోరాటాన్ని తలపించింది.
పార్టీలకు ,వర్గాలకు,కులాలకు,మతాలకు అతీతమై తెలంగాణా ఉద్యమం నగర విధుల్లో ఎర్ర గులాబీలను పూయించింది.
స్థలమేదైనా,సందర్భమేదైనా,తెలంగాణా స్వేఛ్చ కోసం గళాలన్ని నిప్పు కణాలు విరజిమ్మాయి.
గులాబి జెండాలతో విధులన్నీ నిండిపోయేవి.
వీధులు "జై తెలంగాణ" నినాదాలతో మారు మొగిపోయేవి.
కళాశాలలు,ఉద్యోగులు,వ్యాపారులు,కవులు,కళాకారులు,సమరాగ్నిని చల్లారకుండా,దశ దిశలు ఉద్యమించి ,దిశలన్ని,ఉద్యమ కాంతితో నిండిపోయేటట్లు,చేసారు.మైదానలన్ని జనసంద్రమయ్యాయి.
ఈ పాఠం సంపాదకీయ ప్రక్రియకు చెందింది.జరిగిన సంఘటనల్లో ముఖ్యమైన విషయాన్ని తీసుకోని పత్రికలలో తమ విశ్లేషణ తో ,ఆ విషయానికి సంబంధించన పరిస్తితులను పరామర్శిస్తూ సాగే రచనను సంపాద కీయ వ్యాసం అంటారు.అలాంటి ఒక వ్యాసమే పాఠంగా ఇవ్వబడింది.
తెలంగాణా రాష్ట్రం అవతరించిన సందర్భంగా జూన్ 2,2014 నాడు,ప్రస్తుత వ్యాసం ఒక దిన పత్రిక లో వచ్చిన సంపాదకీయం.తెలంగాణా ఉద్యమ మహాప్రస్థానం లోని మైలురాళ్ళను ఇది మనకు పరిచయం చేస్తుంది.