159. అ రాష్ట్రంలో కవులు ,కళాకారులపాత్ర.
ఆ ఉద్యోగులు,ఉపాధ్యాయులు,విద్యార్ధుల పాత్ర.
లఘుప్రశ్నలు Chapter8 లక్ష్య సిద్ది -సంపాదకీయం
Page Number 105 Telangana SCERT Class X Telugu
Answers
1.రాష్ట్ర సాధనకోసం అడుగడుగునా అదృశ్య శక్తిని అందించిన వాళ్ళు మాత్రం కవులు,కళాకారులే.
2.కవులు తమ కలాలతో నిప్పులు కురిపించారు.
౩. కళాకారులు ఉరుములై గర్జించి ప్రజల హృదయాలను ఉత్స్తాహంతో నింపారు.
4.కవులు తమ ఆలోచనలకు అక్షర రూపమిచ్చారు,కళాకారులు ఆ అక్షరాలను ఆయుధాలుగా మలచుకొన్నారు.
5.కవులు తమ గళాలను కత్తులుగా మార్చుకొన్నారు.
6.కళాకారులు వాటిని మరింత హృద్యంగా నృత్య రూపకాలతో ఆవేశాన్ని రగిల్చారు.
7.విరిచ్చిన ఉత్సాహంతో ఎందఱో విరులు ప్రాణాలకు తెగించి పోరాడారు.
ఈ పాఠం సంపాదకీయ ప్రక్రియకు చెందింది.జరిగిన సంఘటనల్లో ముఖ్యమైన విషయాన్ని తీసుకోని పత్రికలలో తమ విశ్లేషణ తో ,ఆ విషయానికి సంబంధించన పరిస్తితులను పరామర్శిస్తూ సాగే రచనను సంపాద కీయ వ్యాసం అంటారు.అలాంటి ఒక వ్యాసమే పాఠంగా ఇవ్వబడింది.
తెలంగాణా రాష్ట్రం అవతరించిన సందర్భంగా జూన్ 2,2014 నాడు,ప్రస్తుత వ్యాసం ఒక దిన పత్రిక లో వచ్చిన సంపాదకీయం.తెలంగాణా ఉద్యమ మహాప్రస్థానం లోని మైలురాళ్ళను ఇది మనకు పరిచయం చేస్తుంది.
ఉద్యోగులు,ఉపాద్యాయుల పాత్ర ;
1.ఉద్యోగులు ,తమకు జరుగుతున్నఅన్యాయాలకు నిరసనగా పెన్ దోఎన్ లాంటి కార్యక్రమాలు నిర్వహించారు.
2.విదుల పరిష్కరణ,నిరాహార దీక్షలు,ర్యాలీలు,నిరసనలు,రాస్తారోకోలు,ఈ విధంగా అనేక పద్దతులలో వారు తమ నిరసనను తెలియ జేశారు.
౩.తెలంగాణా సాధన పై తమ ఆకున్తిత దీక్షను చాటుకున్నారు.
4.అసమానత ,అన్యాయం సహించలేని ఉద్యోగులు తెలంగాణా రాష్ట్ర సాధన కై తమ గళం విప్పారు.
5.ప్రొఫెసర్ కోదండరాం నాయకత్వంలో సింహాలల గర్జిస్తూ పోరాటంలోకి దూకారు.
6.ఉద్యమంలో అందరికంటే చురుగ్గా ,పాల్గొన్నవాళ్ళు ,ఎక్కువ కష్టాలు పడ్డవాళ్ళు,నష్టపోయిన వాళ్ళు,ప్రాణాలను అర్పించినవాళ్ళు,విద్యార్దులే.
7.లాఠి దెబ్బలకు,తుపాకి బుల్లెట్లకు ఎదురొడ్డి,వేన్నిచూపక ముందుకురికారు.
8.కళాశాలలు,మైదానాలను ఉద్యమ వేదికలుగా చేసుకొని,తమ ఆవేదనకు,ఆవేశాన్ని చేర్చి పాలకులపై నిప్పులు కురిపించారు.
9.కవులు కళాకారుల తో జతకలిసి ఆట పాటలతో సంఘటిత శక్తిగా మారారు.
10.స్వరాష్ట్ర కోసం అమరులైన వాళ్ళలో అత్యధికులు విద్యార్ధులే.