India Languages, asked by mypivijaya, 5 months ago

About farmer in telugu 10 lines​

Answers

Answered by rubasree866
48

Explanation:

దేశానికి అన్నం పెట్టే వ్యక్తి రైతు .మన భారత దేశ రైతుకు ప్రపంచంలోనే ఒక ప్రత్యేక మైన గుర్తింపు ఉంది.అందుకే మన వారు జై కిషాన్ అని నినదించారు.రైతు గురుంచి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ చదవండి.

రైతు అంటే ఎవరు ?

మనకు తినటానికి అవసరమయ్యే ఆహారాన్ని పండించే వ్యక్తే రైతు.

రైతు రాత్రి పగలు కష్టపడి పంటల్ని పండించి మనకు ఆహారాన్ని అందిస్తాడు.

రైతు కు మరో పేరు వ్యవసాయదారుడు.పంటల్ని పండించే విధానాన్ని వ్యవసాయం అంటారు అందుకే రైతును వ్యవసాయదారుడు అంటారు.

పంటల్ని పండించేవారినే కాకుండా కోళ్ళని , పశువుల్ని , చేపల్ని ,తేనెటీగల్ని , సిల్క్ పురుగుల్ని పెంచే వారిని కూడా రైతులనే అంటారు.

రైతు ధాన్యాన్నే కాకుండా పాలను కూడా ఉత్పత్తి చేస్తాడు.

చేపల్ని ,కోళ్ళని పెంచుతాడు రైతు.

ఈ విధంగా రైతు తన కుటుంబానికి కావాల్సిన ఆదాయాన్ని సంపాదించుకుంటాడు.

ఒక్క రైతు తాను పండించిన పంటతో దాదాపు ఒక వంద మందిని పోషిస్తున్నాడు.

రైతులు తాము పండించిన పంటల్ని మార్కెట్ లో అమ్ముకుంటారు.

ప్రభుత్వాలు రైతులు పండించిన పంటలకు మంచి ధర కల్పించి కొనే ఏర్పాటు చేస్తే వారికి లాభం ఉంటుంది.

రైతు దేశానికి అన్నం పెడతాడు కాబట్టి రైతును దేశానికి వెన్నుముక అంటారు.అంతే కాకుండా రైతే రాజు అని కూడా అంటారు.

వ్యవసాయం తేలిక పని కాదు .రాత్రి పగలు కష్టపడితే కానీ పంటలు పండవు.రైతులు రాత్రనక పగలనక పొలాల చుట్టూ తిరిగితేనే పంటలు చేతికి వస్తాయి.

పొలాల్లో తిరుగుతున్నప్పుడు రైతులకు పాముల వల్ల క్రూర మృగాల వల్ల ఎన్నో ప్రమాదాలు ఎదురవుతాయి.ఎన్ని ప్రమాదాలు ఎదురైనా భయపడక రైతు పంటల్ని పండిస్తాడు .

రైతు పాత వ్యవసాయ పద్ధతులనే కాకుండా కాలం తో మారి కొత్త వ్యవసాయ పద్దతులను అవలంభించి ఎంతో పురోగతి సాధిస్తున్నాడు.కానీ ప్రభుత్వం సహాకారం రైతుకు సరిగా అందడం లేదు .

Answered by lakshmivijaya2103201
2

Answer:

raithu is a wonderful way of life

Similar questions