autobiography of ant in telugu small
Answers
Answer:
Explanation:
చీమ (ఆంగ్లం: Ant) ఒక చిన్న కీటకము. ఇది తనకంటే రెట్టింపు బరువును మోయగలుగుతుంది. ఇవి భూమిని గుల్లగా చేస్తూ పుట్టలను కడుతుంటాయి.
ఐకమత్యం అనగానే ముందు చీమలే గుర్తుకొస్తాయి. ఒకే పుట్టలో కలిసి ఉండడమే కాదు, వాటి పని అవి సక్రమంగా చేసుకోవడంలో ఎంతో క్రమశిక్షణ పాటిస్తాయి కూడా. చీమలు పుట్టుకొచ్చింది కందిరీగల నుంచే. ఇవి సుమారు 10 కోట్ల ఏళ్ళ కిందట కందిరీగలతో విడిపోయి, ప్రత్యేక జీవులుగా రూపొందాయి. సుమారు 11,880 జాతులుగా ఉన్న వీటిల్లో ఇటీవల కొత్తరకం చీమను శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ప్రపంచంలో మొత్తం చీమలను కలిపితే వాటి బరువు, మనుషుల బరువు కన్నా ఎక్కువ ఉంటుంది.[1]
మానవులకు మల్లే చీమలకు ఊపిరితిత్తులు, గుండె ఉండవు. రక్తానికి రంగు కుడా ఉండదు. అయినా, తమ కన్నా 20 రెట్ల బరువునైనా ఇట్టే మోస్తాయి. ఇది ఒక సాధారణ మానవుడు 1000 కిలోల బరువు మోయడంతో సమానం మరి. శరీరం పై కవచానికి ఉండే సన్నని రంధ్రాల ద్వారా శ్వాస తీసుకుంటాయి. బయటకు కనబడేవి రెండు కళ్ళే అయినా, వాటిల్లోనే చిన్నచిన్న కళ్ళు బోలెడన్ని కలిసి ఉంటాయి. ఈగలకు ఉన్నట్టుగా అన్నమాట. తల మీద అటూ ఇటూ కదిలే కొమ్ముల్లాంటి అంటెన్నాలతో, తాము విడుదల చేసే రసాయనాల వాసనను పసిగట్టి మాట్లాడేసుకుంటాయి. ఇక చీమల కోరలు బలం అంతా ఇంతా కాదు.