India Languages, asked by srikar7781, 7 months ago

about satak padhya prakria in telugu​

Answers

Answered by Anonymous
1

Answer:

నూరు పద్యాల సంకలనం శతకం. ఇంకొక ఎనిమిది అదనంగా చేర్చడం కూడా సంప్రదాయం. పద్యసాధనకు తొలినాళ్లలో అందరూ చేపట్టే ప్రక్రియ శతకం. శతకానికి ఛందోనియమం, మకుట నియమం, సంఖ్యా నియమం ఉంది. శతక పద్యాలను ఏ ఛందస్సులోనైనా రాయవచ్చు. కానీ శతకం ఆసాంతం అదే ఛందస్సులో కొనసాగాలి. ఏ మకుటం స్వీకరించినా, అదే మకుటం శతకం అంతా ఉండాలి. పద్య సంఖ్య నూరుగానీ, నూట ఎనిమిదిగానీ ఉండాలి. ఇదీ శతక ప్రక్రియలోని ప్రధాన లక్షణం. పద్యాలన్నీ ముక్తకాలుగానే ఉండటం పరిపాటి. ప్రతి పద్యానికీ విషయం మారుతూ ఉండటం వల్ల ప్రతి పద్యం ఒక్కొక్క ముత్యం (ముక్తం) వలె ఉంటుంది. నూట ఎనిమిది ముక్తకాల మాలిక అయిన శతకానికి ప్రాచీన కాలం నుండి ఎంతో ప్రాచుర్యం ఉంది. మహాకావ్యాలలో సైతం శతకాల ఛాయలు ఉండడం గమనార్హం. సాధారణంగా శతకాలు భక్తి, వేదాంతం, ప్రబోధం, ప్రచోదనం, జీవన సత్యావిష్కరణం, సంఘ సంస్కరణ, నీతి విద్య, ఆధ్యాత్మిక జ్ఞానం వంటి విషయాలను కలిగి ఉండటం సర్వత్రా కనబడుతుంది. కవిత్వం అంటే ఛందోమయమైనదే అని ప్రాచీనుల ఉపదేశం. ఛందోరహితమైన కవిత్వం ప్రపంచంలో లేనే లేదని లాక్షణికులు అంటారు. అంటే వచనంలోనూ ఛందస్సు ఉంటుందని వారి అభిప్రాయం కావచ్చు. బాణుడు, దండి వంటి మహా కవుల గద్యకావ్యాలలోనూ లయాత్మకత ఉంది. ఆ లయ ఒక్కటే ఛందస్సుకు మూలం అనుకుంటే లాక్షణికులు చెప్పిన అభిప్రాయం సరైనదే. గేయాలలో మాత్రాఛందస్సు, పద్యాలలో గణఛందస్సు సర్వసాధారణత.

పద్యాలు రాయాలనుకొనేవారు తొలుత శతకాన్ని ఎంచుకొంటారు. శతకాలు చాలావరకు ఉపజాతులైన ఆటవెలది, తేటగీతులలో ఉంటాయి. ఈ రెండు ఛందస్సులూ రాయడానికి సులువైనవి. అంతేగాక కలం పట్టిన తొలినాళ్లలో భావశబలత తక్కువగానే ఉంటుంది. కనుక చిన్న విషయాన్ని తీకొని చిన్న పద్యాన్ని అల్లడం నవకవులకు ఉపయుక్తం. యతితోబాటు ప్రాస యతికి కూడా వెసులుబాటు ఉండటం ఈ పద్యాల సౌలభ్యానికి మూలం. చివరి పాదాన్ని మకుటంతో పూరిస్తే మిగిలేవి మూడు పాదాలే కనుక రచనలో సౌలభ్యం అధికం. కనుక ప్రాథమిక స్థాయిలో పద్య రచనకు ఈ రెండు ఛందస్సులూ అనుకూలం. బాగా రాయగలిగిన పరిణత కవులు కూడా ఈ ఛందస్సులలో అద్వితీయ భావాలను పలికించారు. ప్రౌఢులకూ, ప్రారంభకులకూ ఎంతో అనువైనవిగా ఆటవెలదులూ, తేటగీతులూ కనబడుతాయి.

ఉత్పల, చంపక, శార్దూల, మత్త్భాలలో కూడా అద్భుత శతకాలను రాసిన కవులెందరో ఉన్నారు. ప్రతి పద్యం నిత్యనూతనంగా ఉండేవిధంగా చేయదగిన గుణం శతకానికి సొంతం. కావ్యాలూ, ప్రబంధాలూ అతి విస్తృతాలై ఉంటాయి. వాటిని రాయాలంటే సుదీర్ఘ కథాంశం, అనేక వర్ణనలూ కావాలి. వాటిని నిర్వహించే సామర్థ్యం తొలి నాళ్లలో ఎవరికీ ఉండదు. ‘ఒక కావ్యం రాయాలంటే వంద కావ్యాలు చదవాలి’ అంటారు పెద్దలు. అంటే ఏ ప్రక్రియను స్వీకరించినా, ఆ ప్రక్రియలో ఉన్నత ప్రమాణాలను అందుకొన్న గ్రంథాలను పరిశీలించనిదే కవికి సామర్థ్యం, శక్తి సాధ్యం కాదు. అంతటి తీరికా, ఓపికా లేనివారు సులభ సాధ్యమైన శతక ప్రక్రియను చేపట్టి తమ రచనా సామర్థ్యాన్ని పరీక్షించుకోవడం కనబడుతుంది.

సాధారణంగా శతకాలలో నీతి ప్రబోధం, భక్త్యావేశం ప్రధానాంశాలుగా కనబడుతాయి. మానవుని నిత్యజీవితానికి ఎంతో ఉపయుక్తమైంది నీతిపథం. ‘తప్పులు చేయడమే మనిషి నైజం’ అని ప్రాచీన సూక్తి. అడుగడుగునా ఎన్నో తప్పులు చేయడానికి అవకాశాలు మెండుగా ఉన్న నేపథ్యంలో నిత్యమూ మనిషికి నీతిబోధ అవసరమే కనుక ఆ అవసరాన్ని శతకాలు తీరుస్తున్నాయనుకోవచ్చు.

మనిషి పుట్టుక భగవంతుడు ఇచ్చిన వరప్రసాదమే. ప్రాణులలో నరజన్మ దుర్లభమనీ, అది ఎన్నో పూర్వ పుణ్యాలవల్ల లభిస్తుందనీ ప్రాచీన గ్రంథాలు చెబుతున్నాయి. కనుక మనిషి తనకు ఉత్తమ జన్మను ఇచ్చిన దేవతలకు కృతజ్ఞతగా భక్తి వచనాలకు సమర్పిస్తాడు. మనస్సులో ఆయా దేవతలను ప్రతిష్ఠించుకొని ఆవేశంతో చేసే స్తోత్రాలు శతకాలలో విరివిగా కనబడుతాయి. పాల్కురికి సోమన వృషాధిప శతకం, ధూర్జటి శ్రీకాళహస్తీశ్వర శతకం, కంచర్ల గోపన్న దాశరథి శతకం, బమ్మెర పోతన నారాయణ శతకం, శేషప్ప నరసింహ శతకం, మొదలైనవి ఆయా ఇష్టదేవతలను ఉద్దేశించి రచించిన భక్త్యావేశ శతకాలే.

ప్రాథమిక విద్యార్థులకు ‘యమాతారాజభాన సలగం’ అనే సూత్రంతో బోధించే ఛందోవిద్య ఎన్నో కవితామృత ఫలాలను లోకానికి అందిస్తోంది. ‘్ఛందం’ అంటే చాలామంది నియమం అనీ, కట్టడీ అనీ భావిస్తుంటారు. కానీ ‘్ఛందం’ అంటే స్వేచ్ఛ అనే అర్థమే ఉంది. కనుక స్వేచ్ఛా భావ ప్రకటనకు అనువైంది చందస్సు. ‘్ఛందం’ అంటే కప్పివేయడం, ఆహ్లాదపరచడం అనే అర్థాలూ ఉన్నాయి. కవిత్వానికి మార్మికత ప్రాణం కనుక పైకి కనబడే అర్థమే కాకుండా అంతరార్థం కూడా ఉక్తి వైచిత్రితో ధ్వనించినప్పుడు అది కవిత్వం అవుతుంది. కనుక ఛందస్సుకు కప్పివేసేది అనే అర్థం ఇలా సార్థకమైంది. ఆహ్లాదం కూడా ఛందస్సుకు గల లక్షణమే. లయబద్ధంగా సాగే ఛందస్సును పఠిస్తున్నప్పుడు కలిగే మానసికానందం వర్ణనాతీతం. కనుక పద్యం ఎప్పటికీ హృద్యమే.

బృహత్కావ్యలను రాసినవారి కంటే శతకాలను రాసినవాళ్లే రెండింతలు, మూడింతలుగా కనబడడం చూస్తుంటే శతకానికి గల ఆకర్షణ ఎటువంటిదో స్పష్టవౌతుంది. లోకంలో పద్య విద్యా వైభవానికి శతక ప్రక్రియ ఎంతగానో దోహదం చేసింది. జీవితంలో ఏదీ రాయలేకపోయినవారు కనీసం ఒక్క శతకాన్నైనా రాస్తారు. అదీ శతకానికి గల ప్రత్యేకత. అందుకే ‘శతకమా!’ వర్థిల్లు!

- డా. అయాచితం నటేశ్వరశర్మ,

ఈ సమాధానం మీకు సహాయపడుతుందని ఆశిస్తున్నాము

Answered by ppm3515
1

Answer:

I hope help u

Explanation:

నూరు పద్యాల సంకలనం శతకం. ఇంకొక ఎనిమిది అదనంగా చేర్చడం కూడా సంప్రదాయం. పద్యసాధనకు తొలినాళ్లలో అందరూ చేపట్టే ప్రక్రియ శతకం. శతకానికి ఛందోనియమం, మకుట నియమం, సంఖ్యా నియమం ఉంది. శతక పద్యాలను ఏ ఛందస్సులోనైనా రాయవచ్చు. కానీ శతకం ఆసాంతం అదే ఛందస్సులో కొనసాగాలి. ఏ మకుటం స్వీకరించినా, అదే మకుటం శతకం అంతా ఉండాలి. పద్య సంఖ్య నూరుగానీ, నూట ఎనిమిదిగానీ ఉండాలి. ఇదీ శతక ప్రక్రియలోని ప్రధాన లక్షణం. పద్యాలన్నీ ముక్తకాలుగానే ఉండటం పరిపాటి. ప్రతి పద్యానికీ విషయం మారుతూ ఉండటం వల్ల ప్రతి పద్యం ఒక్కొక్క ముత్యం (ముక్తం) వలె ఉంటుంది. నూట ఎనిమిది ముక్తకాల మాలిక అయిన శతకానికి ప్రాచీన కాలం నుండి ఎంతో ప్రాచుర్యం ఉంది. మహాకావ్యాలలో సైతం శతకాల ఛాయలు ఉండడం గమనార్హం. సాధారణంగా శతకాలు భక్తి, వేదాంతం, ప్రబోధం, ప్రచోదనం, జీవన సత్యావిష్కరణం, సంఘ సంస్కరణ, నీతి విద్య, ఆధ్యాత్మిక జ్ఞానం వంటి విషయాలను కలిగి ఉండటం సర్వత్రా కనబడుతుంది. కవిత్వం అంటే ఛందోమయమైనదే అని ప్రాచీనుల ఉపదేశం. ఛందోరహితమైన కవిత్వం ప్రపంచంలో లేనే లేదని లాక్షణికులు అంటారు. అంటే వచనంలోనూ ఛందస్సు ఉంటుందని వారి అభిప్రాయం కావచ్చు. బాణుడు, దండి వంటి మహా కవుల గద్యకావ్యాలలోనూ లయాత్మకత ఉంది. ఆ లయ ఒక్కటే ఛందస్సుకు మూలం అనుకుంటే లాక్షణికులు చెప్పిన అభిప్రాయం సరైనదే. గేయాలలో మాత్రాఛందస్సు, పద్యాలలో గణఛందస్సు సర్వసాధారణత.

పద్యాలు రాయాలనుకొనేవారు తొలుత శతకాన్ని ఎంచుకొంటారు. శతకాలు చాలావరకు ఉపజాతులైన ఆటవెలది, తేటగీతులలో ఉంటాయి. ఈ రెండు ఛందస్సులూ రాయడానికి సులువైనవి. అంతేగాక కలం పట్టిన తొలినాళ్లలో భావశబలత తక్కువగానే ఉంటుంది. కనుక చిన్న విషయాన్ని తీకొని చిన్న పద్యాన్ని అల్లడం నవకవులకు ఉపయుక్తం. యతితోబాటు ప్రాస యతికి కూడా వెసులుబాటు ఉండటం ఈ పద్యాల సౌలభ్యానికి మూలం. చివరి పాదాన్ని మకుటంతో పూరిస్తే మిగిలేవి మూడు పాదాలే కనుక రచనలో సౌలభ్యం అధికం. కనుక ప్రాథమిక స్థాయిలో పద్య రచనకు ఈ రెండు ఛందస్సులూ అనుకూలం. బాగా రాయగలిగిన పరిణత కవులు కూడా ఈ ఛందస్సులలో అద్వితీయ భావాలను పలికించారు. ప్రౌఢులకూ, ప్రారంభకులకూ ఎంతో అనువైనవిగా ఆటవెలదులూ, తేటగీతులూ కనబడుతాయి.

ఉత్పల, చంపక, శార్దూల, మత్త్భాలలో కూడా అద్భుత శతకాలను రాసిన కవులెందరో ఉన్నారు. ప్రతి పద్యం నిత్యనూతనంగా ఉండేవిధంగా చేయదగిన గుణం శతకానికి సొంతం. కావ్యాలూ, ప్రబంధాలూ అతి విస్తృతాలై ఉంటాయి. వాటిని రాయాలంటే సుదీర్ఘ కథాంశం, అనేక వర్ణనలూ కావాలి. వాటిని నిర్వహించే సామర్థ్యం తొలి నాళ్లలో ఎవరికీ ఉండదు. ‘ఒక కావ్యం రాయాలంటే వంద కావ్యాలు చదవాలి’ అంటారు పెద్దలు. అంటే ఏ ప్రక్రియను స్వీకరించినా, ఆ ప్రక్రియలో ఉన్నత ప్రమాణాలను అందుకొన్న గ్రంథాలను పరిశీలించనిదే కవికి సామర్థ్యం, శక్తి సాధ్యం కాదు. అంతటి తీరికా, ఓపికా లేనివారు సులభ సాధ్యమైన శతక ప్రక్రియను చేపట్టి తమ రచనా సామర్థ్యాన్ని పరీక్షించుకోవడం కనబడుతుంది.

సాధారణంగా శతకాలలో నీతి ప్రబోధం, భక్త్యావేశం ప్రధానాంశాలుగా కనబడుతాయి. మానవుని నిత్యజీవితానికి ఎంతో ఉపయుక్తమైంది నీతిపథం. ‘తప్పులు చేయడమే మనిషి నైజం’ అని ప్రాచీన సూక్తి. అడుగడుగునా ఎన్నో తప్పులు చేయడానికి అవకాశాలు మెండుగా ఉన్న నేపథ్యంలో నిత్యమూ మనిషికి నీతిబోధ అవసరమే కనుక ఆ అవసరాన్ని శతకాలు తీరుస్తున్నాయనుకోవచ్చు.

మనిషి పుట్టుక భగవంతుడు ఇచ్చిన వరప్రసాదమే. ప్రాణులలో నరజన్మ దుర్లభమనీ, అది ఎన్నో పూర్వ పుణ్యాలవల్ల లభిస్తుందనీ ప్రాచీన గ్రంథాలు చెబుతున్నాయి. కనుక మనిషి తనకు ఉత్తమ జన్మను ఇచ్చిన దేవతలకు కృతజ్ఞతగా భక్తి వచనాలకు సమర్పిస్తాడు. మనస్సులో ఆయా దేవతలను ప్రతిష్ఠించుకొని ఆవేశంతో చేసే స్తోత్రాలు శతకాలలో విరివిగా కనబడుతాయి. పాల్కురికి సోమన వృషాధిప శతకం, ధూర్జటి శ్రీకాళహస్తీశ్వర శతకం, కంచర్ల గోపన్న దాశరథి శతకం, బమ్మెర పోతన నారాయణ శతకం, శేషప్ప నరసింహ శతకం, మొదలైనవి ఆయా ఇష్టదేవతలను ఉద్దేశించి రచించిన భక్త్యావేశ శతకాలే.

ప్రాథమిక విద్యార్థులకు ‘యమాతారాజభాన సలగం’ అనే సూత్రంతో బోధించే ఛందోవిద్య ఎన్నో కవితామృత ఫలాలను లోకానికి అందిస్తోంది. ‘్ఛందం’ అంటే చాలామంది నియమం అనీ, కట్టడీ అనీ భావిస్తుంటారు. కానీ ‘్ఛందం’ అంటే స్వేచ్ఛ అనే అర్థమే ఉంది. కనుక స్వేచ్ఛా భావ ప్రకటనకు అనువైంది చందస్సు. ‘్ఛందం’ అంటే కప్పివేయడం, ఆహ్లాదపరచడం అనే అర్థాలూ ఉన్నాయి. కవిత్వానికి మార్మికత ప్రాణం కనుక పైకి కనబడే అర్థమే కాకుండా అంతరార్థం కూడా ఉక్తి వైచిత్రితో ధ్వనించినప్పుడు అది కవిత్వం అవుతుంది. కనుక ఛందస్సుకు కప్పివేసేది అనే అర్థం ఇలా సార్థకమైంది. ఆహ్లాదం కూడా ఛందస్సుకు గల లక్షణమే. లయబద్ధంగా సాగే ఛందస్సును పఠిస్తున్నప్పుడు కలిగే మానసికానందం వర్ణనాతీతం. కనుక పద్యం ఎప్పటికీ హృద్యమే

Similar questions