Bharat desam gopathnam in telugu
Answers
Answer:
భారత గణతంత్ర రాజ్యము నూటఇరవై కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశాలలో రెండవది. వైశాల్యములో ప్రపంచంలో ఏడవది. భారత ఆర్ధిక వ్యవస్థ యొక్క స్థూల జాతీయోత్పత్తి ( పర్చేసింగ్ పవర్ పారిటీ) ప్రకారం నాలుగో స్థానంలో ఉంది. ప్రపంచంలో అతివేగంగా వృద్ధి చెందుతున్న వ్యవస్థలలో ఇది ఒకటి. ప్రపంచం లోనే అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యము ఐన భారతదేశం, ప్రపంచంలోనే అతి పెద్ద సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగన దేశంగా ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఆవిర్భవించింది.
దక్షణాసియాలో ఏడు వేల కిలోమీటర్లకు పైగా సముద్రతీరము కలిగి ఉండి, భారత ఉపఖండములో అధిక భాగాన్ని కూడుకొని ఉన్న భారతదేశం, అనేక చారిత్రక వాణిజ్య రహదారుల పైన ఉంది. దక్షిణాన హిందూ మహాసముద్రం, నైరుతిన అరేబియా సముద్రం, మరియు ఆగ్నేయాన బంగాళాఖాతం ఎల్లలుగా ఉన్నాయి. పాకిస్తాన్, చైనా, మయన్మార్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ మరియు ఆఫ్ఘానిస్తాన్[1]దేశాలతో సరిహద్దులను పంచుకుంటోంది. శ్రీలంక, మాల్దీవులు మరియు ఇండోనేసియా భారతదేశం దగ్గరలో గల ద్వీప-దేశాలు. భారతదేశము కొన్ని పురాతన నాగరికతలకు పుట్టిల్లు మరియు నాలుగు ముఖ్య ప్రపంచ మతాలకు (హిందూ మతము, బౌద్ధ మతము, జైన మతము మరియు సిక్కు మతము) జన్మనిచ్చింది. 18 వ శతాబ్దం నుండి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ క్రమంగా స్వాధీనం చేసుకోవడంతో భారతదేశం బ్రిటిష్ కంపెనీ పరిపాలన కిందకు వచ్చింది. 19 వ శతాబ్దం మధ్య నుండి నేరుగా యునైటెడ్ కింగ్డమ్ నుండే పాలించబడింది. మహాత్మా గాంధీ నాయకత్వాన స్వాతంత్ర్యం కోసం చేసిన అహింసాయుత పోరాటం తర్వాత 1947 లో ఒక స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది. 1947లో బ్రిటిష్ పరిపాలన నుండి విముక్తి పొందింది.
భారత ఆర్థిక వ్యవస్థ నామమాత్ర GDP మరియు కొనుగోలు శక్తి తుల్యత (PPP) ద్వారా మూడవ అతిపెద్ద ద్వారా ప్రపంచ పదకొండో స్థానంలో ఉంది. 1991 లో మార్కెట్ ఆధారిత ఆర్థిక సంస్కరణలు అనుసరిస్తూ, భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక దేశాలలో ఒకటి అయింది.భారత దేశన్ని కొత్తగా పారిశ్రామీకరణ జరిగిన దేశంగా భావిస్తారు. అయితే, పేదరికం, నిరక్షరాస్యత, అవినీతి, పోషకాహార లోపం, మరియు తగని ప్రజా ఆరోగ్య సవాళ్లను ఎదుర్కుంటూ ఉంది. ఒక అణ్వాయుధ మరియు ప్రాంతీయ శక్తి, ప్రపంచంలో మూడవ అతిపెద్ద సైన్యం కలిగి ఉంది. ప్రపంచ దేశాల సైనిక వ్యయంలో ఎనిమిదవ స్థానంలో ఉంది. భారతదేశం 29 రాష్ట్రాలు మరియు 7 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ కింద పాలించబడే ఒక ఫెడరల్ రాజ్యాంగ గణతంత్రం. భారతదేశం ఒక, బహుభాషా, మరియు బహుళ జాతి సొసైటీ. ఇది వివిధ వన్యప్రాణుల వైవిధ్యం గల దేశము.
Jai hind
Explanation:
please mark me as BRAINLIEST