Music, asked by modi9756, 1 year ago

biography of sachin tendulkar in telugu

Answers

Answered by CristianoRonaldoCR7
16
సచిన్ రమేష్ టెండూల్కర్ (24 ఏప్రిల్ 1973 న జన్మించాడు) ఒక మాజీ భారత క్రికెటర్ మరియు ఒక మాజీ కెప్టెన్, అన్ని కాలాలలోనూ గొప్ప బ్యాట్స్మన్గా పేరు గాంచాడు.అంతర్జాతీయ క్రికెట్ లో ఎట్టకేలకు అత్యధిక పరుగులు సాధించిన సచిన్, పదకొండు సంవత్సరాల వయస్సులో కరాచీలో పాకిస్థాన్తో 1989 నవంబరు 15 న తన తొలి టెస్టులో అరంగేట్రం చేశాడు, ఇరవై-నాలుగు సంవత్సరాలకు దగ్గరగా దేశీయంగా మరియు అంతర్జాతీయంగా ముంబైకు ప్రాతినిధ్యం వహించాడు. వన్ డే ఇంటర్నేషనల్లో డబుల్ సెంచరీ సాధించిన మొట్టమొదటి బ్యాట్స్మన్, వన్ డే మరియు టెస్ట్ క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన రికార్డును కలిగి ఉన్నాడు మరియు అంతర్జాతీయ క్రికెట్లో 30,000 కంటే ఎక్కువ పరుగులను పూర్తి చేసిన ఏకైక ఆటగాడు.
Answered by Anonymous
12

ప్రపంచ క్రికెట్ క్రీడా చరిత్రలో ప్రఖ్యాతి గాంచిన భారతీయ ఆటగాడు సచిన్ రమేష్ టెండుల్కర్ (Sachin Ramesh Tendulkar) (Marathi: सचिन रमेश तेंडुलकर). క్రికెట్ క్రీడకు భారతదేశంలో అత్యధిక జనాదరణకు కారకుడై, చిన్న పిల్లలు మొదలు ముసలివాళ్ళ మనసులను సైతం దోచుకున్న వర్తమాన క్రికెటర్ టెండుల్కర్ ఏప్రిల్ 24, 1973 న జన్మించాడు.

16-నవంబర్-2013 నాడు తన 40వ ఏట 200వ టెస్ట్ మ్యాచ్ పూర్తి చేసి, అంతర్జాతీయ క్రీడారంగం నుంచి విరమించుకుంటున్న సందర్భంలో భారతప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారమైన భారత రత్నను ఈయనకు ప్రకటించింది. ఈ విధంగా ఈ అవార్డును పొందిన ప్రథమ క్రీడాకారునిగా మరో రికార్డు నెలకొల్పాడు సచిన్ టెండూల్కర్.

ఈనాడు భారత్ లో ఈ క్రీడకు ఇంత జనాదరణ ఉందంటే అదంతా సచిన్, అతని ఆట తీరు కూడా ఒక కారణం. 1990 దశకంలో భారత క్రికెట్ లో మెరుపులు మెరిపించి ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఆటగాడు సచిన్. భారత జట్టుకు ఆపద్భాందవుడిగా ఎన్నో విజయాలు అందజేసిన ఈ ముంబాయికి చెందిన బ్యాట్స్‌మెన్ ను పొగడని వారు లేరనే చెప్పవచ్చు. 2002లో విజ్డెన్ పత్రిక టెస్ట్ క్రికెట్ లో ఆస్ట్రేలియాకు చెందిన డాన్ బ్రాడ్‌మెన్ మరియు వన్డే క్రికెట్ లో వెస్ట్‌ఇండీస్ కు చెందిన వివియన్ రిచర్డ్స్ ల తర్వాత క్రికెట్ క్రీడా ప్రపంచంలోనే సచిన్ ను రెండో అత్యున్నత బ్యాట్స్‌మెన్ గా ప్రకటించింది.[1] . 2003లో మళ్ళి తిరగరాసి వన్డే క్రికెట్ లో వివియన్ రిచర్డ్స్కు రెండో స్థానంలోకి నెట్టి సచిన్ ను అగ్రస్థానంలో నిలబెట్టారు. అతని యొక్క ఆటతీరు, ఆట లోని నైపుణ్యం ఎంత చూసిననూ తనవి తీరదని అభిమానుల నమ్మకం. అతను అవుటైన వెంటనే టి.వి.లను కట్టేసిన సందర్భాలు, స్టేడియం నుంచి ప్రేక్షకులు వెళ్ళిన సందర్భాలు కోకొల్లలు. టెస్ట్ రికార్డులు చూసిననూ, వన్డే రికార్డులు చూసిననూ అడుగడుగునా అతని పేరే కన్పిస్తుంది. లెక్కకు మించిన రికార్డులు అతని సొంతం.టెస్ట్ క్రికెట్ లో అత్యధిక పరుగులలో అక్టోబర్ 17, 2008 న వెస్ట్‌ఇండీస్ కు చెందిన బ్రియాన్ లారాను అధికమించి మొదటి స్థానం సంపాదించాడు. వన్డే క్రికెట్ లో అత్యధిక పరుగుల రికార్డు అతనిదే. ఇక సెంచరీల విషయంలో అతనికి దరిదాపుల్లో ఎవరూ లేకపోవడం గమనార్హం. లిటిల్ మాస్టర్ లేదా మాస్టర్ బ్లాస్టర్ [2][3] అని పిలువబడే సచిన్ 1989లో అంతర్జాతీయ క్రికెట్ లో ఆరంగేట్రం చేశాడు. 1997-1998లో రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న పొంది ఈ అవార్డు స్వీకరించిన ఏకైక క్రికెట్ క్రీడాకారుడిగా నిల్చాడు. ఇప్పటి వరకు క్రికెట్ క్రీడా జగత్తులోని అత్యంత ప్రముఖమైన క్రీడాకారులలో ఒకరు సచిన్ టెండుల్కర్..[4][5][6]

2010 ఫిబ్రవరి 24 న దక్షిణాఫ్రికాతో జరిగిన ఒకరోజు అంతర్జాతీయ మ్యాచ్ లో సచిన్ 200 పరుగులు సాధించిన మొట్ట మొదటి ఆటగాడిగా కొత్త రికార్డు సృష్టించాడు. అలాగే 2010 డిసెంబర్ 19 న దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో తన 50వ సెంచరి పూర్తి చేసి టెస్టుల్లో మరే క్రికెటర్ అందుకోని మైలురాయిని అధిరోహించాడు. 2012, మార్చి 16న అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లలో (వన్డేలు, టెస్టులు కలిపి) ఎవరూ సాధించని 100వ సెంచరీతో కొత్తరికార్డు సృష్టించాడు.

Similar questions