4. తిక్కన గురించి వివరించండి?
Answers
Answered by
3
తిక్కన లేదా తిక్కన సోమయాజి (1205 - 1288). విక్రమసింహపురి (నేటి నెల్లూరు ప్రాంతాన్ని) పరిపాలించిన మనుమసిద్ధికి మంత్రిత్వం వహించారు. కవిత్రయములో తిక్కనది నాటకీయ శైలి, సంభాషణాత్మక శైలి.
1225 నుండి 1320 వరకు తిక్కన యుగము అంటారు. నన్నయతో ఆరంభమైన తెలుగు సాహితీ వైభవాన్ని శివకవులు ఇనుమడింపజేశారు. తరువాత కాకతీయుల పాలనలో ఆంధ్రదేశమంతా ఒక సామ్రాజ్యంగా ఏర్పడడంతో తెలుగు సాహిత్యం సుస్థిరమైన సాంస్కృతిక వారసత్వాన్ని పుణికిపుచ్చుకోగలిగింది. కవిత్రయంలో రెండవవాడైన తిక్కన సోమయాజి ఈ యుగానికి ప్రధానకవిగా గుర్తింపు పొందాడు.
యుగంలో పురాణ ఖండాలు, వచన కావ్యాలు, ప్రాకృత నాటకాలు ప్రబంధీకరింపబడడం మొదలయ్యింది. శతక కవిత్వం వర్ధిల్లింది. శైవ కవిత్వంలో ఉన్న పరమతదూషణ, స్వమత మౌఢ్యత తగ్గాయి. ఎక్కుగా ప్రబొధాత్మక రచనలు వెలువడినాయి.
hope it helps you ☺️♥️
Similar questions