about trees in telugu
Answers
మర్రి (ఆంగ్లం Banyan) ఫైకస్ జాతికి చెందిన ఒక చెట్టు. ఇది బాగా విస్తరించిన శాఖలతో అనేకమైన ఊడలతో పెరిగే అతిపెద్ద వృక్షం. దీనినే వటవృక్షం అంటారు. ఇది బంగ్లాదేశ్, భారతదేశం, శ్రీలంక దేశాలలో విరివిగా పెరుగుతుంది.
దీని గింజలు వేరే చెట్టు పగుళ్ళలో లేదా ఒరలలో (ఒకోమారు పెద్ద భవనాలు, వంతెనలు, రాళ్ళ సందులలో) చిగురించి కాలక్రమాన విస్తరిస్తాయి. "మర్రి" (Banyan) అనే పేరు ప్రత్యేకించి ఫైకస్ బెంగలెన్సిస్ (Ficus benghalensis) అనే జాతికి చెందిన చెట్లకు చెందుతుంది, కాని ఆ విధమైన ఇతర చెట్లకు, "యురోస్టిగ్మా" ఉపజాతికి చెందిన వాటికి, అన్నింటికీ కూడా ఈ పేరును వాడుతారు.[1]
ఈ చెట్టు విత్తనాలు పళ్లు తినే పక్షుల చేత ఇతర ప్రదేశాలకు వెదజల్లబడతాయి. వేరే చెట్టుమీద పడి, దాని పగుళ్ళలో మొలకెత్తిన మొక్కల వేళ్లు క్రమంగా భూమికి ప్రాకుతాయి. కొమ్మలు ఆకాశంవైపు విస్తరిస్తాయి. ఇలా ఆశ్రయమిచ్చిన చెట్లను చుట్టుముట్టి పెరిగే లక్షణం ఉష్ణమండలంలో కాంతికోసం పోటీపడే చెట్లలో, ముఖ్యంగా "ఫికస్"జాతికి చెందినవాటిలో కనుపిస్తుంది.[2][3][4] కనుక వీటన్నింటికి strangler fig అనే ఆంగ్లపదం వాడుతారు.
భారతదేశంలో "బనియాలు ('వణికులు' లేదా 'వ్యాపారులు') తమ ప్రయాణాలలో తరచు ఈ చెట్ల నీడలో విశ్రాంతి తీసుకొనేవారు అని విదేశీ పరిశీలకులు గమనించినందువల్ల దీనికి "బనియన్ ట్రీ" (ఫికస్ బెంగాలెన్సిస్) అనే పేరు పెట్టారు.[5]
లక్షణాలుసవరించు
వెడల్పాటి అండాకారంగా గురుఅగ్రంతో ఉన్న సరళ పత్రాలు.పత్రగ్రీవాలలో జతలుగా ఏర్పడిన పైపాంథోడియం పుష్ప విన్యాసంలో అమరిన వర్ణరహిత పుష్పాలు.ఎరుపు రంగులో ఉన్న సైకోనస్ ఫలాలు.
విశేషాలుసవరించు
త్రిమూర్తులు మర్రిచెట్టు మీద ఉంటారని హిందువుల నమ్మకం.ఆంధ్ర ప్రదేశ్లో ఉన్న తిమ్మమ్మ మర్రిమాను ప్రపంచంలో అతిపెద్ద మర్రిచెట్టు కావచ్చును. ఇది అనంతపూర్ జిల్లాలో కదిరి దగ్గర కదిరి నుండి 27 కి.మీ. దూరంలో ఉంది. రాష్ట్ర అటవీశాఖ సమాచారం ప్రకారం ఇది 570 సంవత్సరాల చెట్టు. దీనికి 1650 (ఊడలు) వ్రేళ్లు ఉన్నాయి. [2]. తరువాత కలకత్తా లోని 'బొటానికల్ గార్డెన్స్' లోనిది, తరువాత చెన్నై లోని 'అడయారు' చెట్టు - వీటి తరువాత బెంగళూరు దగ్గరలో మైసూరు రోడ్డుపైని కుంబల్‌గోడ్ గ్రామంలో ఉన్న 400 సంవత్సరాల మర్రిచెట్టు నాలుగవది.[3] (మరింత నిర్దుష్టమైన ఆధారాలు కావాలి).మహబూబ్ నగర్ జిల్లాలోని పిల్లలమర్రి (వృక్షం) 700 సంవత్సరాల నాటిది.
ఉపయోగాలుసవరించు
మర్రిని మందుగా వాడటం మనకి ఎప్పటినుంచో ఉంది. దీని బెరడు, లేత ఆకులు, మొగ్గలు, పాలు, పళ్ళు అన్నిటినీ ఆయుర్వేదం ఎన్నో వ్యాధుల్లో వాడుతుంది. ముఖ్యంగా చర్మ సౌందర్యం కోసం తపన పడే వారు మర్రిని మరువకూడదు. మర్రి చెట్టు ఆకులు ఇంకా విచ్చుకోక ముందు ఎర్రగా మొగ్గల్లా ఉంటాయి. వాటిని రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని త్రాగితే తరచు విరేచనాలు, డిసెంట్రీతో బాధపడేవారికి మంచిది. మర్రిపాలు 5 చుక్కల్ని 1 గ్లాసుడు పాలలో కలిపి తీసుకుంటే బ్లీడింగ్ పైల్స్ కి మంచి మందు. ఇక ఊడల నుంచి జాలువారే లేత వేరులు స్త్రీల సంతాన సాఫల్యతను పెంచుతాయి. మర్రి వేర్లని ఎండించి, దంచి, పొడుము వలె చేసి పాలలో కలిపి ఋతుస్నానం అయిన తర్వాత వరుసగా 3 రాత్రుల పాటు తాగితే సంతానం కలుగుతుందని ఆయుర్వేదం చెబుతుంది. అలాగే మర్రి స్త్రీల జననాంగ సమస్యలలో కూడా బాగా ఉపకరిస్తుంది. మర్రి బెరడుని కషాయం కాచి దానిని గోరు వెచ్చగా ఉండగా యోని ప్రక్షాళన చేస్తే లుకేరియా తగ్గుతుంది. మర్రి ఊడలతో పళ్ళు తోముకుంటే దంత సమస్యలు రావు. మర్రి పాలు కీళ్ళ నొప్పులున్న చోట రాస్తే నొప్పులు తగ్గుతాయని గిరిజనుల నమ్మకం. మర్రి ఆకులు కోయగా వచ్చిన పాలను పులిపిరులమీద ఉంచితే అవి తగ్గిపోతాయి. పాదాలు పగిలిపోతే మర్రి చెట్టు కాండంనుంచి వచ్చిన రసాన్ని ఆ పగుళ్ళకి రోజూ రాస్తే ఉపయోగం ఉంటుంది.