India Languages, asked by saivineethreddy68, 8 months ago

2.
'పాకము' ఎలా ఉండాలి?​

Answers

Answered by arunapadala29
2

Answer:

HEY BUDDY HERE IS YOUR ANSWER. I HOPE IT HELPS YOU. :)

Explanation:

PAAKAMU THEEGA LA RAAVALI

Answered by Anonymous
1

Answer:

Explanation:

మైసూర్ పాక్ అంటే అందరికి ఇష్టమే… కానీ బెస్ట్ మైసూర్ పాక్ చేయాలంటే అంటే భయం!!! నా టిప్స్ తో చేయండి మీకు పక్కగా వస్తుంది. వెన్నలా కరిగిపోతుంది.  కొంచెం అతిసేయోక్తి అనుకోకపోతే స్వీట్ షాప్ కంటే చాలా బాగా వస్తుంది. ఇది నేను ఎన్నో సార్లు ఫెయిల్ అయిన అనుభవంతో చెబుతున్నాను!

“గుల్ల మైసూర్ పాక్” రెసిపీ చెప్పండి, అని నేను మిల్క్ మైసూర్ పాక్ చేసినప్పటి నుండి నన్ను చాలా సార్లు అడుగుతూనే ఉన్నారు. కానీ, నేను పర్ఫెక్ట్ అవ్వకుండా ఏ రెసిపీ పోస్ట్ చేయను. అందుకే ఇన్నాళ్ళు టైం పట్టింది. నేను ఈ రెసిపీ కనీసం 10-12 సార్లు చేసి ఫెయిల్ అయ్యాక గాని అసలు కిటుకులు అర్ధం కాలేదు. కాబట్టి ఎక్కడ పొరపాటు జరుగుతుందో ఆ స్టెప్స్ అన్నీ వివరంగా ఉంటాయి ఇందులో.

మైసూర్ పాక్ చేయడంలో అందరూ ఎదురుకునే ఎన్నో ఇబ్బందులని నేను వివరంగా ఉంచాను. పర్ఫెక్ట్  మైసూర్ పాక్ చేయడం చాలా తేలిక. కానీ, అడుగడుగునా అన్నీ ముఖ్యమైన టిప్స్ ఉంటాయి. ఏ చిన్న పొరపాటు చేసినా మైసూర్ పాక్ రుచి లో తేడా వస్తుంది. మైసూర్ పాక్ రాదా అంటే వస్తుంది, కానీ వచ్చిన ప్రతీ పాకాన్ని మైసూర్ పాక్ అని అనలేము.

మైసూర్ పాక్ కి ఓ ప్రేత్యేకమైన రుచితో గుల్లగా కరకరలాడుతూ ఉండాలి. అలగే నోట్లో పెట్టుకుంటే కరిగిపోవాలి వెన్నలా. ఇన్ని ఎలా సాధ్యం? అంటే అది మైసూర్ పాక్ కి సాధ్యం మరి!!! చేసే తీరులో చేస్తే అన్నీ సరిగ్గా వస్తాయ్.

నేను చేస్తున్న మైసూర్ పాక్ సుమారు 1.25 కిలోలు వస్తుంది.

ఈ గుల్ల మైసూర్ పాక్ కి మాత్రం మీరు జాగ్రత్తగా టిప్స్ చదివి రెసిపీ మొదలు పెట్టండి.

బెస్ట్ గుల్ల మైసూర్ పాక్ కి కొన్ని టిప్స్:

  • మూకుడు ఎప్పుడూ, చేసే కొలతకి 4 ఇంతలు ఉండాలి. అంటే కిలో మైసూర్ పాక్ చేయాలంటే 3-4 కిలోలు చేసేంత మూకుడు అవసరం.
  • నూనె బాగా వేడిగా సలసల మరుగుతుండాలి, అప్పుడే మైసూర్ పాక్ గుల్లగా వస్తుంది.
  • సెనగపిండి ముందే జల్లించి నూనె వేసి కలిపితే రవ్వ గా అయ్యి, పాకం లో వేసాక వెంటనే కరిగిపోతుంది పాకంలో గడ్డలుగా అవ్వదు.
  • పంచదార పాకం కచ్చితంగా ఓ తీగ పాకం రావాలి. లేత పాకం వస్తే విరిగిపోతుంది, ముదురు పాకం వస్తే గట్టిగా రాయిలా అవుతుంది
  • పాకం మరుగుతున్నపుడు అంచుల వెంట 2 tbsps నీళ్ళు చిలకరించుకోవాలి. మరుగుతూ చిక్కబడుతున్న పాకం ముకుడుకి అంటుకుని పాకం నల్లబడుతుంది. అచుల వెంట నీళ్ళు చల్లి పాకాన్ని కలుపుతూ ఉంటె మైసూర్ పాక్ రంగు మారదు.
  • సెనగపిండి పాకంలో పోసే టైం కి నూనె సలసల మరుగుతుండాలి.
  • పాకం లో వేసిన సెనగపిండి ఒక్క ఉడుకురాగానే మరుగుతున్న నూనె పోసి హై-ఫ్లేం మీద మాత్రమే కలుపుతూ ఉండాలి. లేదంటే పాకం గుల్లగా రాదు. మైసూర్ పాక్ పాకం మొత్తం హై ఫ్లేం మీదే చేయాలి.
  • పాకం తయారయ్యాక అచ్చుగా పోసేందుకు కావలసిన మౌల్ద్ ముందే సిద్దంగా ఉంచుకోవాలి. పొయ్యి మీద నుండి దిమ్పాక ఎమాతరం ఆలస్యం చేసినా క్షణాల్లో మైసూర్ పాక్ రుచి, రూపం మారిపోతుంది. అందుకే వెంటనే పోసేయాలి మౌల్ద్ లో. అందుకే మైసూర్ పాక్ మొదలు పెట్టడానికి ముందే మౌల్ద్ కి నూనె పట్టించి ఉంచుకోవాలి.
  • ఆఖరున అంటే పాకం మౌల్ద్ లో పోసాక 2 tbsps పంచదార వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు.
  • నేను రెండు చిటికెళ్ళు యెల్లో ఫుడ్ కలర్ వేసాను. నచ్చితే వేసుకోండి. లేదంటే వదిలేయోచ్చు.
  • మైసూర్ పాక్ కి యాలకల పొడి లాంటివి అవసరం లేదు. కమ్మగా వేగిన సెనగపిండి అరోమా చాలా బాగుంటుంది.
  • ఆఖరున అంటే 3/4 కప్ నూనె ఉండగా ఒక్క సారిగా నూనె అంతా పోసేసి కలపాలి, అప్పుడు పొంగుతుంది. ఆ పొంగు చాలా అవసరం. ఆఖరున వచ్చే ఆ పొంగే మైసూర్ పాక్ లో గుల్లగా మిగిలి ఉంటుంది.
  • పొంగిన పాకం ఒక్కసారిగా  దిమ్మరించినట్లుగా మౌల్ద్ లో పోసేయాలి. లేదంటే పొడిపొడిగా అవుతుతుంది మైసూర్ పాక్.
  • మైసూర్ పాక్ ని వేడి మీదే కత్తితో కాక బ్లేడ్ తో కట్ చేసుకుంటే సరిగా వస్తుంది షేప్.
  • మైసూర్ పాక్ ని 4-5 గంటలు చల్లారనివ్వాలి. ఫాన్ కింద అస్సలు చల్లార బెట్టకూడదు.
  • మైసూర్ పాక్ లో 10% వేస్తేజ్ ఉంటుంది. ఎంత జాగ్రత్తగా చేసినా కొన్ని విరుగుతాయ్.

<><><><><><>

bainliest plzz..........

༼☯﹏☯༽

♡    ❣    ♡    ❣    ♡    ❣    

Similar questions