English, asked by modhiharisampu, 7 days ago

about manava dhanulu in telugu​

Answers

Answered by JitRoy10l11
1

Answer:

మానవ వనరులు (ఆంగ్లం:Human Resources) పాశ్చాత్య దేశాలలో 1960వ సంవత్సరంలో నూతనంగా, సాపేక్షంగా, కనుగొనబడిన నిర్వహణకు సంబంధించిన ఆధునిక పదం అయినప్పటికీ, మానవ వనరుల నిర్వహణ ప్రాముఖ్యతను వేద యుగాలు నుండే భారతదేశంలో గుర్తించవచ్చును. భగవద్గీతలో, కృష్ణుడు అర్జునుడికి ఆధ్యాత్మికంగా ఉపదేశాలు చేశాడు. అయితే ఈ ఉపదేశాల ద్వారా అప్పటిలోనే ఇప్పటి నిర్వహణలో బోధనాంశాలైన స్వీయ నిర్వహణ (Self Management), ఆగ్రహ నిర్వహణ (Anger Management), ఒత్తిడి నిర్వహణ (Stress Management), సంఘర్షణ నిర్వహణ (Friction Management), నాయకుని మార్పిడి (Change of Leadership), ప్రేరణ (Motivation), లక్ష్యం నిర్దేశ్యం (Goals and Objectives) మొదలగు వంటి వాటి గురించి ప్రస్తావించబడింది.

నిజానికి, నేడు అనేక బి-స్కూళ్ళు (నిర్వహణా విశ్వవిద్యాలయాలు, కళాశాలలు) భగవద్గీత ఆధునిక నిర్వహణలో అలా అవసరం అని, అభివృద్ధి వ్యూహాలకు భగవద్గీత ఒక మార్గదర్శి అని భావిస్తారు. అయితే, మానవ వనరుల నిర్వహణ భౌతిక, బాహ్య ప్రపంచంపై దృష్టి పెట్టగా, పాశ్చాత్య విధానానికి భిన్నంగా, భగవద్గీత ఒక మనిషిలోని అంతర్గత అన్వేషణ పై, స్వీయ అవగాహనపై దృష్టి పెడుతుంది

Similar questions