202. "తెలంగాణా ఈజిప్తు వలెనే ప్రపంచపు అంగడి" అనడానికి కారణాలు ఏమిటి
ఆలోచించండి-రాయండి Chapter10 గోలకొండ పట్టణము -ఆదిరాజు వీరభద్రరావు
Page Number 125 Telangana SCERT Class X Telugu
Answers
తెలంగాణా రాజధాని గోలకొండ గొప్ప వర్తక,వాణిజ్య కేంద్రంగా విలసిల్లేది.వ్యాపారమంట ఇక్కడి నుండే జరిగేది.ఇక్కడ అంతర్జాతీయ స్తాయిలో వాణిజ్యం సాగేది.గోలకొండ పట్టణం గొప్ప వర్తక వాణిజ్య కేంద్రంగా ప్రసిద్ది పిందింది.
పట్టణంలో
లోని బజార్లలో,తినిబందారాలు,నగలు,నాణెములు,విలాస వస్తువులు,చిల్లర వస్తువులు బాగా దొరికేవి.
పెద్ద వర్తకులు,విదేశి వర్తకులు వర్తకం చేసి బాగా సంపాదించేవారు.
గోలకొండ లో వజ్రాల వ్యాపారం కూడా బాగా సాగేది.
విదేశి వస్తువులు మచిలీపట్నం ఓడరేవు ద్వారా గోలకొండ వచ్చేవి.
తెలంగాణా ఈజిప్తు అంగడిగా గోలకొండ పేరు గాంచింది.
డచ్,తుర్కిస్తాన్,అరేబియా,పర్షియా,దేశాలతో వ్యాపారం జరిగేది.
బియ్యం,జొన్నలు,గోధుమలు,సీసం,తగరం,కస్తూరి,చైనాపట్టు,కర్పూరం,గాజు సామాను,సుగంధ ద్రవ్యాలు,ఎగుమతులు,దిగుమతులయ్యేవి.
పుట్టి,మనుగు సేరు,మొదలగు కొలతలు చెలామణిలో ఉండేవి.
అందుకే ఆకాలం వారు తెలంగాణను 'ఈజిప్తు వలే ప్రపంచపు అంగడి'అని అనేవారు.