BONJOUR !!
Anndata, Essay in telgu language :::::: 100-150 words please fast *****
Answers
నష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రకటించింది. తాజాగా ఈ పథకంపై బుధవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది. అన్నదాతా సుఖీభవ పథకం కింద ప్రతి రైతు కుటుంబానికీ రూ.10వేలు అందజేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు విధివిధానాలను ఖరారుచేసిన మంత్రివర్గం, కేంద్రం ప్రకటించిన రూ.6వేలతో పాటు ప్రభుత్వం తరఫున రూ.4వేలు ఇవ్వాలని తీర్మానించింది. అంతేకాదు కేంద్ర పథకానికి అర్హులు కానివారికి రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా రూ.10 వేలు అందజేయనుంది. కౌలు రైతులను కూడా ఇందుకు అర్హులుగా పేర్కొంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న ఖరారుచేసిన విధివిధానాలను వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆ వివరాలను వెల్లడించారు.