India Languages, asked by bhaskarpt5, 4 months ago

About B.R Ambedkar in telugu​

Answers

Answered by Anonymous
26

Answer:

భీంరావ్ రాంజీ అంబేడ్కర్ (Marathi: भीमराव रामजी आंबेडकर) (డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ (Marathi: डॉ. बाबासाहेब आंबेडकर) గా కూడా పిలవబడిన) ఒక ప్రముఖ భారతీయ న్యాయవాది, ఆర్ధిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త. ఇతను దళితుల పై అంటరానితనాన్ని, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశాడు. స్వాతంత్ర్య భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రి మరియు భారత రాజ్యాంగ శిల్పి.

ఉన్నత విద్య కోసం కొలంబియా విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి. లండన్ విశ్వవిద్యాలయం నుండి డి.ఎస్.సి (డాక్టరేట్) పట్టాలను పొంది చాలా అరుదైన గౌరవాన్ని సంపాదించాడు. న్యాయ, సామాజిక, ఆర్ధిక శాస్త్రాలలో పరిశోధనలు చేశాడు. మొదట్లో న్యాయవాదిగా, అధ్యాపకుడిగా, ఆర్ధికవేత్త గా పని చేశాడు. తరువాత భారత్ స్వాతంత్ర్యం, పత్రికల ప్రచురణ, దళితుల సామాజిక రాజకీయ హక్కులు, భారత దేశ వ్యవస్థాపన కోసం కృషి చేశాడు. 1956 లో ఇతను బౌద్ధ మతానికి పుచ్చుకోవడం తో దళితులు సామూహికంగా బౌద్ధ మత మార్పిడి చేసుకున్నారు.[6]

1990 లో భారత ప్రభుత్వం అత్యున్నత భారత రత్న పురస్కారాన్ని ఇతనికి మరణాంతరం ప్రకటించింది. భారత్ దేశ చరిత్ర లో చీరస్మరనియంగా నిలిచిన నాయకుడు.[7] ఇతను చేసిన విశాల కృషికి తన పుట్టినరోజును “అంబేడ్కర్ జయంతి” గా జరుపుకుంటారు.

Explanation:

I hope that helps you Plz follow me

Similar questions