History, asked by padmanadimpally359, 11 months ago

About Krishna river in telugu​

Answers

Answered by arsh122100
3

Answer:

Explanation:భారతదేశంలో మూడవ పొడవైన నది, దక్షిణ భారతదేశంలో రెండో పొడవైన నది అయిన కృష్ణానది పడమటి కనులలో మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ సమీపంలో జన్మించి ఆపై అనేక ఉపనదులను తనలో కలుపుకుంటూ మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌లలో సస్యశ్యామలం చేస్తూ మొత్తం 1,400 కిలోమీటర్లు ప్రయాణం చేసి దివిసీమలోని హంసల దీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. తుంగభద్ర, భీమా, డిండి, భీమా, మున్నేరు ఈ నది ప్రధాన ఉపనదులు. ఈనదిపై నాగార్జునసాగర్ ప్రాజెక్టు, జూరాల ప్రాజెక్టు, శ్రీశైలం ప్రాజెక్టు, ప్రకాశం బ్యారేజి, అలమట్టి ప్రాజెక్టులు నిర్మించబడ్డాయి.  

నదీ ప్రవాహం:

మహారాష్ట్రలోని పడమటి కనుమలలో మహాబలేశ్వర్ సమీపంలో పుట్టిన కృష్ణానది 135 కిలోమీతర్ల దూరం ప్రవహించిన పిదప కొయినా నది కలుస్తుంది. ఆ తరువాత వర్ణ, పంచగంగ, దూధ్‌గంగలు ఈ నదిలో కలుస్తాయి. మహారాష్ట్రలో కృష్ణానది 306 కిలోమీటర్లు ప్రవహించాక బెల్గాం జిల్లా ఐనాపూర్ గ్రామం వద్ద కర్ణాటక రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. కర్ణాటకలోఘటప్రభ, మాలప్రభ నదులు కృష్ణలో కలుస్తాయి. తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించే ముందు భీమ నది కలుస్తుంది. కర్ణాటకలో 482 కిలోమీటర్ల దూరం ప్రవహించి రాయచూర్ జిల్లా దేవర్‌సుగుర్ గ్రామం వద్ద ఆ రాష్ట్రానికి వీడ్కోలు పలికి మహబూబ్‌నగర్ జిల్లా తంగడి వద్ద తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది.

మహబూబ్‌నగర్ జిల్లాలో కృష్ణానదిపై

ఉన్న జూరాలా ప్రాజెక్టు

తరువాత ఆలంపూర్ కు దగ్గరలో కృష్ణ యొక్క అతిపెద్ద ఉపనది తుంగభద్ర కలుస్తుంది. ఇదే ప్రాంతంలో ఈ నది ఆంధ్రప్రదేశ్ సరిహద్దును తాకుతుంది. తరువాత కొద్ది దూరంలోనే నది నల్లమల కొండల శ్రేణి లోని లోతైన లోయల లోకి ప్రవేశిస్తుంది. ఇక్కడే శ్రీశైలం, నాగార్జున సాగర్ ల వద్ద పెద్ద ఆనకట్టలు నిర్మించబడ్డాయి. ఇక్కడి నుండి చిన్న చిన్న ఉపనదులైన దిండి, మూసి, పాలేరు, మున్నేరు వంటివి కలుస్తాయి. విజయవాడ వద్ద బ్రిటిషు వారి కాలంలో నిర్మించబడ్డ ప్రకాశం బ్యారేజిని దాటి డెల్టా ప్రాంతంలో ప్రవేశిస్తుంది. విజయవాడ వద్ద ఈ నది 1188 మీటర్ల వెడల్పుతో విశ్వరూపాన్ని ప్రదర్శిస్తుంది. ఆ తరువాత దివిసీమ లోని హంసలదీవి వద్ద బంగాళాఖాతం లో కలుస్తుంది.

కృష్ణానది జనరల్ నాలెడ్జి వీడియో

కృష్ణానదీ తీరాన ఉన్న పుణ్యక్షేత్రాలు:

కృష్ణానది తీరాన పలు పుణ్యక్షేత్రాలు కలవు. వాటిలో ప్రముఖమైనవి - ద్వాదశ జ్యోతిర్లాంగాలలో ఒకటైన శ్రీశైలం క్షేత్రం, అష్టాదశ శక్తిపీఠమైన ఆలంపూర్ క్షేత్రం, కనకదుర్గ కొలువైన విజయవాడ, అమరావతి, మోపిదేవి ముఖ్యమైనవి.

ఇవి కూడా చూడండి:

గోదావరి నది,

hope it helps you

please mark it brainliest

follow me on instagram

Answered by aashisachdeva
0

Answer:

Explanation:

మూడవ పెద్ద నదులు, దక్షిణ భారతదేశంలో రెండో పెద్ద నది అయిన కృష్ణా నదిని తెలుగు వారు ఆప్యాయంగా కృష్ణవేణి అని కూడా పిలుస్తారు. పడమటి కనులలో మహారాష్ట్ర లోని మహాబలేశ్వర్కు ఉత్తరంగా మహాదేవ్ పర్వత శ్రేణిలో సముద్ర మట్టానికి 1337 మీటర్ల ఎత్తున చిన్న ధారగా జన్మించిన కృష్ణానది ఆపై అనేక ఉపనదులను తనలో కలుపుకుంటూ మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్‌లలో సస్యశ్యామలం చేస్తూ మొత్తం 1, 400 కిలోమీటర్లు ప్రయాణం చేసి దివిసీమలోని హంసల దీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది.

Similar questions