India Languages, asked by charan255141, 3 months ago

a essay on దాశరథి కృష్ణమాచార్య pls give a valid answer.​

Answers

Answered by rishi672
1

Answer:

దాశరథి కృష్ణమాచార్య జూలై 22, 1925న మహబూబాబాదు జిల్లా చిన్నగూడూరులో జన్మించారు. బాల్యం ఖమ్మం జిల్లా మధిరలో గడిచింది. ఇతను ప్రముఖ కవిగా, స్వాతంత్ర్యోద్యమ నాయకుడిగా ప్రసిద్ధి చెందారు. దాశరథిగా ఆయన సుప్రసిద్ధుడైన ఈయన తెలుగు, ఉర్దూ, తమిళం, ఫారసీ భాషలలో నిష్ణాతుడు. దాశరథి రంగాచార్య ఈయన సోదరుడు.

ఖమ్మంలో మెట్రిక్యులేషన్ పూర్తిచేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రులయ్యారు. కొద్దికాలం కమ్యూనిస్టు పార్టీలో ఉండి ఆ పార్టీ వైఖరి నచ్చక ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి నిజాం అరాచకాలకు వ్యతిరేకంగా పాలుపంచుకున్నారు. ప్రజాకవిగా పేరుపొందిన దాశరథి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో అక్షరాన్ని ఆయుధంగా మలిచి నిజాం నిరంకుశ పాలనపై ధిక్కారస్వరం వినిపించిన ఘనుడు. తన కవిత్వాల ద్వారా నిజాంపై కోపం ప్రదర్శించారు. ఓ నిజాము పిశాచమా! కానరాడు నినుబోలిన రాజు మాకెన్నెడేని అని గద్దించాడు. “నా తెలంగాణ కోటి రతనాల వీణ” అని నినదించారు. పద్యాలు, గేయాల ద్వారా తెలంగాణ ప్రజల అభిమతాన్ని ప్రదర్శించారు.

తెలుగు సినిమాకు వందల సంఖ్యలో పాటలు రచించారు. 1978-83 కాలంలో ఆంధ్రప్రదేశ్ ఆస్థానకవిగా దాశరథి పనిచేశారు. ఆంధ్రా విశ్వవిద్యాలయం ఈయనకు 1975లో కళాప్రపూర్ణ బిరుదులో సత్కరించింది. ఆగ్రా, శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయాలు కూడా డాక్టరేటులో సత్కరించాయి. నవంబరు 5, 1987న 61వ ఏట దాశరథి మరణించారు .

రచనలు:

ఈయన తొలి కవితా సంకలనం అగ్నిధార 1949లో వెలువడింది. రుద్రవీణ, మహోంద్రోదయం, మహాబోధి, కవితాపుష్పకం, గాలిబ్ గీతాలు, దాశరథీ శతకం, తిమిరంలో సమరం, ఆలోచనాపరులు ఇతను ముఖ్య రచనలు.

అవార్డులు, గుర్తింపులు:

1967లో కవితా పుష్పకం సంపుటికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. 1972లో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ చేతుల మీదుగా తామ్రపత్రాన్ని స్వీకరించారు. 1974లో తిమిరంలో సమరం రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. 1975లో ఆంధ్రా విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ బిరుదుతో సత్కరించింది. 2008 నవంబరు 30న గ్రామంలో ఆయన విగ్రహాన్ని గద్దర్ ఆవిష్కరించారు.

Similar questions