5points in Telugu about national flag
Answers
మూడు రంగుల జెండాతోనే జాతీయ పండుగ ఎందుకు చేసుకోవాలి అనే ప్రశ్న చాలా మందిలో తలెత్తొచ్చు. కానీ ఆ రంగుల్లో ఓ అందం ఉంది. ఆకర్షణ ఉంది
మూడు రంగుల జెండాతోనే జాతీయ పండుగ ఎందుకు చేసుకోవాలి అనే ప్రశ్న చాలా మందిలో తలెత్తొచ్చు. కానీ ఆ రంగుల్లో ఓ అందం ఉంది. ఆకర్షణ ఉంది. అంతకుమించి ఓ జాతి అస్తిత్వం, ఐకమత్యం, ధర్మం దాగి ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే భారత జాతి ఆశల్నీ ఆశయాల్నీ ప్రతిబింబించే ప్రకాశవంతమైన వర్ణాలివి.
జాతీయపతాకంలోని పై పట్టీలో ఉన్న కాషాయం దేశంపట్ల ప్రజల త్యాగాన్ని, ఆత్మస్థైర్యాన్నీ ప్రతిబింబిస్తే.. మధ్యలోని తెలుపు స్వచ్ఛతని, శాంతిని, నిజాయతీని చాటుతుంది. కిందనే ఉన్న ఆకుపచ్చ విశ్వసనీయతని, ప్రకృతిని, పాడిపంటల్ని, సంపదని సూచిస్తుంది. మానవ ధర్మాన్ని ప్రబోధించే అశోకుడి ధర్మచక్రం నీలిరంగులో నిజాయతీకి ప్రతీకగా నిలుస్తుంది.
ఆగస్టు 14వ తేదీ అర్ధరాత్రి దాటిన తరవాత దేశానికి స్వాతంత్య్రం ప్రకటించారు. 15వ తేదీ ఉదయం గవర్నర్ హౌస్‌మీదా, 16వ తేదీ ఉదయం ఎర్రకోట మీదా భరతజాతి ఆకాంక్షల్ని ప్రతిఫలిస్తూ రెపరెపలాడిన ఆ మువ్వన్నెల పతాకం.. నాటి నుంచి నేటివరకూ దేశప్రజల గుండెల్లో జాతీయస్ఫూర్తిని రగిలిస్తూనే ఉంది. ‘విజయీ విశ్వ తిరంగా ప్యారా, జండా వూంఛా రహే హమారా’ అంటూ ఆనందంగా జెండాను ఎగరేసి వందనం చేయడంతోనే సరిపెట్టకుండా అందులోని త్రివర్ణాల్ని వినూత్న డిజైన్లలో ధరిస్తూ జాతీయపండగ జరుపుకుంటున్నారు.