193. గోలకొండ పట్టణం లో వర్తక వాణిజ్యాలు ఎలా సాగాయి?
ఆలోచించండి-రాయండి Chapter10 గోలకొండ పట్టణము -ఆదిరాజు వీరభద్రరావు
Page Number 125 Telangana SCERT Class X Telugu
Answers
గోలకొండ పట్టణం గొప్ప వర్తక వాణిజ్య కేంద్రంగా ప్రసిద్ది పిందింది.
పట్టణంలో లోని బజార్లలో,తినిబందారాలు,నగలు,నాణెములు,విలాస వస్తువులు,చిల్లర వస్తువులు బాగా దొరికేవి.
పెద్ద వర్తకులు,విదేశి వర్తకులు వర్తకం చేసి బాగా సంపాదించేవారు.
గోలకొండ లో వజ్రాల వ్యాపారం కూడా బాగా సాగేది.
విదేశి వస్తువులు మచిలీపట్నం ఓడరేవు ద్వారా గోలకొండ వచ్చేవి.
తెలంగాణా ఈజిప్తు అంగడిగా గోలకొండ పేరు గాంచింది.
డచ్,తుర్కిస్తాన్,అరేబియా,పర్షియా,దేశాలతో వ్యాపారం జరిగేది.
బియ్యం,జొన్నలు,గోధుమలు,సీసం,తగరం,కస్తూరి,చైనాపట్టు,కర్పూరం,గాజు సామాను,సుగంధ ద్రవ్యాలు,ఎగుమతులు,దిగుమతులయ్యేవి.
పుట్టి,మనుగు సేరు,మొదలగు కొలతలు చెలామణిలో ఉండేవి.
పై ప్రశ్న గోలకొండ పట్టణము అనే పాఠం నుండి యియబడింది.ఈ పాఠం వ్యాస ప్రక్రియ కు చెందింది.వ్యాసం అంటే వివరించి చెప్పడం.అది చరిత్రను చెప్పే వ్యాసం ఐతే "చారిత్రిక వ్యాసం"అంటారు.రచయిత శ్రీ ఆదిరాజు వీరభద్ర రావు గారు ఖమ్మం జిల్లా ,మధిర తాలుకా లో జన్మించి హైదరాబాదులో స్తిరపడ్డారు.ఈయన తన పాండిత్యం ,పరిశోధనలతో "తెలంగాణా భీష్ముడుగా పేరుతెచ్చుకున్నారు.ఈయన హైదరాబాద్ రేడియో లో తొలి ప్రసంగం చేసారు.ఈయన తెలుగు పండితునిగా పనిచేసారు.