Environmental Sciences, asked by meghana14838, 9 months ago

air pollution essay in telugu​

Answers

Answered by srisaisagarteja
1

Answer:

వాయువులో కలసియున్న మానవులకు మరియు పర్యావరణమునకు హాని కలిగించు ఏదైనా పదార్ధమును వాయు కాలుష్య కారకం అంటారు. కాలుష్య కారకాలు, ఘన, ద్రవ లేదా వాయు రూపములో ఉండవచ్చును.అంతేకాక అవి సహజముగా ఏర్పడవచ్చును లేక మానవ నిర్మితమై ఉండవచ్చును.[1]

కాలుష్య కారకాలు అవి ఉత్పన్నమగు విధానము ప్రకారము రెండు రకములుగా విభజింపవచ్చును - ప్రాథమిక లేదా ద్వితీయ రకాలు. సాధారణంగా ప్రాథమిక కాలుష్య కారకాలు ఏదైనా ప్రక్రియ నుండి నేరుగా ఉత్పన్నమైయ్యే పదార్ధాలు. ఉదాహరణకి అగ్ని పర్వతముల నుండి వచ్చే బూడిద, మోటారు వాహనముల నుండి వచ్చే కార్బన్ మోనాక్సైడ్ లేక ఫ్యాక్టరీ ల నుండి వచ్చే సల్ఫర్ డై ఆక్సైడ్ లాంటివి.

ద్వితీయ రకపు కాలుష్య కారకాలు నేరుగా ఉత్పన్నం కావు. ప్రాథమిక కాలుష్య కారకాలు చర్యలకు లోనవ్వడం వల్ల లేక వాయువులో కలిసినందు వల్ల ద్వితీయ కాలుష్య కారకాలు ఏర్పడును. ద్వితీయ రకపు కాలుష్య కారకాలకు ఒక ముఖ్యమైన ఉదాహరణ -భూమిని అంటిపెట్టుకుని ఉండే ఓజోన్ - ఫోటోరసాయనిక స్మోగ్ ఏర్పడుటకు కారణమైన ఎన్నో ద్వితీయరకపు కాలుష్య కారకములలో ఒకటి.

కొన్ని కాలుష్య కారకాలు రెండు రకాలుగా ఉండవచ్చును. అనగా అవి సరాసరిగాను (ప్రాథమిక) మరియు ఇతర ప్రాథమిక కాలుష్య కారకాల చర్యల వల్లనూ ఉత్పన్నమగును.

ముఖ్యమెన ప్రాథమిక కాలుష్య కారకాలు మానవ చర్యల కారణముగా ఏర్పడినట్టివి. వాటిలో:

సల్ఫర్ ఆక్సైడ్ (Sulfur oxide)లు (SOx) - ముఖ్యముగా సల్ఫర్ డై ఆక్సైడ్, SO2 ఫార్ములా కలిగిన ఒక రసాయనము మిశ్రమము.అగ్నిపర్వతాలు మరియు పెక్కు పారిశ్రామిక ప్రక్రియల వలన SO2 ఏర్పడుతుంది. బొగ్గు మరియు పెట్రోలియం లలో సల్ఫర్ మిశ్రమాలు కలిసి ఉండటంతో వాటిని మండించినప్పుడు సల్ఫర్ డై ఆక్సైడ్ ఉత్పన్నమవుతుంది. SO2 ఇంకా ఆక్సీకరణ చెందినప్పుడు, మామూలుగా NO2 అనే ఉత్ప్రేరకము ఉన్నచో,సల్ఫ్యూరికామ్లం ( H2SO4 ) ఉద్భవించును, అనగా ఆమ్ల వర్షము కురియును. అందుకే ఈ ఇంధనములను శక్తి వనరులుగా వాడినచో పర్యావరణంపై దీని ప్రభావం ఏ విధముగా ఉండగలదో అని ఆలోచించుట ఎంతైనా అవసరము.

నై

నలుసు పదార్ధము (Particulate matter) - నలుసులు / రేణువులు, లేక అతి సన్నని బిందువులు అని కూడా పిలువబడు నలుసు పదార్దములు గాలిలో చేరిన అతి చిన్న ఘన లేక జల నలుసులు.ఏరోసోల్ అనగా వాయువు మరియు అందులో మిళితమైన నలుసులు.లేసమాత్రమైన పదార్థము యొక్క మూలము మానవ నిర్మితము లేక సహజ సిద్ధము కావచ్చును.కొన్ని నలుసులు సహజ సిద్ధముగా అగ్నిపర్వతములు, గాలిడుమారములు, అడవి మరియు గడ్డి ప్రదేశముల మంటలు, చెట్లూ చేమల జీవక్రియలు మరియు సముద్రములలోనించి పైకి చెదిరే నీళ్ళ వలన ఏర్పడును.వాహనములలో మండే భూగర్భము నుండి తీసిన ఇంధనములు, పవర్ ప్లాంట్స్ మరియు పెక్కు పారిశ్రామిక విధానములు మున్నగు మానవ ప్రక్రియలు కూడా మెండుగా ఏరోసోల్ లను ఉద్భావింపచేయును.నేడు ప్రపంచం మొత్తం మీద, మొత్తము వాతావరణంలోని ఏరోసోల్ లలో 10 శాతం, అన్త్రోపోజేనిక్ ఏరోసోల్ లు - మానవ సంబంధిత ప్రక్రియల వలన ఏర్పడినవి. గాలిలో చిన్న రేణువుల కలయిక పెరుగుట గుండె జబ్బులు, మారిన శ్వాస కోస ప్రక్రియ మరియు ఉపిరితిత్తుల క్యాన్సర్ మున్నగు పెక్కు ఆరోగ్య సమస్యలకు దరి తీయుచున్నది.

సీసము (lead), కాడ్మియం (cadmium) మరియు రాగి (copper) మున్నగు విషతుల్య లోహము (metal)లు.

క్లోరోఫ్లోరోకర్బనులు (Chlorofluorocarbons) (CFC)లు - ఓజోన్ పొరకు (ozone layer) హానికరములు. ఇవి ప్రస్తుతము బ్యాన్ చేయబడిన వస్తువుల నుండి వెలువడును.

అమ్మోనియా (Ammonia) (NH3) - వ్యావసాయిక ప్రక్రియలలో జనించును.అమ్మోనియా మిశ్రమము యొక్క ఫార్ములా NH3.ఇది సాధారణ స్థితిలో స్వాభావికమైన తీక్షణమైన వాసనా కలిగిన వాయువుగా లభ్యమగును.అమ్మోనియా ఆహార పదార్థములలోను ఎరువుల్లోనూ అగ్రగామిగా ఉంటూ, భూమి మీద ఉండే జీవులకు అవసరమైన పోషకాలను అందించుటలో గణనీయంగా సాయం చేస్తుంది. ప్రత్యక్షంగా గానీ లేదా పరోక్షంగా గానీ అమ్మోనియా ఎన్నో మందుల తయారీలో వాడబడుతుంది. ఇంతగా వాడబడుచున్న అమ్మోనియా క్షరము మరియు హానికలిగించునది కూడా.

చెత్త, మురుగు కాలువలు మరియు పారిశ్రామిక ప్రక్రియలలో వెలువడే వాసన (Odor)లు

రేడియోధార్మిక కాలుష్యాలు (Radioactive pollutants) - న్యూక్లియర్ విస్ఫోటాలు (nuclear explosions), యుద్ధ పేలుడు సామగ్రి (explosives) మరియు రాడాన్ (radon) రేడియోధార్మిక క్షయం (radioactive decay) మున్నగు సహజ ప్రక్రియల వల్ల ఏర్పడతాయి

రెండో రకపు కాలుష్యాలు:

నలుసు పదార్థము వాయు రోపంలోని ప్రాథమిక కాలుష్యాలు మరియు మిశ్రమాలచే ఫోటో రసాయనిక స్మోగ్ ల ను౦డి ఏర్పడును.స్మోగ్ అనేది ఒక విధమైన వాయు కాలుష్యము; స్మోగ్ అనే పదము ఆంగ్లంలోని స్మోక్ మరియు ఫాగ్ అను పదముల మొదటి ఆఖరి అక్షరముల కలయిక.ఒకే ప్రదేశంలో ఎక్కువ మొత్తాలలో బొగ్గు కాలుట వలన పొగ మరియు సల్ఫర్ దయాక్సైడ్ల మిశ్రమము ఏర్పడి క్లాస్సిక్ స్మోగ్ కు దారి తీయును. నేటి పరిస్థితులలో స్మోగ్ మాములుగా బొగ్గు నుండి కాక వాహన మరియు పారిశ్రామిక వ్యర్ధ వాయువుల పై వాతావరణంలో సూర్యరశ్మి ప్రభావంతో ఏర్పడే రెండో రకపు కాలుష్యాలు మరల మొదటి రకపు కాలుష్యములతో కలసి ఫోటోకెమికల్ స్మోగ్ తయారవుతుంది.

భూ మట్టపు ఓజోన్ (Ground level ozone) (O3), NOx మరియు (VOC)ల నుండి తయారగును..ఓజోన్ (O3) భూమిని ఆవరించి ఉన్న పొరలలో ఒకటైన త్రోపోస్ఫియర్ అతి ముఖ్యమైన పాత్రధారి. (అలాగే అది స్త్రాతోస్ఫియర్ లోని కొన్ని ఇతర పొరలలో ముఖ్య పాత్ర వహించును. అ పోరలన్నితిని కలిపి ఓజోన్ పొర అంటారు).పగలు, రాత్రి కూడా వాతావరణంలో జరిగే అనేక ఫోటో రసాయనిక మరియు రసాయనిక చర్యలలో ఓజోన్ ముఖ్య పాత్ర వహిస్తుంది.మానవ చర్యల వల్ల (ముఖ్యంగా రాతి ఇంధనం మండటం ద్వారా) ఎక్కువ నిష్పత్తిలో ఉన్నచో ఇది ఒక కాలుష్య కారకము కాగలదు మరియు స్మోగ్ తయారీలో భాగము పంచుకొంటుంది.

అదే విధంగా NOx మరియు (వోక్)ల నుండి పెరక్సి అసితిల్ నిత్రేట్ (Peroxyacetyl nitrate) (PAN) తయారవుతుంది.

స్వల్పమైన ప్రభావము కలిగిన వాయు కాలుష్యాలు

Similar questions