about urban in Telugu language
Answers
Answered by
3
అర్బన్ అంటే మహా పట్టణం లేక నగరం. జన (నివాస) సాంద్రత ను బట్టి పట్టణంగా నిర్ణయిస్తారు. గత ఏభై సంవత్సరాలలో భారత్ దేశం లో ను , ప్రపంచం లోనూ నగరాల అభివృద్ధి పెరిగింది. ఎన్నో కొత్త నగరాలు వచ్చాయి. నగరాలలో జనాభా మిలియన్స్ లో ఉంటుంది. పెద్ద పెద్ద భవనాలు , స్కై స్క్రెపర్లు ఉంటాయి. పట్టణాలలో చాలా వ్యాపారం జరుగు తుంది. రాజకీయంగాను ఇంకా ఇతర విషయాలలోనూ పట్టణాలదే పైచేయి.
అర్బన్ ప్రాంతం లో 1950 లో కేవలం 1 బిలియన్ ప్రజాలుండేవారు. ఇపుడు ప్రపంచం జనాభా 7 బిలియన్లు. అర్బన్ ప్రాంతాలలో దాదాపు 4 బిలియన్ ప్రజలు ఉంటున్నారు.
జనసాంద్రత వల్ల మురికి, కాలుష్యం (పొల్యూషన్) ఎక్కువ. కానీ అన్నీ సౌకర్యాలుంటాయి. పరిపాలనా యంత్రం చేరువలో ఉంటుంది. అబివృద్ధి ఏదైనా ముందర నగరాలలోనే జరుగుతుంది. పట్టణాలలో చాలా మురికి వాడలు కూడా ఉంటాయి. వాటిల్లో పల్లెలనించి వచ్చిన ప్రజలు ఉంటారు. గత ఇరవై సంవత్సరాల నుండి ప్రజలు పల్లెల్లో ఉద్యోగాలు లేక నగరాలకి వలస వచ్చి ఏదో ఒక పని చూసుకొని బ్రతుకుతున్నారు.
పట్టణాలలో వినోదాలు చాలా ఉంటాయి. చూడవలసిన ప్రదేశాలు ఎన్నో. ప్రజలు అందరూ టిప్-టాప్ గా ప్రొఫెషనల్ గా ఉంటారు. మోసం చేసే వాళ్ళు ఎక్కువ. అందుకే ప్రజలు చాలా జాగ్రత్తగా ఉంటారు. పట్టణాలలో అన్నీ డబ్బులతో నే ముడి పడి ఉంటాయి. పట్టణాలలో అన్నిటికి ఖరీదు ఎక్కువ ఉంటుంది. ఒక చోటు నుండి ఇంకొకచోటు కు పోదానికి సమయం చాలా చాలా పడుతుంది. ఇన్కి నేరాలు , ఘోరాలు చాలా ఎక్కువ.
పల్లెటూరు మన భాగ్య సీమ అని కవులు పాడేవారు. ఇపుడు పట్టణమే మన బంగరు భూమి అంటున్నారు. పట్టణాల అభివృద్ధి సంబంధించిన సమస్యల కోసం మంత్రివర్గం ఒకటి రాష్ట్ర , కేంద్ర స్థాయిలలో ఉన్నాయి.
kvnmurty:
please click on the THANKS box/link above
Similar questions