India Languages, asked by StarTbia, 1 year ago

89. పాఠం ఆధార౦గ పల్లెల్లో వచ్చిన మార్పుల గురించి వ్రాయండి?
Chapter4 కొత్తబాట -డా;పాకాల యశోదారెడ్డి
Page Number 38 Telangana SCERT Class X Telugu

Answers

Answered by KomalaLakshmi
17

1.పల్లెలు ఒకప్పుడు కాలుష్యం లేని పచ్చని ప్రక్రుతి తో అలరారెవి.

2.రవాణ సౌకర్యాలు అంతగా ఉండేవి కాదు.సంప్రదాయ పద్దతుల్లో వ్యవసాయం చేసే వారు.

౩.వస్త్రధారణ,భాష నగర జనాలకు భిన్నంగా ఉండేవి.పారిశుధ్య సమస్య ఎక్కువగా వుండేది.భూస్వామ్య వ్యవస్థ తీవ్రంగా వుండేది.నిమ్న కులాల వారిని బానిసలుగా చూసేవారు.. 


4.ప్రభుత్వ పధకాలు ,ప్రణాలికల కారణంగా రవాణ సౌకర్యాలు పెరిగాయి. 


5.కులవృత్తులు అడుగంటాయి.ఇప్పటి యువత ఉన్నతచాడువులు చదివి ఉద్యోగాలలో స్థిరపడాలని ఆరాటపడుతున్నారు. 


6.ఆధినిక వ్యవసాయ పద్ధతులు తో సాగుబడి తీరే మారిపోయింది. 


7.చదువుకున్న వాళ్ళు పెరగడంవలన సామాజిక అసమానతలు తగ్గిపోయాయి. 


8.సంప్రదాయ వ్యవసాయ పాద్దతులకు బదులుగా యంత్రాలు ఉపయోగిస్తున్నారు. 


9.వస్త్ర ధారణా లోను చెప్పుకోదగ్గ మార్పులొచ్చాయి. 


10.స్థానిక మాండలిక యాస తగ్గిపోయి ఇంగ్లీష్ పదాల జోరు పెరిగింది. 


11.కులమతాల పట్టింపులు కూడా అంత  తీవ్రంగా లేవు. 


మొత్తం మిద పల్లెల్లో మునుపు కంటే మెరుగైన జీవితం ఇప్పుడు కనబడుతోంది. 

విద్యుత్ సరఫరా కూడా పెరిగింది.ఇవన్ని ఆహ్వానించదగ్గ పరిణామాలే. 

కాని ఈవ్ పరిస్తితులు మనుషుల మధ్య ఆత్మిత్యతను తగ్గిస్తున్నాయి. 

Similar questions