2.
కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి?
అ) ఈ పాఠం ద్వారా సామల సదాశివ గురించి మీకేమర్థమయిందో రాయండి.
కింది అంశాన్ని గురించి సృజనాత్మకంగా / ప్రశంసిస్తూ రాయండి.
అ) మీ ప్రాథమిక విద్యాభ్యాస జీవితంలో మీరు మరచిపోలేని జ్ఞాపకాలను ఒక వ్యాసంగా రాయండి.
( లేదా )
మీ పరిసరాల్లో జరిగిన ఏదైనా సంఘటనను వాడుకభాషలో సంభాషణగా రాయం
Answers
Answer:
బూర్గుల వారి వ్యక్తిత్వం మహోన్నతమైనది.ఆయన ఒక పరిపూర్ణమైన వ్యక్తీ.
ఆయన పొట్టిగా వుండేవారు.కాని ఆయనలో బహుముఖమైన ప్రతిభ వుంది.
న్యాయవాదిగా ఆయన వాదనా పటిమ అమోఘం.
ఆయనలో సునిశిత మేధా సంపత్తి వుంది.
బూర్గుల వారు తమ జూనియర్ న్యాయావాదులను బాగా ప్రోత్సహించి వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపేవారు.
వారందరికీ ఆయన ప్రాతస్మరనియులు.
వీరు గొప్ప రాజనితిజ్ఞులు.
కౌలుదారి చట్టాన్ని తయారుచేయడంలో ముఖ్య పాత్ర పోషించారు.
అన్ని జాగ్రత్తలతోను,మంచి వ్యవహార దక్షత తోనూ నిర్ణయాలు తీసుకునేవారు.
బూర్గుల రామక్రిష్ణారావు గారి జివనయాత్ర ఎప్పుడు సాఫీగా సాగలేదు.అనేక సందర్భాల్లో అనేక ఆపదలు,కష్టాలను ఆయన ఎదుర్కున్నారు.ఐన ఆయన ఏమాత్రం తన ఆత్మా స్థైర్యాన్ని కోల్పోలేదు
.
ఆయన విజయాలకు పొంగలేదు,కష్టాలకు కుంగిపోలేదు.మిత్రులైన,సత్రువులైనా ఎవరు ఆయనకు ద్రోహం తలపెట్టినా నవ్వుతు “ఇవన్ని ఆటలో భాగామే కద “ అని సరిపెట్టుకునే వారు.
పూనాలో ఆయన ఫెర్గూసన్ కాలేజీ లో పర్షియన్ భాష చదివారు.
పట్టబద్రులైన తర్వాత కొంతకాలం పర్షియన్ ట్యటర్ గా పనిచేసారు.
న్యాయవాద పట్ట తీసుకోని న్యాయవాడిగా కూడా పనిచేసారు.
Answer:
సామల సదాశివగారు తెలంగాణలోని కుంరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో భాగమైన దహెగామ్ మండలం "తెనుగుపల్లె"లో జన్మించారు. వారికి ఆ ప్రాంతపు తీయని తెలుగుపై మమకారం. తన మనుమరాలు లావణ్య 'ఇగపటు' అని ఆ ప్రాంతపు తెలుగులో మాట్లాడడం విని, వీరు ఆనందంతో ఆశ్చర్యపడ్డారు.సదాశివగార్కి కప్పగంతుల లక్ష్మణశాస్త్రిగారు గురుస్థానీయులు, సదాశివగారు లక్ష్మణ శాస్త్రిగారి వద్ద కూర్చుండి, తరచుగా జాబులు రాసేవారు. లక్ష్మణశాస్త్రిగారి నుండి ఎన్నో సాహిత్య విషయాలు వీరు తెలుసుకున్నారు. ఆంధ్రసాహిత్య పరిషత్తు ఏర్పడడానికి కారకులైన గడియారం రామకృష్ణశర్మగారు కూడా, సదాశివగారికి గురుస్థానీయులు. సదాశివగారు, వేలూరి వారికి కూడా ఏకలవ్య శిష్యులు.
వరంగల్లులో కూరగాయలమ్మే స్త్రీల మాటల్లో కూడా అచ్చమయిన తెలుగు మాట వినిపిస్తుందని సదాశివగారు. అంటారు. ఆడవాళ్ళ నోటనే అసలైన భాష వినిపిస్తుందని సదాశివగారి తలంపు, సదాశివగారు ఉర్దూలో చక్కగా మాట్లాడగలరు. సదాశివగారి తెలుగు వ్యాసాలను ఆంధ్రప్రాంతం వాళ్ళు కూడా మెచ్చుకొనేవారు.
అన్ని ప్రాంతాలు తెలుగు పలుకుబళ్ళనూ, ఇప్పుడు తెలుగు అనుకుంటున్న భాషలో కలుపుకోవాలని సదాశివగారి అభిప్రాయం. ఉర్దూ భాషలో ప్రజల పలుకుబడికే ప్రాధాన్యమని సదాశివగారి అభిప్రాయం.
సదాశివగారు హిందీ, సంస్కృతం, తెలుగు, ఇంగ్లీషు, మరాఠీ, ఫార్సీ భాషల్లో పండితులు. వీరి "స్వరలయలు” గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.