About river manjeera in telugu and about its anakatalu
Answers
Answer:
మంజీరా (మరాఠీ: मांजरा; కన్నడ: ಮಂಜೀರ), గోదావరి యొక్క ఉపనది. మహారాష్ట్రలో దీనిని మాంజ్రా లేదా మాంజరా అని కూడా వ్యవహరిస్తారు. ఇది మహారాష్ట్ర, కర్ణాటక మరియు తెలంగాణ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. మహారాష్ట్రలోని బీఢ్ జిల్లా, పటోడా తాలూకాలోని బాలాఘాట్ పర్వతశ్రేణి యొక్క ఉత్తరపు అంచుల్లో 823 మీటర్ల ఎత్తున పుట్టి, గోదావరి నదిలో కలుస్తుంది. మంజీరా నది సాధారణంగా తూర్పు, ఆగ్నేయంగా మహారాష్ట్రలోని ఉస్మానాబాద్, కర్ణాటకలోని బీదర్ మరియు తెలంగాణలోని మెదక్ జిల్లాల గుండా 512 కిలోమీటర్లు ప్రవహించి, సంగారెడ్డి వద్ద దిశను మార్చి ఉత్తరంగా ప్రవహిస్తుంది. ఆ దిశగా మరో 75 కిలోమీటర్లు ప్రవహించి నిజామాబాదు జిల్లాలో ప్రవహిస్తుంది. 102 కిలోమీటర్ల దిగువ నుండి ఇది మహారాష్ట్ర మరియు తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుగా ఉంది. ఈ నది యొక్క జన్మస్థానం నుండి గోదావరిలో కలిసే దాకా మొత్తం 724 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. 823 మీటర్ల ఎత్తు నుండి 323 మీటర్లకు దిగుతుంది. మంజీరా నది యొక్క ప్రధాన ఉపనదులు, తిర్నా నది. ఘర్నీ, దేవన్ నది, తవర్జా, కారంజ నది, హలయి, లెండీ మరియు మనర్ నది. ఉపనదులతో సహా మంజీరా నది యొక్క మొత్తం పరీవాహక ప్రాంతం 30,844 చ.కి.మీ.లు. పరీవాహక ప్రాంతంలో సాలీనా 635 మి.మీ.ల వర్షపాతం కురుస్తుంది