India Languages, asked by rajesh3464, 1 year ago

4 తెలంగాణా పోరాట నేపథ్యంలో వచ్చిన ఏవైనా రెండు మూడు పాటలు సేకరించండి. వాటిని పాడి వినిపించండి.​

Answers

Answered by poojan
37

తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ నుండి జూన్ 2, 2014 న విడిపోయింది. 1969, 1972 మరియు 2009 లలో తెలంగాను ను ఆంధ్రను కలిపి ఉంచినందుకు చాలా ఉద్రిక్త ఉద్యమాలే జరిగాయి. తమను ప్రత్యేకంగా ఒక రాష్ట్రంగా విభజించాలని జరిగిన ఉద్యమాలలో చాలా మంది విద్యార్థులు తమ ప్రాణాలను కోల్పోయిన సంగతి కూడా తెలిసిందే. విభజన గురించి కేంద్రం ఒప్పుకుందని తెలిసాక ఆంధ్రాలో కూడా చాలా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే చివరికి తెలంగాణను కొత్త రాష్ట్రంగా ఆంధ్ర నుండి విభజించారు.

ఈ తెలంగాణను సాధించే పోరులో వాడిన పాటలలో ఇవి రెండు కూడా ఉన్నాయి.

'పొడుస్తున్న పొద్దు' పాట :

పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా... పోరు తెలంగాణమా..

పోరు తెలంగాణమా..  కోట్లాది ప్రాణమా..(2)

ఓ భూతల్లి... సూర్యుడిని ముద్దాడిన భూతల్లి.. అదిగో చిన్నారి బిడ్డల్ని జన్మనిచింది అమ్మా. నీవు త్యాగాల తల్లివి త్యాగాల గుర్తువి

భూతల్లి బిడ్డలు చిగురించే కొమ్మలు. చిదిమేసిన పువ్వులు త్యాగాల గుర్తులు. హా...ఆ అ  అ అ

మా భూములు మకేనని భలే భలే భలే  భలే భలే భలే

మా భూములు మకేనని మరల బడ్డ గానమ.. తిరగ బడ్డ రాగమా

మరల బడ్డ గానమ.. తిరగ బడ్డ రాగమా

పోరు తెలంగాణమా..  కోట్లాది ప్రాణమా..భలే భలే భలే  భలే భలే భలే... హా...ఆ అ  అ అ

పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా... పోరు తెలంగాణమా..

పోరు తెలంగాణమా..  కోట్లాది ప్రాణమా..

అమ్మా గోదావరి నీ వొడ్డున జీవించే కోట్లాది ప్రజలకు జీవనాధారం

అమ్మ కృష్ణమ్మా కిల కిల నవ్వే కృష్ణమ్మా .. అమ్మ మీకు వందనం

గోదావరి అలలమీద కోటి కళల గానమ కృష్ణమ్మా పరుగులకు నురుగులా హారమా.. హా

మా నీళ్ళు భలే భలే భలే  భలే భలే భలే... హా... ఆ అ  అ అ

మా నీళ్ళు మాకేనని కత్తుల కోలాటమ కన్నీటి గానమా..

కత్తుల కోలాటమ కన్నీటి గానమా.. పోరు తెలంగాణమా..  కోట్లాది ప్రాణమా భలే భలే భలే  భలే భలే భలే... హా... ఆ అ  అ అ

పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా... పోరు తెలంగాణమా.

పోరు తెలంగాణమా..  కోట్లాది ప్రాణమా..

అదిగో ఆ ప్రకృతిని చూడు అలా అలుముకుంటుంది ఆ కొమ్మలు గాలితో ముద్దాడుతాయి ఆ పువ్వులు అలా ఆడుతాయి

అదిగో పావురాల జంట మేమెప్పుడు విదోపోమంటాయి

విడిపోయిన భంధమా చెదిరిపోయిన స్నేహమా

యద బాసిన గీతమా యదల నిండ గాయమా హా...ఆ అ  అ అ

పువ్వులు పుప్పడిలా హ  భలే భలే భలే  భలే భలే భలే... హా...ఆ అ  అ అ

పువ్వులు పుప్పడిలా  పవిత్ర భంధమా పరమాత్ముని రూపమా

పవిత్ర భంధమా పరమాత్ముని రూపమా.

పోరు తెలంగాణమా..  కోట్లాది ప్రాణమా.. భలే భలే భలే  భలే భలే భలే... హా... ఆ అ  అ అ

పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా... పోరు తెలంగాణమా..

పోరు తెలంగాణమా..  కోట్లాది ప్రాణమా.. (2)

అదిగో రాజులు, దొరలు వలస దొరలు భూమిని, నీళ్ళని, ప్రానుల్ని సర్వస్వాన్ని చేరబట్టారు

రాజుల కడ్గాల కింద తెగిపోయిన శిరస్సులు

రాజరిక కట్టి మీద నెత్తురుల గాయమా దొరవారి గడులల్లో భలే భలే భలే

దొరవారి గడులల్లో నలిగిపోయిన న్యాయమా

ఆంద్ర వలస తూటాలకు ఆరిపోయిన దీపమ

హ మా పాలన  భలే భలే భలే  భలే భలే భలే... హా... ఆ అ  అ అ

మా పాలన మాకేనని మండుతున్న గోలమా

అమర వీరుల స్వప్నమా మండుతున్న హూ

మండుతున్న గోలమా అమర వీరుల స్వప్నమా.!

అమర వీరుల స్వప్నమా.!

అమర వీరుల స్వప్నమా.!

అమర వీరుల స్వప్నమా.!

తెలంగాణ రాష్ట్ర గీతం :

జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం

ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం

తరతరాల చరితగల తల్లీ నీరాజనం

పది జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం

జై తెలంగాణ - జై జై తెలంగాణ!

 

పొతనది పురిటిగడ్డ, రుద్రమది వీరగడ్డ

గండరగండడు కొమురం భీముడే నీ బిడ్డ

కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప

గొలుకొండ నవాబుల గొప్ప వెలుగే చార్ మినార్

జై తెలంగాణ - జై జై తెలంగాణ!

 

జానపద జన జీవన జావలీలు జాలువారే

కవి గాయక వైతాళిక కళలా మంజీరాలు

జాతిని జాగృత పరిచే గీతాల జన జాతర

అనునిత్యం నీ గానం అమ్మ నీవే మా ప్రాణం

జై తెలంగాణ - జై జై తెలంగాణ!

 

గొదావరి కృష్ణమ్మలు మన బీళ్ళకు మళ్ళాలి

పచ్చని మాగాణాల్లో పసిడి సిరులు పండాలి

సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలే

స్వరాష్ట్ర్రమై తెలంగాణ స్వర్ణ యుగం కావాలి

జై తెలంగాణ - జై జై తెలంగాణ!

Learn more :

1. 'రాజు రివాజులు బూజు పట్టగన్' అంటే ఏమిటి?​

brainly.in/question/16066294

2. Essay on telugu language in telugu.

brainly.in/question/788459

3. భారతం నుండి కొన్ని కఠిన ప్రశ్నలు.

brainly.in/question/16302876

Similar questions