about ms dhoni in telugu
Answers
I hope it will help u
మహేంద్రసింగ్ ధోని.. ఈ పేరు తెలియని వ్యక్తులు బహుసా ఎవరు ఉండరనుకుంట. ధోని 1981 జూలై 7 న రాంచి లో జన్మించాడు. తండ్రి పాన్ సింగ్, తల్లి దేవ్కి దేవి, తమ్ముడు నరేంద్ర సింగ్ ధోని,చెల్లి జయంతి గుప్తా,భార్య సాక్షి సింగ్ రావత్,కూతురు జీవా ధోని ఆయన కుటుంబం. ఈయన విద్యాభ్యాసం జవహర్ విద్య మందిర్ శ్యామలి, రాంచిలో చదివారు. చదువుతున్న రోజుల్లో ధోని బాడ్మింటన్ మరియు ఫుట్ బాల్ కు రాష్ట్ర స్థాయిలో ఎన్నికయ్యారు. ఫుట్ బాల్ మ్యాచ్ లో ధోని గోల్ కీపర్ గాఉండేవారట. అప్పుడు ఆ టీం కోచ్ గా ఉండే కెప్టెన్ ధోనీని క్రికెట్ ఆడటానికి పంపించారట. వెళ్ళిన తరవాత ధోనికి క్రికెట్ ఆడటం కంటే వికెట్ కీపింగ్ కి ముగ్డుడయ్యాడట. ఇంకా అప్పటినుండి ధోని వికెట్ కీపేర్ గా పేరు పొందారు. ఒక భారతీయ క్రికెట్ ఆటగాడు మరియు పరిమిత ఓవర్ల ఫార్మాట్లు భారత జాతీయ క్రికెట్ జట్టు ప్రస్తుత సారథి. అటాకింగ్ కుడి చేతివాటం గల మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ మరియు వికెట్ -కీపర్, ధోని విస్తృతంగా పరిమిత ఓవర్ల క్రికెట్లో గొప్ప ఫినిషెర్ లో ఒక్కడిగా భావించబడుతాడు. ధోని తన తొలి వన్ డే ఇంటర్నేషనల్ ( ఒడిఐ ) బంగ్లాదేశ్తో డిసెంబరు 2004 లో ఆడాడు., మరియు శ్రీలంకతో ఒక సంవత్సరం తరువాత తన తొలి టెస్ట్ ఆడాడు. ధోనీ టెస్టులు మరియు వన్ డే ఇంటర్నేషనల్ లో ఒక భారతీయ కెప్టెన్ అత్యధిక విజయాలతో అనేక కెప్టెన్సీ రికార్డులను, మరియు అత్యథిక బ్యాక్ టు బ్యాక్ వన్డేల్లో విజయాలతో దూసుకుపోతున్న భారతీయ కెప్టెన్. ధోని 2007 లో రాహుల్ ద్రావిడ్ నుండి వన్డే కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించాడు. మొట్టమొదటి ద్వైపాక్షిక వన్డే సిరీస్ లోనె జట్టుకు శ్రీలంక మరియు న్యూజిలాండ్ తొ పొరాడి విజయం తీసుకవచ్చాడు. తన సారథ్యంలో భారతదేశం 2007 ఐసీసీ ప్రపంచ ట్వంటీ ట్వంటీ, 2007-08 సి.బి సిరీస్, 2010 ఆసియా కప్, 2011 ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ మరియు 2013 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ గెలుచుకుంది.
l